Advertisement

Advertisement


Home > Movies - Movie News

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. రామ్ చరణ్

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. రామ్ చరణ్

పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ కదిలింది. ప్రచారాలు, ప్రకటనలు, ట్వీట్ లు, వీడియో బైట్ లు ఇలా ఎవరి ప్రయత్నం వారిది. ఆఖరిగా అబ్బాయ్ రామ్ చరణ్, వదిన సురేఖ కూడా పిఠాపురం వస్తున్నారు. పిఠాపురం కుక్కుటేశ్వరుడిని దర్ళించుకుని వెళ్లారు అన్నది పీఆర్ టీమ్ సమాచారం.

పిఠాపురం వచ్చి, దేవుడిని దర్శించి వెళ్లిపోతారా? అక్కడే వున్న పవన్ ను కలిసి అభినందించి లేదా సంఘీభావం ప్రకటింస్తారా? అనేది అది రేపు తెలుస్తుంది.

ఎలాగూ రామ్ చరణ్ ముందు మీడియా మైకులు బారులు తీరతాయి. పవన్ ఎన్నిక, మద్దతు వగైరా విషయాల మీద ఎలాగూ ప్రశ్నలు సంధిస్తారు. కనుక రామ్ చరణ్ డిప్లమాటిక్ మాటలు రేపు అంతా సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తాయి. రేపటితో ఇక ప్రచారం ముగుస్తుంది. అందువల్ల ఇక ఎవరూ వచ్చేది లేదు. ప్రచారం చేసేది లేదు.

ఇదిలా వుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కంఫర్టబుల్ సిట్యువేషన్ లోనే వున్నారని, భారీ మెజారిటీ వస్తుందని కూటమి నాయకులు, అభిమానులు అంతా నమ్మకంగా వున్నారు. ఈ నమ్మకం కుదిరిన తరువాత సినిమా ఇండస్ట్రీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు వున్నవారంతా పిఠాపురం క్యూ కడుతున్నారు. వీలయితే పవన్ ను కలిస్తున్నారు. లేదంటే ప్రచారం అంటూ ఓ రెండు ఫొటోలు దిగి వెనక్కు వస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?