వెంకీతో యేలేటి సినిమా

చంద్రశేఖర్ యేలేటి..ఓ డిఫరెంట్ డైరక్టర్. వెంకటేష్ ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలు చేయాలని చూస్తుంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందని తెలుస్తోంది. చంద్రశేఖర్ మంచి సబ్జెక్ట్ ఒకటి రెడీ చేసారని, దానికి…

చంద్రశేఖర్ యేలేటి..ఓ డిఫరెంట్ డైరక్టర్. వెంకటేష్ ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలు చేయాలని చూస్తుంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందని తెలుస్తోంది. చంద్రశేఖర్ మంచి సబ్జెక్ట్ ఒకటి రెడీ చేసారని, దానికి వెంకీ పెర్ఫెక్ట్ మ్యాచ్ అని, అందుకే ఈ కాంబినేషన్ సెట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం బాహుబలి పంపిణీ వ్యవహారాల్లో బిజీగా వున్న సాయి కొర్రపాటి దీనికి నిర్మాత. 

బాహుబలి వ్యవహారాలు ఓ కొలిక్కి రాగానే ఈ సినిమా సెట్ పైకి వెళ్తుంది. దృశ్యం, గోపాల గోపాల తరువాత వెంకీ మరీ ఛూజీ అయ్యారు. ప్రేక్షకులు కూడా వెంకీ సినిమా అంటే సమ్ థింగ్ డిఫరెంట్ అనే అంచనాకు వచ్చారు. వాటిని ఈ సబ్జెక్ట్ అందుకుంటుందని తెలుస్తోంది.