ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం పేరు ఎనిగ్మా. రీసెంట్ గా దీన్ని వేలం వేస్తే 32 కోట్ల రూపాయల ధర పలికింది. అయితే ఇది నలుపు వజ్రం. ప్రపంచంలోనే అతి పెద్ద తెలుపు వజ్రం ఒకటి ఉంది. ఇప్పుడు ఇది వేలానికి సిద్ధమైంది.
ప్రపంచంలోనే అతి పెద్ద తెల్ల వజ్రం ఇది. 228 క్యారెట్ల ఈ తెల్ల వజ్రం పేరు 'ది రాక్'. జెనీవాలో ఈ వజ్రాన్ని వేలం వేయబోతున్నారు. వేలం పాటలో దీని కనీస ధర 30 మిలియన్ డాలర్లు. గోల్ఫ్ బంతి సైజులో ఉండే ఈ వజ్రాన్ని మే 11న వేలం వేయబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు లభ్యమైన తెల్ల వజ్రాల్లో ఇదే పెద్దది.
సరిగ్గా 22 ఏళ్ల కిందట దక్షిణాఫ్రికా గనుల్లో ఈ వజ్రాన్ని కనుగొన్నారు. చాన్నాళ్ల పాటు ఆ గని యజమాని దీన్ని ధరించాడు. తర్వాత ఇతర దేశస్తులకు అమ్మేశారు. అలా తిరిగితిరిగి ఇది జెనీవా చేరుకుంది.
2017లో 163 క్యారెట్ల వైట్ డైమండ్ ను క్రిస్టీ వేలం వేసింది. అప్పట్లోనే అది 33 మిలియన్ డాలర్లు పలికింది. కాబట్టి.. 228 క్యారెట్ల ఈ అతిపెద్ద వైట్ డైమండ్, భారీ రేటుకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఈ వైట్ డైమండ్ తో పాటు రెడ్ క్రాస్ డైమండ్ అనే ఓ పసుపు రంగు వజ్రాన్ని కూడా అమ్మకానికి పెట్టారు.