చిరంజీవి కెరీర్ లో బాగా ఆలస్యమైన సినిమా

కరోనా, లాక్ డౌన్ తో పాటు కథలో విపరీతమైన మార్పులు, రీషూట్స్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైంది

చిరంజీవి హీరోగా నటించిన సోషియో పాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆడియన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో, ఈ సినిమా అంతలా వాయిదా పడుతూ వస్తోంది.

లెక్క ప్రకారం 2024లోనే విడుదల కావాలి. కానీ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం, విజువల్ ఎఫెక్టుల వల్ల 2025కి మార్చారు. ఆ తర్వాత 2026 సంక్రాంతికి అనుకున్నారు.

కానీ అప్పటికి ఓటీటీ డీల్ తో పాటు, కొంత గ్రాఫిక్స్ కూడా కాలేదు. తాజాగా సినిమాకి ఓటీటీ డీల్ కుదిరింది. దీంతో దసరాకు విడుదల చేద్దాం అనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. సంక్రాంతికి చిరంజీవి ‘కాకా’ సినిమా ఉంది.

అలా 2024లో విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ చిత్రం 2027కి వాయిదా పడింది. అయితే చిరంజీవి కెరీర్ లో సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమా ఇది కాదు.

చిరంజీవి కెరీర్ లో బాగా డిలే అయిన సినిమా ‘అంజి’. ఈ సినిమాను మొదలుపెట్టిన సంవత్సరానికి, విడుదల చేసిన ఏడాదికి మధ్య తేడా దాదాపు ఆరేళ్లు. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కాలం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న చిత్రం ఇదే.

అప్పట్లో విజువల్ ఎఫెక్టులకు చాలా టైమ్ పట్టేది. దీనికితోడు షూటింగ్ లో సమస్యలు, పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం, ఆర్థిక సమస్యలు కూడా అంజిని వెంటాడాయి.

చివరికి 2004 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టెక్నికల్ వాల్యూస్ పరంగా ఇప్పటికీ దీన్నొక అద్భుత ప్రయత్నంగా అంతా మెచ్చుకుంటారు.

ఇలా చిరంజీవి కెరీర్ లో ఆలస్యమైన చిత్రాలు మరికొన్ని కూడా ఉన్నాయి. ‘ఆచార్య’ సినిమాను అనుకున్న టైమ్ కు విడుదల చేయలేకపోయారు.

కరోనా, లాక్ డౌన్ తో పాటు కథలో విపరీతమైన మార్పులు, రీషూట్స్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో పాటు సైరా నరసింహారెడ్డి, రుద్రవీణ సినిమాలు కూడా ఆలస్యంగా విడుదలయ్యాయి.

ఓవరాల్ గా చూసుకుంటే, చిరంజీవి కెరీర్ లో బాగా ఆలస్యమైన చిత్రం ‘అంజి’ కాగా, ఆ తర్వాత స్థానం ‘విశ్వంభర’కే దక్కుతుంది. ఈ రెండూ గ్రాఫిక్స్ బేస్ చిత్రాలే కావడం విశేషం.

4 Replies to “చిరంజీవి కెరీర్ లో బాగా ఆలస్యమైన సినిమా”

  1. చెంగున చెంగున నిర్మాత చెంగేసి పోవంగా , చిరు దీపాలన్నీ కొడిగట్టి పోవంగా , దారులన్నీ మూసి మెగా మొగ్గే వేయంగా , అంజి దారిలోనే విశ్వం బర బర పోవంగం .. దిక్కేది నాకింకా దక్కేది పెద్ద సున్నాయేయంత..

  2. VFX… ఎలా ఉన్నా తేలిపోతాయి… పిల్లలు చేస్తున్నారు AI తో సూపర్ VFx.. కథ ఎలా ఉన్నా… కథనం లో గ్రిప్ ఉంటే నిలబడుతుంది… లేదంటే అస్సామే 

  3. ఎందుకో తెలీదు… ఇప్పుడు అవతార్ రేంజ్ VFX కూడా అంత exiting గా ఉండట్లేదు… చాలా కృతుకంగా ఉంటున్నాయి.

Comments are closed.