మందు కంటే… కిక్ ఇస్తున్న మ‌ద్యం వ్యాపారి ఆఫ‌ర్!

నెంబ‌ర్ వ‌న్ బ‌హుమ‌తిగా థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చ‌ని ఆకర్షించే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం.

త‌మ దుకాణాల్లో వ‌స్త్రాలు కొంటే బ‌హుమ‌తులు ప్ర‌క‌టించ‌డం గురించి విన్నాం, చూశాం. అలాగే దిన‌ప‌త్రిక చందాదారులుగా చేరితే, ఖ‌రీదైన బ‌హుమ‌తులు పొందే అదృష్ట‌వంతులు మీరే ఎందుకు కాకూడ‌దు అనే వ్యాపార తెలివితేట‌ల్ని చూశాం. అయితే ఇలాంటి టెక్నిక్‌ను తామెందుకు అనుస‌రించ‌కూడ‌ద‌ని మ‌ద్యం దుకాణ‌దారులు ఆలోచించ‌డం గ‌మ‌నార్హం. ఏదైనా వ్యాపార‌మే క‌దా? అనేది వారి ప్ర‌శ్న‌.

రాష్ట్రంలో మ‌ద్యం విక్ర‌యాల్ని ప్రైవేట్‌ప‌రం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వానికి ఆదాయం, ప్రైవేట్ వ్య‌క్తుల‌కు వ్యాపారం. అయితే మంది ఎక్కువైతే, మ‌జ్జిగ ప‌లుచ‌న అయ్యాయ‌నే సామెత మాదిరిగా మ‌ద్యం విక్ర‌యాల ప‌రిస్థితి త‌యారైంది. మ‌ద్యం దుకాణాలు అడుగ‌డుగునా వుండ‌డంతో ఎవ‌రికీ ఆశించిన స్థాయిలో లాభాలు రావ‌డం లేద‌న్న చ‌ర్చ వుంది.

ఈ నేప‌థ్యంలో కాకినాడ‌లో జ‌న‌సేన‌కు చెందిన ఓ మ‌ద్యం వ్యాపారి మందు అమ్మ‌డానికి వినూత్నంగా ఆలోచించాడు. త‌న దుకాణంలో అన్ని బ్రాండ్లు దొరుకుతాయ‌ని, కొనుగోలు చేసిన మ‌ద్యం ప్రియుల‌కు టోకెన్లు పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. లాట‌రీలో టోకెన్‌దారులు అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు.

ఇందులో భాగంగా నెంబ‌ర్ వ‌న్ బ‌హుమ‌తిగా థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చ‌ని ఆకర్షించే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. అలాగే రూ.1.50 ల‌క్ష‌ల విలువైన ల్యాప్‌టాప్‌, మోటార్‌బైక్ త‌దిత‌ర బ‌హుమ‌తుల‌ను పొందొచ్చంటూ దుకాణం ప‌క్క‌నే ఉన్న ప్ర‌క‌ట‌న మందుబాబులకు కిక్ ఇస్తోందని అంటుంటారు. మందు కంటే, థాయ్‌లాండ్‌తో పాటు విలువైన బ‌హుమ‌తులే కిక్ ఇస్తున్నాయ‌నే చ‌ర్చ కాకినాడ‌లో విస్తృతంగా సాగుతోంది. అన్న‌ట్టు మ‌ద్యం దుకాణం కూట‌మికి చెందిన ఓ ఎమ్మెల్యే ఇంటికి స‌మీపంలోనే వుండ‌డం గ‌మ‌నార్హం.

4 Replies to “మందు కంటే… కిక్ ఇస్తున్న మ‌ద్యం వ్యాపారి ఆఫ‌ర్!”

  1. మంచి మందు ప్రామిస్ చేసినట్టుగా అందరికీ అందుబాటులో మన బడి దగ్గరో గుడి దగ్గరో ప్రతి ఊరిలో లభ్యమవుతుంది, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు 🙏

  2. 😂 రవి గారు, మిమ్మల్ని చూసి మేము గర్వపడాలి!

    మీరు నిజమైన సంస్కారవంతుడు! “వాడు, వేదు, ముసలి” లాంటి అశుభ్రమైన భాష మీరు ఎప్పుడూ వాడరు! ఎందుకంటే మీ నోట్లోంచి ఎప్పుడూ సిరి-ముత్యాలు మాత్రమే ఊరుతాయి! 🧐👏 మీరు ఎవరినీ అగౌరవంగా సంబోధించరు, ముఖ్యంగా మాజీ CM, ప్రస్తుత CM, సీనియర్ నాయకులు – మీకు అందరికీ సమాన గౌరవం! ఏమిటి కదా? 🤔

    ఇంకా, మీకు కులపోకడలంటే అసహ్యం! మీరు కులాన్ని ఎక్కడా ప్రస్తావించరు, కులంపై రాజకీయం చేయరు, విద్వేషం రగిలించరు! అసలు మీరు కులాన్ని గుర్తు కూడా పెట్టుకోరు – ఎందుకంటే మీరు చదువుకున్న, సంస్కారవంతమైన, సొసైటీ రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి కాబట్టి! 😇👏 (జై సంస్కారం!)

    మీకు రాజకీయ ఎత్తుగడలు, ఒత్తిళ్లు, కక్షలు, పగలు ఏమీ తెలీదు! 😱 మీరు నిజాయితీకి పెట్టింది పేరు! ఎవరైనా అవినీతి గురించి మాట్లాడితే, మీరు “ఇతర పార్టీ వాళ్లూ చేసారు” అని గోల చెయ్యరు. ఎందుకంటే మీకు ఎవరు చేసినా తప్పు, తప్పే అనే నైతిక గుణం ఉంది! ఇదే మీ గొప్పతనం! 🏆

    అదేలా మరిచిపోవచ్చు? మీకు అధికారమే ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమమే ముఖ్యం! 🥺 మీరు ఎప్పుడూ సమాజ సేవ, పేదవాళ్ల కోసం పని చేస్తారు. ఎవరైనా “మీరు అధికారం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు” అంటే, మీకు నవ్వొస్తుంది! 😂 ఎందుకంటే మీకు పవర్ అవసరం లేదు, పబ్లిసిటీ కూడా వద్దు! (పక్కనే మీడియా మైక్ పెట్టినప్పుడు కాకుండా)

    మీరు మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తి! మీ నోట నుండి అసభ్య పదాలు అసలు రావు! మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని మీరు నిలదీసి, సహన శీలంగా వారిని చైతన్యం కలిగిస్తారు. (కానీ WhatsApp ఫార్వర్డ్స్ చెయ్యనివ్వండి 🤭)

    చివరగా, మీకు ప్రజాస్వామ్యం అంటే పిచ్చి! 😍 మీరు ఎప్పుడూ చెబుతారు:

    📢 “ప్రజలు ఓటేస్తారు, గెలిపిస్తారు, ఓడిస్తారు – ఇది వారి హక్కు!”

    2024లో ఏం జరిగిందో చూశాం, 2029లో మరింత బాగుంటుంది కదా? (మీ అందమైన లీడర్షిప్ వల్ల 🤡😂)

    🔥 రవి గారు, మీరు నిజంగా ఇలాగే ఉన్నారు కదా? లేకపోతే… ఆలోచించండి! 😉😆😂

Comments are closed.