అన్నపూర్ణ ఏడెకరాలకు ముప్పు?

అన్నపూర్ణ స్టూడియోస్ ఏడు ఎకరాల స్థలం ఎప్పుడూ వివాదాస్పదమే. ఏదో ఒక వార్త వినవస్తూనే వుంటుంది. ఇప్పుడు మరోసారి ఆ ఏడెకరాల స్థలంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. మెట్రో రైల్వే లైన్ కారణంగా ఇప్పుడు అన్నపూర్ణ…

అన్నపూర్ణ స్టూడియోస్ ఏడు ఎకరాల స్థలం ఎప్పుడూ వివాదాస్పదమే. ఏదో ఒక వార్త వినవస్తూనే వుంటుంది. ఇప్పుడు మరోసారి ఆ ఏడెకరాల స్థలంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. మెట్రో రైల్వే లైన్ కారణంగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లోంచి కొద్దిగా స్థలం తీసుకుంటే ఎలా వుంటుందీ అన్న ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ఓ ప్రజా ప్రతినిధి ఒకరు నాగార్జునతో భేటీ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మెట్రో రైలు లైను అన్నపూర్ణ స్టూడియో ఏడకరాలకు ముందున్న లైన్ నుంచి వెళ్లోంది. దానివల్ల చాలా మంది ఇళ్లుపోతున్నాయి. వీళ్లకు ఆల్టర్ నేటివ్ చూపించడానికో, లేదా అలైన్ మెంట్ విషయంలో అన్నపూర్ణ స్థలం తీసుకోవడానికో..మొత్తానికి దేనికో ఈ భేటీ జరిగిందని వార్తలు వినవస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియాల్సి వుంది.