ఆ ప‌ద‌వుల్ని నామినేటెడ్ చేస్తే… బుల్డోజ‌ర్ల‌తో ప‌నే వుండ‌దు!

ప్ర‌జాస్వామ్యం, పౌరుల స్వేచ్ఛ‌, ఓటు వ‌జ్రాయుధం, ప్ర‌జ‌లే దేవుళ్లు లాంటివ‌న్నీ మ‌న‌సుకు విన‌సొంపుగా త‌ప్ప‌, ఆచ‌ర‌ణ విష‌యానికి వ‌స్తే ప్ర‌శ్నార్థ‌క‌మే.

స‌మాజంలో ఎన్నిక‌లు ప్ర‌హ‌సనంగా మారాయి. అధికారంలో ఉన్న పార్టీల‌దే హ‌వా. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, న‌యాన్నో, భ‌యాన్నో ప్ర‌త్య‌ర్థుల్ని దారికి తెచ్చుకోవ‌డం రాజ‌కీయ సంప్ర‌దాయంగా మారింది. అందుకే ప్ర‌జాస్వామ్యం, పౌరుల స్వేచ్ఛ‌, ఓటు వ‌జ్రాయుధం, ప్ర‌జ‌లే దేవుళ్లు లాంటివ‌న్నీ మ‌న‌సుకు విన‌సొంపుగా త‌ప్ప‌, ఆచ‌ర‌ణ విష‌యానికి వ‌స్తే ప్ర‌శ్నార్థ‌క‌మే.

ఇంత‌కంటే ఎన్నిక‌ల ప్ర‌క్రియ దిగ‌జార‌దు అని అనుకున్న‌ప్పుడ‌ల్లా, అబ్బే ఇంకా పాతాళం వుంద‌ని నాయ‌కులు రుజువు చేస్తూనే ఉన్నారు. ప్ర‌జాస్వామ్యం ఖూనీ అని నిస్స‌హాయుల నోట వింటూనే వుంటాం. అందుకే స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల్ని కూడా నామినేటెడ్ ప‌ద‌వుల కింద చేరిస్తే, అధికారంలో ఎవ‌రుంటే, వాళ్ల నాయ‌కుల‌కే అవి సొంతం అవుతాయి.

లేదంటే, బుల్డోజ‌ర్ రావాలా? లేక మీరు మా పార్టీలోకి వ‌స్తారా? అనే బెదిరింపుల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ మేయ‌ర్లు, మున్సిప‌ల్ చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌మ కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌కు విప్ జారీ చేసింది. విప్ ధిక్క‌రిస్తే అన‌ర్హ‌త వేటు త‌ప్ప‌ద‌ని ఆ పార్టీ హెచ్చ‌రిస్తోంది.

తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ల‌లో డిప్యూటీ మేయర్లను, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మ‌న్ల‌ను, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో వైస్ చైర్మ‌న్ల‌ను ఎన్నుకోనున్నారు. అయితే ఈ ఎన్నిక‌లు ఎలా జ‌రుగుతాయో పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం వుండ‌దు. అధికారం ఎవ‌రి చేత‌ల్లో వుంటే, వాళ్ల వ‌శ‌మే అవుతాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందుకోసం ఏం చేయ‌డానికైనా అధికార పార్టీ వెనుకాడ‌ద‌ని ఎన్నైనా ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

నిన్న‌టికి నిన్న తిరుప‌తిలో వైసీపీ డిప్యూటీ మేయ‌ర్ అభ్య‌ర్థి శేఖ‌ర్‌రెడ్డి ఆస్తుల‌పైకి బుల్డోజ‌ర్‌ను పంపి, ఆయ‌న్ను టీడీపీలోకి చేర్చుకున్న వైనం అంద‌రికీ తెలుసు. తిరుప‌తే కాదు, రాష్ట్ర‌మంతా ఇదే ర‌క‌మైన ప్ర‌జాస్వామ్యం ప్ర‌జ్వ‌రిల్లుతోంది. అందుకే ఎన్నిక‌ల పేరుతో అన‌వ‌స‌రంగా ప్ర‌త్య‌ర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేయ‌డం లాంటివి లేకుండా, వాటిని కూడా నామినేటెడ్ ప‌ద‌వులుగా అధికారికంగా చేసుకుంటే స‌రిపోతుంది క‌దా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

9 Replies to “ఆ ప‌ద‌వుల్ని నామినేటెడ్ చేస్తే… బుల్డోజ‌ర్ల‌తో ప‌నే వుండ‌దు!”

  1. గత ఐదేళ్లు.. అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా బుల్డోజర్లు గ్రామాలపైకి దాడికి వచ్చేసేవి.. మరిచితివా జగన్ రెడ్డి భక్షకా..?

    అప్పుడు లేవని నోర్లు.. ఇప్పుడు లేస్తున్నాయే …

    1. So you want to see the same culture now too. No one is supporting what happened during Anna rule. but situation now is no better. Let’s keep using past bad actions as a reason to continue the same even now. Atleast sensible people like shouldn’t use past actions as the justification for continuing the same now.

      1. అక్రమంగా కడితే.. ఏ ప్రభుత్వమైనా కూల్చేయడం లో తప్పు లేదు..

        అది జగన్ రెడ్డి, చంద్రబాబు అనే సంబంధమే లేదు.. చట్టం అందరికీ సమానమే..

        నా పాయింట్ మీరు కంప్లీట్ గా అర్థం చేసుకోకుండా.. రిప్లై ఇవ్వడం లోనే తప్పు ఉంది..

        రాత్రుళ్ళు 1 గంటకి వచ్చి కూల్చేయడం తప్పు అనేది నా పాయింట్..

        ..

        మీరే కాదులెండి.. నా కామెంట్స్ చూడగానే ఎదో ఒక కౌంటర్ రిప్లై ఇచ్చేయాలనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చాలా మందికి..

  2. ప్రియమైన రవి గారు,

    మీరు గౌరవాన్ని కోరుకుంటారు, కానీ మీ చర్యలు మాత్రం అగౌరవానికి అద్దం పడుతున్నాయి. మీరు ఓ సంస్కారవంతమైన కుటుంబం నుండి వచ్చినవారు అంటారు, కానీ మీ మాటలు అసభ్యతకే ప్రతిరూపం. మర్యాద, గౌరవం, నిజాయితీ వంటి విలువల గురించి మాట్లాడే మీకు, వాటిలో కనీసం ఒక్కటీ ఉన్నాయా? లేకపోతే, ఎందుకు ప్రతి మాటలో అసభ్యపదాలు, కుల చర్చలు, నీచమైన విమర్శలే కనిపిస్తున్నాయి?

    రవి గారు, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. ఎవరు అధికారంలో ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు వారికే ఉంది. కానీ మీరు మాత్రం ప్రజల తెలివిని అవమానించేందుకు, వారి అభిప్రాయాలను అగౌరవపరచేందుకు పట్టుబడ్డారు. మీకు నచ్చిన రాజకీయ నాయకుడిని పొగడాలంటే పొగడండి, గౌరవించాలంటే గౌరవించండి, కానీ మిగతా అందరినీ కించపరిచే హక్కు మీకెవరు ఇచ్చారు?

    మీరు నాయకులకు సేవచేసే సేవకుడా? లేదా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకున్న ఒక గౌరవనీయమైన పౌరుడా? మీరు ఏది కావాలో మీరు నిర్ణయించుకోవాలి. కానీ, ప్రజలు మీ బానిసగిరిని గమనించకుండా ఉండరు. ఎవరైనా మీ రాజకీయ భావజాలానికి భిన్నంగా మాట్లాడితే, వారిపై అసభ్య పదజాలంతో దాడి చేయడం, కుల చర్చలు చేయడం, తక్కువ స్థాయికి దిగజారడం—ఇది రాజకీయం కాదు, ఓ మానసిక స్థితి. మీరు నిజంగా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే, కులాల గురించి కాక, పాలన గురించి మాట్లాడండి. మీ నోట మాటలు సంస్కారం కలిగి ఉండాలి, అసభ్యత కాదు.

    రవి గారు, జీవితమంటే గౌరవం. మీరు రాజకీయ నాయకులకు మానసికంగా బానిసలా మారి, వారి కోసం మాటలతో కాల్చుకునేంతగా దిగజారిపోతే, ఆ జీవితం ఎంత విలువైనదిగా మిగిలిపోతుంది? అవినీతి, కులవాదాన్ని ప్రోత్సహిస్తూ, అసభ్య భాష వాడుతూ, గౌరవాన్ని కోల్పోయే విధంగా కాకుండా, ప్రజలకు నిజంగా ఉపయోగపడే మార్గంలో ఆలోచించండి. లేకపోతే, చరిత్రలో మీ పేరు ఒక రాజకీయ నేతకోసం స్వతంత్ర ఆలోచనను త్యజించిన మరొక బానిసగా మాత్రమే మిగిలిపోతుంది

Comments are closed.