ర‌గులుతున్న య‌న‌మ‌ల‌

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌న‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డంపై ర‌గిలిపోతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల ద్వారా తెలిసింది.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌న‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డంపై ర‌గిలిపోతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల ద్వారా తెలిసింది. టీడీపీ అధికారంలో వస్తే, కేబినెట్‌లో బెర్త్ ద‌క్కే మొట్ట‌మొద‌టి వ్య‌క్తి ఎవ‌రంటే… య‌న‌మ‌ల రామ‌కృష్ణుడే. ఇంత‌కాలం ఆయ‌న హ‌వా అలా సాగింది మ‌రి. అలాంటి సీనియ‌ర్ నాయ‌కుడిని ఇప్పుడు ప‌ట్టించుకునే దిక్కే లేక‌పోతే మండిపోదా మ‌రి అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

టీడీపీ అధికారంలో వుంటే, తూర్పుగోదావ‌రి జిల్లాలో మొద‌టి నుంచి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి మాటే చెల్లుబాటు అయ్యేది. తుని నియోజ‌క‌వ‌ర్గం నుంచి ద‌శాబ్దాల పాటు ఎమ్మెల్యేగా య‌న‌మ‌ల ప్రాతినిథ్యం వ‌హించారు. ఎన్టీఆర్ హ‌యాంలో ఆయ‌న స్పీక‌ర్‌గా ప‌ని చేశారు. టీడీపీ సంక్షోభ స‌మ‌యంలో స్పీక‌ర్‌గా చంద్ర‌బాబు వైపు య‌న‌మ‌ల నిలిచారు. ఆ కృత‌జ్ఞ‌త చంద్ర‌బాబుకు వుండేది. అందుకే తుని నుంచి య‌న‌మ‌ల ఓడిపోయిన‌ప్ప‌టికీ, ఎమ్మెల్సీ ఇచ్చి, ఆయ‌న్ను కేబినెట్‌లోకి తీసుకునే వారు.

ఇప్పుడు టీడీపీలో యువనేత నారా లోకేశ్‌దే పెత్త‌నం. లోకేశ్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేసే క్ర‌మంలో య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు. అంత వ‌ర‌కూ య‌న‌మ‌ల‌కు బాబు కేబినెట్‌లో చోటు త‌ప్ప‌కుండా వుంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అలా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో పాటు తూర్పుగోదావ‌రి జిల్లాలో ఆయ‌న మాట చెల్లుబాటు కాక‌పోవ‌డాన్ని య‌న‌మ‌ల జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని తెలిసింది.

తూర్పుగోదావ‌రి జిల్లాలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ ఏది చెబితే, అదే శాస‌నం అని స‌మాచారం. ఈ రాజ‌కీయ ప‌రిణామాలు య‌న‌మ‌ల‌కు రుచించ‌డం లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు. మ‌రోవైపు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న దివీస్ ప‌రిశ్ర‌మ ఎండీ ముర‌ళీ కూడా ఖాత‌రు చేయ‌డం లేద‌న్న ఆవేద‌న య‌న‌మ‌ల‌లో బ‌లంగా వుంది.

ఏదైనా వుంటే, సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడుకుంటా అనే రేంజ్ దివీస్ యాజ‌మాన్యానిది. అంతేకాకుండా, య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌కు ప్ర‌భుత్వంలో ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఆయ‌న‌కు కోపం తెప్పిస్తోంది. ఏది ఏమైనా మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో య‌న‌మ‌ల ర‌గిలిపోతున్నార‌నే చ‌ర్చ ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది.

17 Replies to “ర‌గులుతున్న య‌న‌మ‌ల‌”

  1. 2021 నుండి కేశినేని నాని అనే ఒక నాయకుడు ఉండేవాడు.. అతను కూడా ఇలా చీటికి మాటికి రగిలిపోయేవాడు.. అప్పుడప్పుడు అలిగి బుంగ మూతి కూడా పెట్టుకొనేవాడు..

    కొన్నాళ్ళకు నెత్తిన దరిద్రం తాండవించింది.. జగన్ రెడ్డి పార్టీ కి వెళ్లి కృష్ణ జిల్లా మొత్తం చక్రం తిప్పాడు.. కృష్ణ జిల్లాలో టీడీపీ లేకుండా చేసేస్తా అంటూ ఊగిపోయేవాడు..

    ఇప్పుడు సన్యాసం తీసుకుని.. శేష జీవితం మొత్తం ఎక్కడా “రగలకుండా” జాగ్రత్త పడుతున్నాడు..

    ..

    పార్టీ ముఖ్యం.. నాయకులు కాదు.. అది చంద్రబాబు అయినా.. లోకేష్ అయినా.. పార్టీ తర్వాతే..

    గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళను కూడా పక్కకు పెట్టేసాం.. పార్టీ కి తర్వాతి తరం నాయకత్వం ముఖ్యం.. అందుకు “సిద్ధం” కూడా…

    నెక్స్ట్ 20 ఏళ్లకు మా పార్టీ కి ఎలాంటి ఢోకా లేదు.. కొదమసింహాల్లాంటి నాయకులు ఉరకలెత్తే ఆవేశం తో, పోటీతత్వం తో తీర్చి దిద్దుకొన్నాం..

    1. కరెక్ట్ యనమల ను వైసిపి లోకి అహవనిచుకోమని కూడా చెప్పండి

    2. నీ కామెంట్స్ చూస్తే మన అచ్చన్నా మాటలు గుర్తుకువస్తున్నాయి బ్రో, పార్టీ లేదు బోక్కలేదు రైమింగ్ అదరగొట్టాడు అప్పట్లో

      1. అప్పుడే మీ పార్టీ గురించి మీకు ఇండికేషన్ ఇచ్చాడు.. మీ దద్ది మొఖాలకు అది అర్థమై చావలేదు..

        11 కి బొక్క బోర్లా పడ్డారు..

        సిగ్గులేకుండా నా కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ..

        నీ కామెంట్స్ చదివితే.. నీ జగన్ రెడ్డి కి నిజంగానే 175 కి 175 వచ్చేశాయనుకొంటారు.. 164 తక్కువ 175 అని చెప్పుకోండి..

  2. దశాబ్దాలపాటు పెద్ద పదవులు అనుభవించి మూడు సార్లు వరసగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అదీకాక అయిదేళ్లు కేబినెట్ పదవి (లీడర్ ఆఫ్ అప్పోసిషన్) ఇచ్చి, ఇప్పుడు కూతురిని మొదటిసారిగా ఎమ్మెల్యే చేసి, అల్లుడిని మొదటిసారిగా ఎంపీ చేసి, వియ్యంకుడిని ఎమ్మెల్యే చేసినా ఏడ్చే వాడిని ఏమనాలి? పెత్తనం చేయడమే కానీ, వేరే ఒక్క ఎమ్మెల్యే ని ఎప్పుడన్నా గెలిపించడా?

  3. Y.-.C.-.P కి రాజీనామ చెసిన తరువాత వెల్లి షర్మిల ని కలసి 3 గంటలు మాట్లాడిన విజయ సాయి రెడ్డి మాతం రగలటం లెదు అంట! ఇంకా గుండెల నిండా జగనె అని పాడుతున్నాడు అంట!

    .

    యనుమల మాత్రం రగులుతుంటె రహస్యంగా GA గాడు వెళ్ళి చూసాడు అంట! ఎమి కామిడీ గా మారుతుంది రా ఈ GA!!

  4. ఒరే బోసిడికే గ్యాస్ ఆంధ్ర

    నువ్వు మనిషి అయితే విజయసాయిరెడ్డి వైసీపీని ఎందుకు వదిలాడు చెప్పరా ? ఏం లాగే ఎంతోమంది వైసీపీని వేడారు మరి వాళ్ళందరూ రగిలి వీడారా రగలకుండా వదలిపోయారా ? కాదు నేను పందిని అంటే సమాధానం ఆశించను . ప్రస్తుతం వైసీపీని వీడిన వారంతా ఊరికే విడిచిపోయారా గ**** మంట ఎక్కి విడిచిపోయారా . గురివింద గింజ తన నలుపు తని ఎరగదట అలా ఉంది నీ బోడి లెక్క్. ముందు నీ గ**** కడుక్కోరా అంటే లేదు ముందు వాని గుద్ధ కడుగుతా తర్వాత నాకు గుడ్డ కడుక్కుంటాను వెనకటికి నీలాంటి వెదవన్నర వెధవ ఒకడు

Comments are closed.