ఎమ్బీయస్‌: ప్రైవేట్ వ్యవహారాన్ని పబ్లిక్ చేయడం దేనికి?

ఇప్పటిదాకా ఆవిడ సింగపూరులో వుండి యీయన ఆస్తి వ్యవహారాలు చక్కబెడుతోందనే వార్తలున్నాయి. ఇప్పుడా పరిస్థితి మారిందనే సంకేతాన్ని యిచ్చారేమో! అంతా ఊహాగానమే

పవన్ కళ్యాణ్ – అన్నా లెజినావా విడాకుల విషయం వ్యక్తిగతం కాబట్టి, ప్రయివేటు వ్యవహారం కాబట్టి దానిపై మనం మాట్లాడడం సబబు కాదు అని చాలామంది విశ్లేషకులు అంటున్నారు.

ప్రయివేటు వ్యవహారమే అయితే వాళ్లు స్వయంగా పబ్లిక్ ఎందుకు చేశారు? రమ్యకృష్ణ విషయంలోలా వారి మీద పుకారులు ఏమీ రాలేదు. పుకార్లు వచ్చాయి కాబట్టి ఔననో, కాదనో చెప్పాల్సి వచ్చింది అనడానికి లేదు.

ఆవిడ మామూలు గృహిణిగానే వుంది. భర్త ఆరోగ్యం కోసం తిరుపతి మెట్లెక్కింది. ఆపరేషన్ తర్వాత యింట్లో సపర్యలు చేసింది. భర్త తరఫున వైద్యులకు, సిబ్బందికి, చూడడానికి వచ్చిన మోదీ గారికి కృతజ్ఞతలు చెప్పింది. నన్ను భర్త యింటి పేరుతోనే పిలవండి అని వేడుకొంది. ఈ ప్రకటన వచ్చి వుండకపోతే అంతా సజావుగానే వుందని అనుకునే వారు.

మరి అలాటప్పుడు వాళ్లు ఎందుకిది రిలీజ్ చేశారు? అనే ప్రశ్న వస్తుంది. దానితో పాటు యిప్పుడెందుకు చేశారు? అనే ప్రశ్న కూడా. దానికి ఫలానాది కారణమా? అనే సమాధానం దొరకని ప్రశ్న కూడా మనసులో మసలుతుంది.

పెళ్లి, విడాకులు – రెండూ వ్యక్తిగతమే. మొదటిది చెప్పుకుంటాం, పెళ్లి మాటలు నలుగుతున్నప్పుడు పైకి చెప్పం. కాస్త కన్‌ఫమ్ అయ్యాక చెప్తాం. నిశ్చితార్థం, పెళ్లి పదిమంది మధ్య చేసుకుంటాం. సంతోషాన్ని పంచుకుంటాం.

ఇక విడాకుల విషయంలో – నలుగుతున్నపుడు చెప్పం. కన్‌ఫమ్ అయ్యి, కోర్టులో విడాకుల కేసు నడుస్తూన్నప్పుడు కూడా మనంతట మనం అందర్నీ కేకేసి చెప్పం. విడాకులు సాంతం తీసేసుకున్నాక కూడా ప్రకటన యివ్వం. ‘మరో పెళ్లి కోసం చూస్తున్నాను, తెలిసున్న సంబంధం చెప్పండి’ అని అడగడానికి వ్యక్తిగతంగా కొంతమందికి చెప్పుకుంటాం. ఎందుకంటే విడాకులు అనగానే అందరూ జాలి చూపిస్తారు. భార్యాభర్తల్లో ఎవరిది తప్పో బేరీజు వేయడానికి పూనుకుంటారు. ‘మనల్ని జడ్జ్ చేయడానికి వీళ్లెవరు?’ అని మనకు చికాకు పుడుతుంది.

‘మామూలు మనుషులకు యిది వర్తిస్తుంది కానీ పవన్ వంటి సెలబ్రిటీలకు యిది వర్తించదు. వాళ్లు పబ్లిక్ లైఫ్‌లో వున్నారు కదా’ అనుకోవడానికి లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కి భార్యకు సఖ్యత చెడి, విడిగా చాలా రోజులుగా వుంటోంది.

ఈ ఏడాది మొదట్లో విడాకులకై కోర్టుకి అప్లయి చేసింది. ఆగస్టులో విత్‌డ్రా చేసుకుంది. విజయ్ ఏనాడైనా దాని గురించి పెదవి విప్పాడా? ప్రస్తుత కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పాయల్ అనే ఆమెను 1994లో పెళ్లాడాడు. 2011లో విడిపోయారు. పదేళ్ల క్రితం ఆమె నుంచి విడాకులు కోరుతూ ఒమర్ కోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టుల్లో నలిగినలిగి, చివరకు యిద్దరూ ఒక అంగీకారానికి రావడంతో యీ ఏడాది జులైలో విడాకులు మంజూరయ్యాయి.

అక్టోబరులో యితను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సందర్భంగా తన పూర్వ వివాహం రద్దయిన సంగతి చెప్పాడు తప్ప అంతకు ముందు విడాకులకు అప్లయి చేసిన సంగతి బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు. వాళ్లు ప్రజానాయకులే కానీ వారి వ్యక్తిగత కుటుంబ విషయాల గురించి ప్రజలకు చెప్పనక్కర లేదని వాళ్లనుకున్నారు.

మరి పవన్ కళ్యాణ్ యింకోలా ఎందుకనుకున్నారు? గతంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నప్పుడు యిలాటి ప్రకటన యివ్వలేదే! అప్పుడు కూడా ఆయన సెలబ్రిటీయే! ప్రజాజీవితంలో లేరు అనుకోవడానికి లేదు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి అధినేతగా వున్నారు. ఈసారి మాత్రమే రూటు మార్చారు. పోనీ విడాకులు చేతికి వచ్చాక చెప్తే అదో దారి. అసలు విడాకులకు అప్లయి చేస్తూనే యీ ప్రకటన యిచ్చేశారు.

‘పరస్పర అవగాహన, గౌరవాలతో వేర్వేరు దారుల్లో వెళ్లడానికి నిశ్చయించుకున్నాం. మా వైవాహిక బంధం సమాప్తమై పోయినా, మంచి స్నేహితులుగా, మా బిడ్డలకు మంచి పేరంట్స్‌గా కొనసాగుతాం.’ అన్నారు. మానసికంగా బంధం సమాప్తమై పోయినా, చట్టప్రకారం ఆ ప్రక్రియ ఆమోదం పొందడానికి కొంత టైము పడుతుంది. పరస్పరాంగీకారంతో విడాకులకు అప్లయి చేసినా, దానికి ముందు ఒక ఏడాది పాటు విడివిడిగా వున్నామని చెప్పుకోవలసి వస్తుంది. అలా చెప్పుకోగలరా?

స్పెషల్ మేరేజి యాక్ట్ కింద చేసుకున్నా యీ ఏడాది నిబంధన తప్పదు. విడివిడిగా అంటే వేర్వేరు ఊళ్లల్లో, వేర్వేరు యిళ్లల్లో వుండవలసిన అవసరం లేదు. విడిగా వుండే స్తోమత లేక ఒకే కప్పు కింద యిద్దరూ వుంటున్నా, యిద్దరి మధ్య వైవాహిక బంధం కానీ, మారిటల్ ఆబ్లిగేషన్స్ నిర్వహించకుండా కానీ వుంటే విడిగా వున్నట్లే లెక్క.

గృహిణిగా అన్నా తన బాధ్యతలు ఏడాదిగా నిర్వర్తించటం లేదు అని పవన్ చెప్పగలరా? గోప్యంగా వుండవలసిన విషయాలు వదిలేయండి. భర్త అనారోగ్యంగా వున్నప్పుడు ఆమె సేవలు అందించిందా లేదా? భగవంతుణ్ని కొలిచిందా, లేదా? ఆయన కోసం యింటికి వచ్చిన వారిని సాదరంగా రిసీవ్ చేసుకుందా, లేదా? పిల్లల బాగోగులు చూసుకుందా, లేదా? అన్యమతస్తురాలైనా, భర్త మతవిశ్వాసాలను గౌరవించిందా, లేదా? ఈ జులై దాకా యివన్నీ ప్రత్యక్షంగా కనబడుతూనే వున్నాయే! ఈ మూడు నెలల్లో ఏం మార్పు వచ్చిందో మరి!

ఇప్పటికీ అన్నా యీ బంధంలోనే కొనసాగాలని కోరుకుంటోందని అనిపిస్తుంది – యివన్నీ చూస్తే! కానీ జీవితంలో అనూహ్యమైన మార్పులు కలుగుతాయి. అవి యింత టైము లిమిటులోనే జరగాలని లేదు. ఏదైనా జరిగి వుండవచ్చు. కోర్టు వారికి వీరు వివరణ యిచ్చి, ఏడాది షరతుకి మినహాయింపు తెచ్చుకోవచ్చు. అది వాళ్లకు హెడేక్ అనుకోండి.

ఎంతైనా అఫీషియల్‌గా విడాకులు మంజూరు కావడానికి టైము పడుతుంది అనేది నిస్సందేహం. అలాటప్పుడు యిప్పుడే లోకానికి ఎందుకు చెప్పారు? అనేది ఒక ప్రశ్న. అసలు చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అనేది యింకో ప్రశ్న.

కారణాలు వెతకబోతే ఒక పోలిక తడుతుంది. అన్నతో పేచీ వ్యక్తిగత విషయమే అయినా, శర్మిల బహిరంగ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఆస్తి తగాదాలు అనేది స్పష్టం. కూతురి పెళ్లికి వెన్యూ అనే అంశంపై ప్రారంభించినా, అల్టిమేట్‌గా ఏమన్నది? దేవుడి సాక్షిగా ఆ యిల్లు నాదే అంది. తద్వారా ఆ ఆస్తి ఎవరైనా కొనదలచుకున్నా, అమ్మదలచుకున్నా నేను ఊరుకోను జాగ్రత్త అనే హెచ్చరిక జారీ చేసింది.

అలాగే యిక్కడా ఆస్తి గొడవ వుందా? అనే సందేహం వస్తోంది. ఓ కంపెనీ ఉద్యోగి వున్నాడు. నిజాయితీగా లేడని సస్పెండ్ చేశారు, యింకా డిస్మిస్ చేయలేదు. అయినా ‘ఇతను మా కంపెనీకి యికపై ప్రతినిథి కాడు, యితనికి చేసిన చెల్లింపులకు కంపెనీ బాధ్యురాలు కాదు’ అని పత్రికా ప్రకటన యిస్తుంది కంపెనీ.

అలాగే కొడుకు వ్యసనపరుడై తన పేర ఊరంతా అప్పులు చేసేస్తూ వుంటే, తండ్రి పత్రికా ప్రకటన యిస్తాడు – అతను చేసే అప్పులకూ, నాకూ ఏ సంబంధమూ లేదు అని. ఒక్కోప్పుడు పవరాఫ్ ఎటార్నీ ఒకరి పేర యిస్తారు. అతను మిస్‌యూజ్ చేస్తాడు. వెంటనే యిలాటి ప్రకటన యిస్తారు. పవన్ అర్జంటుగా యీ ప్రకటన రిలీజ్ చేయడంలో అలాటి మెసేజ్ వుందా? అన్న సందేహం కలుగుతోంది.

‘నా ఫైనాన్షియల్ వ్యవహారాల విషయంలో ఆవిడ దగ్గరకు వెళ్లకండి’ అనే కేవియట్ కోసమేనా? – యీ అర్జంటు ప్రకటన అనే అనుమానం వస్తోంది. ఇప్పటిదాకా ఆవిడ సింగపూరులో వుండి యీయన ఆస్తి వ్యవహారాలు చక్కబెడుతోందనే వార్తలున్నాయి. ఇప్పుడా పరిస్థితి మారిందనే సంకేతాన్ని యిచ్చారేమో! అంతా ఊహాగానమే! అవసరం లేని ప్రకటన యిచ్చారు కాబట్టి యీ గెస్‌వర్క్! నిజానిజాలు వాళ్లకే తెలుస్తాయి.

– ఎమ్బీయస్ ప్రసాద్

57 Replies to “ఎమ్బీయస్‌: ప్రైవేట్ వ్యవహారాన్ని పబ్లిక్ చేయడం దేనికి?”

  1. Coming from someone who asked for your articles because he admired your writing style (wrote an email to finish series on Rajiv Hatya), it’s disappointing to see gossip becoming part of your writing approach these days.

  2. He doesn’t want to give chance to speculate about his divorce. Imagine if PK didn’t reveal it and later disclosed by others?? People would say ..”see … this guy did it again..doesnlt have guts to reveal it etc..” 

  3. మీ స్థాయికి ఈ వ్యాసం తగదు…. మెల్లమెల్లగా ఒక్కో మెట్టు దిగుతున్నారు…

        1. చిరంజీవి, పవన్  అండ్ ఫ్యామిలీ అంటే నచ్చదు అనుకుంటా… ద్వేషపూరిత కథనాల్ని… Sugar coated gaa రాస్తూ ఉంటారు

    1. వైసీపీ కి పని చేస్తే ఇంక స్థాయి ఏంటి?

      పూర్తిగా దిగజారిన వాళ్ళే కదా వైసీపీ కి సపోర్ట్ చేసేది 

    2. అయినప్పుడో దిగిపోయి .. ౨౪ తరువాత పూర్తి ముసుగు తీసేసారు ..

  4. అప్పుడెందుకు చెప్పలేదు అంటే అప్పుడు చెప్పాలనిపించలేదు… ఇప్పుడెందుకు చెప్పారు అంటే ఇప్పుడు చెప్పాలనిపించింది… కాలంతో పాటు మనుషుల అభిప్రాయాల్లో… నడవడికలో… అలవాట్లలో.. మార్పులు వస్తాయి. ఈ విషయం మీకు తెలియదని నేను అనుకోను… మీరు ఎవరి సినిమా కలెక్షన్స్ గురించీ ఆధారాలతో సహా వ్యాసం రాయలేదు.. కానీ పెద్ది గురించి రాశారు.. ఆ సినిమా ఒక్కటే మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందహో అని డప్పు కొట్టిందా? వేరే ఏ సినిమాలు కొట్టలేదా? అప్పుడు రాయాలనిపించలేదు.. ఇప్పుడు రాయాలనిపించింది అంతే 

  5. మీరొక విషయాన్ని కన్వీనియెంట్ గా మర్చిపోయారనిపిస్తుంది..  ప్రకటన చేసింది పవన్ ఒక్కడే కాదు… అది సంయుక్త ప్రకటన అని నాకున్న అవగాహన… 

  6. ముసలోడు సోది తగ్గించి చాలా షార్ట్ ఆర్టికల్ రాశాడు. Hats up రా ముసలీ.. BTW నీకిచ్చే A 1 ప్రసాదం కూడా కల్తీ అయ్యిందేమో జర్రా చూసుకో 

  7. వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు విడిపోవాలనుకుని ఉండొచ్చు. Public domain లో ఉన్నారు అనవసరమైన అపోహలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో గౌరవప్రదంగా సంయుక్త ప్రకటన చేసి ఉండొచ్చు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అనవసరం.

  8. కేవియట్ కోసమా అని అనుమానం,సింగపూర్ లో ఉండి ఆస్తులు చెక్కబెడుతోంది అని వార్తలు వస్తున్నాయి అంటూ ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చెయ్యడం చాలా తప్పురా ముస్లీ ప్రసాద0.. 

  9. అవసరం లేని ప్రకటన ఇచ్చారు కాబట్టి అవసరం లేనివారు ఇలాంటి అనవసర విషయాలు గెస్ చేస్తున్నారు అని అంటావ్..

  10. Intha panikimalina article prasad gari nunchi chudaledu. Appudeppudo sex gurinchi article series rasadu gani, avi teliyalsina vishayalu anukovachu. Ee article matram toomuch

  11. neelanti vaaru vuntarugaa chillara raathalu rayataaniki kaasukuni andhuke cheppadu. mundhu ninnu nuvvu chakka dhiddhuko. pilli paalu thaguthu yevaru choodatam ledhanukunnatlu vundhi nee pravarthana.

  12. పూర్తిగా అనవసరమైన చెత్త వ్యాసం.. ఇలాంటి వ్యాసాలు రాసి గౌరవం కోల్పోకండి..

  13. వాళ్లు అవుననో కాదనో చెప్పేదాక పనికిమాలినోళ్లు అడ్డమైన రాతలు రాస్తారు.. వాగుతారు. అది అంతా ఎందుకని వాళ్లే చెప్పారు. అయినా కొందరికి బుద్ధి రాదు.

  14. పబ్లిక్ గా చెప్పారు కాబట్టి సరిపోయుంది లేదు అంటే అన్నియ్య మెప్పు కోసం రొజుకో పది ఆర్టికల్స్ రాసేవాడివి

    1. ఈ తూకాన్ని బోర్లించి చూడండి. ఒకవైపు మాగ్నెట్ వెల్డింగ్ చేసి ఉంటుంది..😀

  15. ప్రసాదు గారు మీ కత్తీ కి అదే కలానికి బాగా పదును ఉంది కదా అని అన్నీ టాపిక్స్ మీద రాసేయకండి సర్, ఆఫ్ కోర్స్ మీకు డబ్బులు వస్తాయి అనుకోండి!! ఇప్పుడు ఎవరు emi మాట్లాడుకున్నా అనుకున్నా మనకి రాయటానికి సరుకు దొరికినట్లే అంటారు? ja*** , భారతి n అవినాష్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు, ja*** కేస్ గురించి కూడా డిటైల్డ్ గా రాయొచ్చు కదా!!

  16. తద్వారా ఆ ఆస్తి ఎవరైనా కొనదలచుకున్నా, అమ్మదలచుకున్నా నేను ఊరుకోను జాగ్రత్త అనే హెచ్చరిక జారీ చేసింది..

    There isn’t even a hint of it coming, yet the author was able to stoop down to derogate her personality.

  17. పవన్ కళ్యాణ్ విడాకుల వెనుక ఆర్థికపరమైన అంశాలు వున్నాయనే ఆలోచనే సరైనది కాదు. ఎందుకంటే చేతిలో ఎముకలు లేనట్టు, తన సొంత సంపాదనే ఖర్చు చేస్తూ ఉంటాడు. ఏ కారణాల వల్ల వాళ్ళు విడిపోయి ఉండొచ్చు అనేది విక్రమ్ – భేతాళుని కథల లాగ మనకు తెలిసే రహస్యం కాదు.

  18. మంచైతే అందరూ పండగ చేసుకోవాలని, చెడైతే ఎవరూ పట్టించుకోవద్దని, అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమని అనుకోవడమే అందరి బాధ్యత. ఇదే “సెలెబ్రిటీలు” సామాన్య అభిమానులనుంచి, ఇంకా ప్రజలనుంచి కోరుకునేది. 

  19. Incase they haven’t released press note, you would have written article “why didn’t he give press note. Being in public service, its their responsibility….” . 

    PK did right in this matter. 

  20. దీనినే దురదృష్టం అంటారేమో. మనం పనిచేసే చోట, మనకు జీతం ఇచ్చేవాడు చెప్పిందే చేయాలి తప్పించి, మనలోని నిజాయితీని బయటకు చూపించే అవకాశం లేకపోవడం అంటే ఏమిటో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది.

    పెద్ద వేదాంతిలా పెద్ద పెద్ద వ్యాసాలు రాసే మీరు, ప్రతిపక్షం వాళ్లు కూడా వదిలేసిన విషయంపై ఇంత పరిశోధన చేయడం కేవలం జీతం, పైసల కోసమే కదా!

    ఏం చేస్తాం.. జాలి చూపించడం తప్పించి!

Comments are closed.