బోయపాటి సినిమాకు ఏర్పాట్లు

బోయపాటి డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రోజు కొత్త ఆఫీస్ తీసి, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఫొటో పట్టుకుని మరీ బోయపాటి కొత్త…

బోయపాటి డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రోజు కొత్త ఆఫీస్ తీసి, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఫొటో పట్టుకుని మరీ బోయపాటి కొత్త ఆఫీసులోకి ప్రవేశించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారు. దీంతో ఈ సినిమాపై అలుముకున్న అనుమానాలు పక్కకు పోయినట్లే. 

బోయపాటి తో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నాడని, అవసరం అయితే బెల్లంకొండ సినిమాను పక్కన పెట్టించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని గుసగుసలు వినిపించాయి. అయితే అవన్నీ పక్కా గాలి వార్తలే అని, బోయపాటి- బెల్లంకొండ సినిమా పక్కా అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా

బోయపాటి ఫీలయ్యారా?

కొరటాల శివ ఆ మధ్య సింహా కథ తనదే అని కొన్ని ఇంటర్వూల్లో చెప్పడం పట్ల దర్శకుడు బోయపాటి శ్రీను బాగా ఫీలయినట్లు తెలుస్తోంది. ఎప్పుటిదో విషయాన్ని అసలు ఇప్పుడు ప్రస్తావించడం, అది కూడా తనవైపు ప్రస్తావన లేకుండా, ఆయన పాటికి ఆయన తనదే కథ అని క్లెయిమ్ చేయడం, అది విస్తృతంగా మీడియాలో ప్రచారం కావడంతో బోయపాటి ఫీల్ అయినట్లు వినికిడి.