కొన్ని రోజుల కిందటి సంగతి.. చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు. ఆ ఎనౌన్స్ మెంట్ వచ్చిన వెంటనే అనిరుధ్ పేరు తెరపైకొచ్చింది.
ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోలకు సంగీతం అందించిన అనిరుధ్, ఇప్పుడు టాలీవుడ్ లో తొలిసారి చిరంజీవి లాంటి సీనియర్ కు సంగీతం అందిస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి.
ఆ సినిమాలో అనిరుధ్ ఉన్నాడో లేదో ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఈ గ్యాప్ లో అతడ్ని మరోసారి రిపీట్ చేశాడు హీరో నాని. ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.
ఇంతకుముందు నాని నటించిన జెర్సీ సినిమాకు, ఆ తర్వాతొచ్చిన గ్యాంగ్ లీడర్ కు అనిరుధ్ సంగీతం అందించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిశారు.
నిజానికి ఈ సినిమాకు ముందు నుంచీ అనిరుధ్ నే అనుకున్నారు. మధ్యలో రెహ్మాన్ పేరు తెరపైకొచ్చింది. ఎట్టకేలకు అనిరుధ్ పేరును అఫీషియల్ గా ప్రకటించారు.