పవన్ లేఖను లీక్ చేసింది ఎవరు?

పవన్ కళ్యాణ్ తనకు రెండు కోట్లు నాన్నకు ప్రేమతో నిర్మాత ఇవ్వాలని మా అసోసియేషన్ కు రాసిన లేఖ నిన్నటికి నిన్న ఉవ్వెత్తున ఎగసి చప్పున చల్లారిపోయింది. అయితే ఈ హడావుడి ఎలా రేగింది?…

పవన్ కళ్యాణ్ తనకు రెండు కోట్లు నాన్నకు ప్రేమతో నిర్మాత ఇవ్వాలని మా అసోసియేషన్ కు రాసిన లేఖ నిన్నటికి నిన్న ఉవ్వెత్తున ఎగసి చప్పున చల్లారిపోయింది. అయితే ఈ హడావుడి ఎలా రేగింది? ఎవరు రాజేసారు? అన్న అనుమానాలు మాత్రం ఇండస్ట్రీలో మిగిలిపోయాయి. ఎందుకంటే పవన్ ఈ లేఖను చాలా గుట్టుచప్పుడు కాకుండా పంపించినట్లు వినికిడి. 

అది కూడా పెద్ద సీరియస్ గా కాదని తెలుస్తోంది…పక్కన వున్నవాళ్లు ఎవరో, గతంలో మాట ఇచ్చారు కదా..అడుగుదాం అని పవన్ కు సలహా ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ముందు ఆ నిర్మాతకు ఫోన్ చేస్తే, కలుద్దాం..కలిసి ఓ సారి మట్లాడదాం అని అన్నట్లు తెలుస్తోంది. పవన్ కు పక్కనున్నవాళ్లు, సరైన సమాధానం రాలేదు కనుక అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్దామంటే, ఆయన ఊ అన్నట్లు వినికిడి.

వెంటనే పవన్ మనుషులు ఫర్ సంతకం చేసి కామ్ గా లెటర్ ఇచ్చారు. ఇంత షార్ట్ పిరియడ్ లో కుదరదని చాంబర్ చెప్పేసింది ఆ వెంటనే. కానీ అప్పటి కప్పుడు పవన్ లేఖ విషయం బయటకు పొక్కింది. అది ఏ రేంజ్ లో పొక్కింది అంటే, నాన్నకు ప్రేమతో సినిమా ఆగిపోతుందన్న రేంజ్ లో. 

కానీ సమస్య ఏమిటంటే, దీనివల్ల అనవసరంగా పవన్ బదనామ్ అయ్యారు. బివివిఎస్ఎన్ ప్రసాద్ కాకుండా మరే నిర్మాత అయినా పవన్ ఇంతలా బదనామ్ అయ్యేవారు కాదు. మంచి నిర్మాతగా ఆయనకు వున్న పేరు, పవన్ కు రివర్స్ గా పని చేసింది. అదీ విషయం.