పవన్ (ను)ఎందుకు ప్రశ్నిస్తారు?

బాబూ..ప్రశ్నించు..అయ్యా ప్రశ్నించు..అని అందరూ పదేపదే ఫుల్ టైమ్ నటుడు కమ్ పార్ట్ టైమ్ రాజకీయ వేత్త అయిన పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు. ఈ ఫుల్ టైమ్ రాజకీయ నాయకులకు బుర్రలు సరిగ్గా వుండవేమో…

బాబూ..ప్రశ్నించు..అయ్యా ప్రశ్నించు..అని అందరూ పదేపదే ఫుల్ టైమ్ నటుడు కమ్ పార్ట్ టైమ్ రాజకీయ వేత్త అయిన పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు. ఈ ఫుల్ టైమ్ రాజకీయ నాయకులకు బుర్రలు సరిగ్గా వుండవేమో అన్న చిన్న అనుమానం. అడిగిన వెంటనే కాల్ షీట్లు ఇచ్చేసే, సాదా సీదా నటుడా పవన్ కళ్యాణ్. వీళ్లు ప్రశ్నించమన్నపుడల్లా ప్రశ్నించేయడానికి? ఆయనెంత బిజీ. ఎంత బిజీ కాకుంటే, బాబు, మోడీ,. ఇంకా తెరవెనుక అనేకానేక మంది కృషిచేసి, ఎగసందోసి, ముందుకు లాగి, ఆయనకు కావాల్సిన విధంగా ప్రవర్తిస్తే, జనసేన అన్నాడు. అది కూడా ఎంత కష్టపడాల్సి వచ్చింది. పివిపి సంస్థ భారీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది కూడా భారీ లొకేషన్ కావాల్సి వచ్చింది. అందుకు ముందు దానికి బోలెడు పబ్లిసిటీ స్ట్రాటజీలు వండి వార్చాల్సి వచ్చింది. పాటలు ,పద్యాలు, ప్రచార చిత్రాలు ఎన్ని చేయాల్సి వచ్చింది. ఓ భారీ సినిమాకు కావాల్సినంత. మరి ఇంత చేస్తే అప్పుడు సార్ వచ్చి, స్పీచిచ్చి, పరుగు పరుగున వెళ్లిపోయారు.

ఇంత చేస్తే, ఆయన వచ్చి మాట్లాడారన్న సంగతి మరిచిపోయి, ఊ అంటే ప్రశ్నించు పవన్..మాట్లాడు పవన్, తోట వదిలి కదలిరా పవన్ అంటారేంటి? మీకు కావాలంటే తెరవెనుక రాయబారాలు నడిపించండి. మీడియా మొఘళ్ల చేత రికమెండేషన్లు ఇప్పించండి. బడా పారిశ్రామిక వేత్తల చేత ఏర్పాట్లు చేయించండి. అప్పుడు కావాలంటే సార్ వస్తారు. ప్రశ్నిస్తారు.

కానీ ఇక్కడ మళ్లీ ఓ సమస్య వచ్చి పడింది. పవన్ సార్ వచ్చి ఇప్పుడు దేనిపై ప్రశ్నించాలి. కేంద్రంలో భాజపా..రాష్ట్రంలో తేదేపా..మరి గతంలో ఏర్పాట్లు చేసింది..రికమెండ్ చేసింది..ఆ పార్టీల దోస్తులే. ఎక్కడ పొరపాటున జగన్ అధికారంలోకి వస్తాడో అని భయపడి, ఇక ఆఖరి బ్రహ్మాస్త్రంగా, తరుపు ముక్కగా పవన్ వాడారు. మరి రైతు రుణ మాఫీ, రాజధాని, ఒంటెద్దు పోకడలు, ఇలా సకల రుగ్మతలపై నిలదీయాలి.వీటిని నిలదీస్తే ఎన్నికల నాడు పవన్ రాకకు కారణమైన సదరు జనాలు సహించగలరా? మరి ఇలా కాళ్లు చేతులు కట్టేసి,. లొకేషన్ స్పాన్సర్ చేసేవాడు లేకుండా, ‘బేగి పారొచ్చేసి ప్రశ్నీంచీ పవనా’ అంటే వచ్చీస్తాడేటి? తాజగా ఈ సంగతి తెలుసుకోవాల్సింది వైకాపా లీడరు ద్వారంపూడి జగదీష్..ఆయనగారు ఈ రోజు మరోసారి పవన్ బాబును రావేటి…అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలే మిగులుతాయి. ఆయన రావడం అన్నదే పెద్ద ప్రశ్నార్థకం అని వీళ్లకు తెలియదు..

చాణక్య

[email protected]