అండర్-19 మహిళా టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయంలో మన తెలుగు బిడ్డ గొంగడి త్రిష కీలకపాత్ర పోషించడం విశేషం. అండర్-19 వరల్డ్‌కప్‌లో అద్భుత విజయాలతో ఫైనల్‌కు భారత్ జట్టు చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ యువ మహిళా జట్టు తలపడింది. సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 83 పరుగులను ఇండియాకు టార్గెట్ పెట్టింది. కేవలం ఒకే ఒక్క వికెట్ నష్టపోయి ప్రపంచ చాంపియన్‌గా భారత మహిళా జట్టు నిలబడి, త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడేలా చేశారు. టీమిండియా ఫైనల్ చేరడంలోనూ, అలాగే తుదిపోరులో విజేతగా నిలబడడంలోనూ మన తెలుగు బిడ్డ త్రిష ప్రధాన పాత్ర పోషించారు. ఫైనల్‌లో బౌలింగ్‌లో 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు, 44 పరుగులు చేసి అజేయంగా త్రిష నిలిచింది. అంటే జట్టు గెలుపునకు అవసరమైన సగానికి పైగా పరుగులు మన త్రిషనే చేసింది.
ఈ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు (309) చేసిన బ్యాటర్‌గా త్రిష నిలిచారు. అలాగే టోర్నీ మొత్తంలో ఏడు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌గా ఆఫ్ ది ప్లేయర్‌గా కూడా త్రిషే నిలిచారు. ఫైనల్‌లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచిన త్రిషపై యావత్ భారత్ క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.