క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 4 మ్యాచుల్లో డకౌట్!

పాకిస్థాన్ ఆట‌గాడు అబ్దుల్లా షఫీక్ టీ20ల్లో చెత్త రికార్డు న‌మోదు చేశారు. వ‌రుస‌గా 4 మ్యాచుల్లో డ‌కౌట్ అయిన తొలి ఆట‌గాడిగా నిలిచారు. ఆదివారం షార్జాలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20లో షఫీక్ గోల్డెన్…

పాకిస్థాన్ ఆట‌గాడు అబ్దుల్లా షఫీక్ టీ20ల్లో చెత్త రికార్డు న‌మోదు చేశారు. వ‌రుస‌గా 4 మ్యాచుల్లో డ‌కౌట్ అయిన తొలి ఆట‌గాడిగా నిలిచారు. ఆదివారం షార్జాలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20లో షఫీక్ గోల్డెన్ డక్‌తో ఔటయ్యాడు. అంతకుముందు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో అలాగే 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో రెండుసార్లు డకౌట్ అయ్యాడు.

న్యూజిలాండ్ తో జ‌రిగిన 2 టీ20ల్లో రెండో బంతికే డ‌కౌట్ అయిన అత‌ను.. అఫ్ఘాన్ తో తొలి మ్యాచ్ లో 2వ బంతికు, రెండో మ్యాచ్ లో తొలి బంతికే వెనుదిరిగారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జట్టులోకి తిరిగి స్థానం సంపాధించుకున్న‌ ఈ సిరీస్‌లో తన ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు.

కాగా ఇటీవ‌ల అస్ట్రేలియా వ‌న్డే సిరిస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వ‌రుస‌గా మూడు సార్లు గోల్డెన్ డ‌కౌట్ అయిన విష‌యం తెలిసిందే. కాగా సూర్య‌తో పాటు క్రికెట్ లెజెండ్స్ అయినా సౌరబ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, బూమ్రా, సచిన్ టెండూల్కర్ లు ఇలాగే వరుసగా మూడు మ్యాచ్ లలో గోల్డెన్ డకౌట్ అయ్యారు.