గుణశేఖర్ ప్రేస్టీజియస్ సినిమా రుద్రమదేవి ప్రాజెక్టులో ఇప్పుడు అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ భాగస్వామిగా చేరిందన్న వార్తలు గుప్పు మంటున్నాయి. భారీ పెట్టుబడి అవసరమైన ఈ సినిమా కోసం ఇప్పటికే గుణశేఖర్ చాలా ఖర్చు చేసాడు. ఇక ముందుకు పోలేక కిందా మీదా అవుతున్నట్లు వినికిడి.
అందుకే గడచిన ఒకటి రెండు నెలలుగా ఈవిషయం గీతాఆర్ట్స్ కాంపౌండ్ లోకి చేరి, నలిగి,నలిగి ఓ కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా గుణశేఖర్ పెట్టిన పెట్టుబడి అతని వాటాగా, ఇకపై పెట్టాల్సినది గీతా ఆర్ట్స్ వాటాగా వుంటుందని వినికిడి. అయితే ఇది వాటానా, ఫైనాన్సా అన్నది తెలియదు.
అందులో భాగంగా సినిమాకు మరింత సేప్, హైప్ తీసుకురావడానికే అల్లు అర్జున్ ను రంగంలోకి తెచ్చారట. రుద్రమదేవి ప్రాజెక్టు పై అల్లు అరవింద్ పాజిటివ్ గా వున్నారని, అందుకే అందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. ఏదైతేనేం. ఇంత పెద్ద, మంచి ప్రాజెక్టు ఆగిపోకుండా ముందుకు వెళ్లే అవకాశం కలిగింది.