మంచు ల‌క్ష్మి సింగే..సాంగ్..?

సినిమా పాటలంటే మరీ బాత్ రూమ్ సింగింగ్ గా మారిపోయింది. ఇలా అనుకోవాలా లేక తెలుగు సినిమా ప్రారంభంలో గాత్రం బాగున్నవారినే నటులుగా తీసుకునేవారు. వారి పాటలు వారు పాడుకోవాలని. ఇప్పుడు మళ్లీ ఆ…

సినిమా పాటలంటే మరీ బాత్ రూమ్ సింగింగ్ గా మారిపోయింది. ఇలా అనుకోవాలా లేక తెలుగు సినిమా ప్రారంభంలో గాత్రం బాగున్నవారినే నటులుగా తీసుకునేవారు. వారి పాటలు వారు పాడుకోవాలని. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వచ్చాయనుకోవాలా? ఒకటి మాత్రం వాస్తవం సంగీత దర్శకులు క్రేజ్ కోసమో, మరెందుకనో స్టార్స్ చేత పాటలు పాడించేయడం మొదలు పెట్టారు. దేవీ, థమన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే మిగిలిన వారు ఫాలో అయిపోతున్నారు. 

ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే, సినిమా, టీవీ, సోషల్ వర్క్, రాజకీయాలు ఇలా అన్నింటా తన టాలెంట్ చూపించిన మంచు లక్ష్మి ఇప్పుడు పాటలు పాడేందుకు కూడా రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. దొంగాట సినిమా కోసం ఆమె ఓ ప్రమోషన్ సాంగ్ పాడినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ పాటను దొంగాట ప్రమోషన్ లో వినిపిస్తారట. అప్పుడు తెలుస్తుంది..అమ్మాయి గారి స్వరం ఎలా వుందీ అన్నది. బాగుంటే మరిన్ని పాటలు వినే అవకాశం వస్తుంది.