మళ్లీ అదే కామెడీనా

కోన వెంకట్ బృందం అంటే ఒకసారి నవ్విన వాళ్లను, ఒకసారి నవ్వించిన విధంగానే మళ్లీ మళ్లీ నవ్వించడం. క్రిటిక్స్ ఏమంటారు అన్నది అనవసరం. నేల, బెంచీలు నవ్వాయా లేదా అన్నదే కావాలి. అందుకే వారు…

కోన వెంకట్ బృందం అంటే ఒకసారి నవ్విన వాళ్లను, ఒకసారి నవ్వించిన విధంగానే మళ్లీ మళ్లీ నవ్వించడం. క్రిటిక్స్ ఏమంటారు అన్నది అనవసరం. నేల, బెంచీలు నవ్వాయా లేదా అన్నదే కావాలి. అందుకే వారు చేయిపెట్టిన సినిమాల్లో చూసిన కామెడీనే ఎక్కువగా చూస్తుంటాం.

ఇప్పుడు శ్రీను వైట్ల-రామ్ చరణ్ సినిమా కూడా దీనికి మినహాయింపు కాదని తెలుస్తోంది. సినిమా సన్నివేశాలను గుర్తుకుతెచ్చే స్ఫూఫ్ లు, సినిమా జనాలను గుర్తుకు తెచ్చే డైలాగులు వుంటాయని తెలుస్తోంది. పైగా సినిమాలో హీరో కూడా సినిమా డూప్ ఫైటర్ క్యారెక్టర్ కదా..ఇంక రెచ్చిపోవడమే. అయితే కోన..వైట్ల బృందానికి ఇవి పాతేమో కానీ రామ్ చరణ్ కు కొత్త కాదా..బానే వుండొచ్చు.