హీరోయిన్‌గా ఆ భావాలు పూర్తిగా మిస్సవుతాం

ఈడొచ్చిన పిల్ల తలుపు పక్కన నిలబడి వీధిలో పోయే నాయుడి బావ కండలు చూసి లొట్టలేస్తుంటే ఇంట్లోకి పోవే.. ఏంటీ చోద్యం చూస్తున్నావని బామ్మలు హెచ్చరికలు చేసేవారు. అలాంటి అమ్మాయి మంచమ్మీద పడి అటూ…

ఈడొచ్చిన పిల్ల తలుపు పక్కన నిలబడి వీధిలో పోయే నాయుడి బావ కండలు చూసి లొట్టలేస్తుంటే ఇంట్లోకి పోవే.. ఏంటీ చోద్యం చూస్తున్నావని బామ్మలు హెచ్చరికలు చేసేవారు. అలాంటి అమ్మాయి మంచమ్మీద పడి అటూ ఇటూ దొర్లుతూ నిద్రపట్టక ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి అవకాశాలూ, ఆలోచనలూ హీరోయిన్స్‌గా మేం మిస్సవుతాం.. అని చెబుతుంది బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా. 

ఓ సందర్భంలో అడిగిన  ప్రశ్నకు ‘శృంగార భావాలు’ అనే విషయమ్మీద ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. మేం పగలంతా బిజీగా వుంటాం. లేచింది మొదలు, షూటింగ్స్‌కి వెళ్ళి హర్రీబర్రీగా గడపడంతోనే టైమంతా అయిపోతుంది.. ఇంటికి వెళితే గాఢ నిద్ర.. తప్పితే కోడెకారు కుర్రాళ్ళ గురించి ఆలోచించే టైమ్‌ ఎక్కడిది? అని అంటుంది. 

ఇంకో ప్రశ్నకు, పూర్తిగా తనలో శృంగార భావాలు లేవని కాదు.. అని చెబుతూనే, విమానాల్లో ప్రయాణించినప్పుడు కాస్సేపు ఆలోచిస్తాను.. అలాగే అందమైన కుర్రాళ్ళు కనపడితే కాకపోయినా మాటల్లో రంజింపజేయగలిగితే ఆ భావన కలగొచ్చు తప్ప పూర్తిగా రోజంతా అదే ధ్యాసతో వుండటం నెవ్వర్‌.. అంటుంది ప్రియాంక. 

ఆవిడకు ఆ భావాలు కలగకపోయినా సెక్సీగా వున్న ఆమె పెదాలు చూసిన పండు ముసలాడు కూడా అదోలోకంలోకి వెళ్ళిపోవడం ఖాయం. ప్రస్తుతం డబ్బు గురించి ఆలోచించడంలో వున్న తృప్తి, శృంగార భావనల్లో లేదంటుంది ప్రియాంకా చోప్రా.