అసిన్ పెళ్లిలో ఆయనకే ప్రత్యేక ఆతిథ్యం!

అసిన్ వివాహ వేడుకలో ఆయనకు ప్రత్యేక ఆతిథ్యం దక్కింది. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో అసిన్ దంపతులు దగ్గరుండి ఆయనకు మర్యాదలు చేశారు. ఇంతలా ప్రత్యేక ఆతిథ్యం దక్కించుకున్న ఆ ప్రత్యేక వ్యక్తి మరెవరో…

అసిన్ వివాహ వేడుకలో ఆయనకు ప్రత్యేక ఆతిథ్యం దక్కింది. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో అసిన్ దంపతులు దగ్గరుండి ఆయనకు మర్యాదలు చేశారు. ఇంతలా ప్రత్యేక ఆతిథ్యం దక్కించుకున్న ఆ ప్రత్యేక వ్యక్తి మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఇది వరకూ అసిన్ తో కలిసి  నటించిన ఈ హీరోకి ఆ హీరోయిన్ వివాహ వేడుకలో ప్రత్యేక ఆదరణ కనిపించింది.

ఎందుకలా అంటే.. అటు అసిన్ కు ఇటు ఆమె భర్త రాహుల్ శర్మకు అక్షయ్ కుమార్ చాలా కావాల్సిన వ్యక్తి. ఒకరకంగా చెప్పాలంటే వీరి వివాహానికి కారణమే ఆయన! అసిన్ ను రాహుల్ శర్మకు ఇంట్రడ్యూస్ చేసిందే అక్షయ్ కుమార్ అని తెలుస్తోంది. అసిన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న తరుణంలో ఆమెను తన స్నేహితుడైన రాహుల్ కు పరిచయం చేశాడట ఈ బాలీవుడ్ యాక్షన్ హీరో. అక్షయ్ పుణ్యానా కలిగిన ఈ పరిచయమే.. తర్వాతి కాలంలో రాహుల్, అసిన్ లను మరింత దగ్గర చేసింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది.. ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చింది. 

ఈ విధంగా తమ మ్యాచ్ మేకర్ అయిన.. అక్షయ్ ను ప్రత్యేక  వ్యక్తిగా భావిస్తారు అసిన్ దంపతులు. అందుకే తమ వివాహ వేడుకలో.. ఆయనను ప్రత్యేకంగా చూసుకున్నారు.