సినిమా అభిమానులకు సంక్రాంతి చాలా ఇష్టమైన సీజన్. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా నాలుగు క్రేజీ సినిమాలు వస్తున్నాయి. ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాలను చూసి తెలుగువారి పెద్ద పండగను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, శర్వానంద్ లు వరసగా నాలుగు భిన్నమైన సబ్జెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి జనవరిలో ఇలాంటి సినిమా పండగ ఉత్సాహ పరుస్తుండగా… ఈ సీజన్ అయిపోగానే.. ఫిబ్రవరి లో కూడా సినిమా అభిమానులకు మరో పండగ రెడీ గా ఉంది!
సంక్రాంతి సీజన్ లో వరసగా నాలుగు సినిమాలు విడుదల కానున్నట్టుగానే ఫిబ్రవరిలోనూ వరసగా నాలుగు సినిమాలు విడుదల కాబోతూ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సంక్రాంతి తో సమానమైన సీజన్ గా నిలవనుంది ఫిబ్రవరి నెల. ఫ్రిబదరి ఐదో తేదీన ఏకంగా మూడు సినిమాలు విడుదల కానుండటం విశేషం. వీటిలో కృష్ణాష్టమి, స్పీడున్నాడు, కృష్ణ గాడి వీర ప్రేమథ.. ఉన్నాయి. సంక్రాంతికే విడుదల అవుతుందనుకున్న కృష్ణాష్టమి.. ఇప్పుడున్న పోటికి జడిసి.. ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇక తమిళ సినిమాకు రీమేక్ గా వస్తున్న బెల్లంకొండ సాయి “స్పీడున్నోడు'' సునీల్ సినిమాకు పోటీగా వస్తోంది. “భలేభలేమగాడివోయ్'' తో క్రేజీయెస్ట్ హీరోగా మారిన నాని కూడా అదే రోజున తన సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మరి ఇవే అనుకొంటే.. ఆ తర్వాతి వారంలోనే త్రివిక్రమ్, నితిన్ ల కాంబోలోని “అ..ఆ'' విడుదల కానుంది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు.. క్రేజ్ గురించి వేరే వివరించనక్కర్లేదు. “సన్నాఫ్ సత్యమూర్తి' తో కొంత నిరాశ పరిచిన త్రివిక్రమ్ ఈ సారి తమను పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి నెలలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఆసక్తిని రేపుతున్నాయి. దీంతో ఆ నెల సంక్రాంతికి సమానమైన స్థాయిలో నిలుస్తోంది!