నూతన సంవత్సర శుభాకాంక్షలు

2014 ముగిసిపోయింది. సంవత్సరాలు ఎంత హుషారుగా వస్తాయో, అంత నిశ్శబ్ధంగానూ వెనక్కు జారుకుంటాయి అనుభవాలు, గుణపాఠాలు మిగిలిపోతాయి అనుభవం ఇచ్చిన ఆనందం..గుణపాఠం అందించిన జ్ఞానం తోడు చేసుకుని కొత్త ఏట అడుగుపెడతాం మరిన్ని అనుభవాలు..…

2014 ముగిసిపోయింది.
సంవత్సరాలు ఎంత హుషారుగా వస్తాయో,
అంత నిశ్శబ్ధంగానూ వెనక్కు జారుకుంటాయి
అనుభవాలు, గుణపాఠాలు మిగిలిపోతాయి
అనుభవం ఇచ్చిన ఆనందం..గుణపాఠం అందించిన జ్ఞానం
తోడు చేసుకుని కొత్త ఏట అడుగుపెడతాం
మరిన్ని అనుభవాలు..
పాఠాలు స్వంత చేసుకోవడానికి
ఉవ్విళ్లూరుతాం
కొత్త అంటే అంతులేని ఆశకదా మనకు
అందుకే కొత్త ఏడు ఎలా వుంటుందో తెలియకపోయినా
సాదరంగా, సందోహంతో స్వాగతిస్తాం
కొత్త అంటే ఎంత ఆశ అన్నట్లుగానే..
ఆశే కదా మనిషి మనుగడకు జీవన శ్వాస
ఆ ఆశే ఆలంబనగా, కొత్త సంవత్సరాన్ని
ఆనందాలకు, అభివృద్ధికి వేదికగా చేసుకుందాం
విజయ ఐరావతాలను అధిరోహించి, ఆవలి తీరానికి చేరుకుందాం
గ్రేట్ ఆంధ్రను అను నిత్యం ప్రొత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ
ఈ నూతన వత్సరం అటువంటి అద్భుత అనుభూతిని ఇవ్వాలని
కోరుకుంటూ..

మీ
వెంకట్ ఆరికట్ల