సర్దార్ విడదుల పక్కానా? కాదా?

సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల తేదీ ఇప్పటి దాకా అయితే ఏప్రిల్ 8 నే. అయితే ఆ తేదీకి పనులు అవుతాయా లేదా అని సినిమా యూనిట్ కిందిమీదా అవుతోంది. 14వ తేదీకి మారే…

సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల తేదీ ఇప్పటి దాకా అయితే ఏప్రిల్ 8 నే. అయితే ఆ తేదీకి పనులు అవుతాయా లేదా అని సినిమా యూనిట్ కిందిమీదా అవుతోంది. 14వ తేదీకి మారే ఆప్షన్ ను కూడా కొట్టి పారేయలేమని వార్తలు వినవస్తున్నాయి.  ఎందుకంటే సెన్సారు కోసం 31న స్లాట్ తీసుకున్నారు. అయితే దాన్ని ఏప్రిల్ రెండవ తేదీకి మార్చమని రిక్వెస్ట్ లెటర్ పంపినట్లు వార్తలు అందుతున్నాయి. 

రెండు పాటలకు ఓ పాట పూర్తి చేసి, ఆన్ లైన్ ఎడిటింగ్ చేసి, విదేశాల నుంచి ఇక్కడకు పంపించారని తెలుస్తోంది. ఇంకోపాట ఫినిష్ చేసుకుని పవన్ రేపు లేదా ఎల్లుండి ఇక్కడకు రావాలి. వచ్చి డబ్బింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలి. ఈ లోగా ఇక్కడ బ్యాలెన్స్ పనులు కావాల్సి వుంది. 

ఇంత పరుగులు,ఉరకలు పెడితే తప్ప 8కి విడుదల చేయడం కష్టం. సర్దార్ వ్యవహారం ఇలా వుంటే 14న విడుదల కావాల్సిన సినిమాలు, డైలామాలో పడ్డాయి.సర్దార్ వస్తే ఆ సినిమాలు వెనక్కువెళ్లడమో, మరోటో అవుతుంది. ఇదిలా వుంటే 22న విడుదల కావాల్సిన సరైనోడు మాత్రం..దాదాపు అన్నీ పూర్తి చేసుకుని, హడావుడి లేకుండా నెమ్మదిగా రెడీ అవుతోంది.