కమల్ కాపీ కొట్టినా.. న్యాయం చేస్తాడులే..!

‘‘తుంగావనం’’ తెలుగులో ‘చీకటి రాజ్యం’ కమల్ హాసన్ సినిమా. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొంది. త్రిష, మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్, మధుశాలినీ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కమల్…

‘‘తుంగావనం’’ తెలుగులో ‘చీకటి రాజ్యం’ కమల్ హాసన్ సినిమా. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొంది. త్రిష, మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్, మధుశాలినీ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కమల్ శరవేగంగా పూర్తి చేసిన సినిమా ఇది. ఇటీవలే కమల్ తమిళ వెర్షన్ ‘దృశ్యంను విడుదలచేశాడు. ఇంతలోనే మరో సినిమాతో రెడీ అయిపోయాడు.

ఇప్పటికే ఈ సినిమా కాపీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్లీప్ లెస్ నైట్స్’’ అనే ఫెంచ్ సినిమా స్ఫూర్తిగా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా విడుదల కాకముందే ఇలాంటి ప్రచారం వచ్చిందంటే.. దాన్ని కమల్ ఇంత వరకూ ఖండించలేదు అంటే… ఇది కచ్చితంగా ఇన్ స్పైర్డ్ సబ్జెక్టే అనుకోవాలి. ఇలా ఇన్ స్పిరేషన్ తో సినిమాలు రూపొందించడం కమల్‌కు కొత్తేమీ కాదు. గతంలో కమల్ నటించి, రచించి, దర్శకత్వం వహించిన సినిమాలు అనేకం విదేశీ సినిమాల నుంచి తెచ్చుకొన్న  మూల కథకు డెవలప్ మెంట్సే.

అయితే వాటిని లోకలైజ్ చేయడంలో కమల్ తన ప్రతిభను ప్రదర్శించారు. గొప్ప ట్రీట్ మెంట్‌తో ఆ సినిమాలను చక్కగా తీర్చిదిద్దాడు విశ్వనాయకుడు. మరి ఇప్పుడు కూడా కమల్ ఆ తరహా ప్రతిభనే ప్రదర్శించి ఉంటాడు అనుకోవాలి. మరి ఈ ‘చీకటిరాజ్యం’ ఎలా ఉంటుందో!