జ‌గ‌న్‌పై ఈడీ వేట‌.. తెర వెనుక ఏం జ‌రుగుతోందంటే?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై కేసుల‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) హ‌డావుడిగా పిటిష‌న్ వేసింది

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై కేసుల‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) హ‌డావుడిగా పిటిష‌న్ వేసింది. త్వ‌ర‌గా కేసుల్ని విచారించాల‌ని, మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌తో పాటు కేసుల్లోని మిగిలిన వారంతా నేరుగా హాజ‌ర‌వ్వాల‌నేది ఈడీ కోరిక‌.

అయితే ఈడీకి తెలంగాణ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఆల్రెడీ విచార‌ణ జ‌రుగుతున్న కేసుల్లో, ఇప్పుడేమైంద‌ని ఈడీని ప్ర‌శ్నించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈడీ అత్యుత్సాహం వెనుక ఎవ‌రున్నారో అర్థం చేసుకోడానికి పెద్ద తెలివితేటలు అవ‌స‌రం లేదు. కేసుల విచార‌ణ జ‌రుగుతుంటే , నేరుగా జ‌గ‌నే హాజ‌రు కావాల‌నే కోరిక వెనుక ఎవ‌రి రాజకీయ ప్ర‌యోజ‌నాలున్నాయో, రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

కేవ‌లం భ‌విష్య‌త్ రాజ‌కీయాల్ని దృష్టిలో పెట్టుకునే, ఈడీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంద‌నే మాట వినిపిస్తోంది.

వ‌చ్చే ఏడాదిలో సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నుంచి పాద‌యాత్ర మొద‌లు పెడ‌తాన‌ని వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌ధానంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎలాగైనా అడ్డంకులు సృష్టించేందుకు ఈడీ ద్వారా పావులు క‌దుపుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

కేసుల్లో నేరుగా జ‌గ‌న్ విచార‌ణ‌కు హాజ‌రైతే, నేర‌స్తుడిగా ప్ర‌చారం చేయ‌డానికి ఆయుధంగా వాడుకోవాల‌నేది ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌. అలాగే కేసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు, పాద‌యాత్ర‌కు ప‌దేప‌దే విశ్రాంతి ఇవ్వాల్సి వ‌స్తుంద‌నేది టీడీపీ పెద్ద‌ల వ్యూహంగా చెబుతున్నారు.

పాద‌యాత్రలో జ‌గ‌న్ దూకుడుకు చ‌ట్టం ద్వారా అడ్డుక‌ట్ట వేసే ఎత్తుగ‌డ‌గా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అందుకే ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే కేసుల విచార‌ణ‌కు జ‌గ‌న్ నేరుగా హాజ‌రు కావాల‌నే ప్ర‌తిపాద‌న‌ను ఈడీ ఉన్న‌ట్టుండి తెరపైకి తెచ్చింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

పాద‌యాత్ర‌ను ఏక‌బిగిన సాగ‌నివ్వ‌కూడ‌ద‌నే ఆలోచ‌న ఎవ‌రిదో ఈడీ పిటిష‌న్‌తో స్ప‌ష్ట‌మైంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిష‌న్ వెనుక చాలా ఉద్దేశాలున్నాయ‌ని న్యాయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో కంటే, ఈ ద‌ఫా జ‌గ‌న్ పాద‌యాత్రకు విప‌రీతంగా జ‌నాద‌ర‌ణ ఉంటుంద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ఎక్క‌డ ప‌ర్య‌టిస్తున్నా జ‌నం పోటెత్తుతున్నారు. అలాంటిది పాద‌యాత్ర మొద‌లు పెడితే, జ‌న‌సునామీనే అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

ముఖ్యంగా టీడీపీ భ‌విష్య‌త్ రాజ‌కీయాల్ని దృష్టిలో పెట్టుకుని, త‌న‌దైన రీతిలో వైసీపీని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోందనే మాట వినిపిస్తోంది. వ్య‌వ‌స్థ‌ల‌పై త‌న‌కున్న ప‌లుకుబ‌డిని, సమయం చూసుకుని ప్ర‌యోగిస్తోంది.

ఇందులో భాగంగానే ఈడీ దూకుడును చూడాల్సి వుంటుంద‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ఆలోచ‌న‌లు అర్థం చేసుకోవాలంటే, భ‌విష్య‌త్‌లో జ‌రిగే ఘ‌ట‌న‌ల‌ను లోతుగా విశ్లేషించాలి.

ఈడీ త‌న‌కు తానుగా జ‌గ‌న్‌పై పిటిష‌న్ వేసింద‌ని ఎవ‌రైనా అనుకుంటే, అంత‌కంటే అమాయ‌క‌త్వం వుండ‌ద‌నేది మెజార్టీ ప్రజాభిప్రాయం.

29 Replies to “జ‌గ‌న్‌పై ఈడీ వేట‌.. తెర వెనుక ఏం జ‌రుగుతోందంటే?”

  1. అంటే కే.సులు ఏమి విచారణ చేయకుండా… కోర్ట్ కి కూడా రాకుండా… పరిష్కారం అయిపోవాలి అంటావా?

  2. జగన్ ని పీకలేక తిరుమల స్వామి ని వాడుకున్నారు జంతు కొవ్వు బొంగు అని జగన్ పాదయాత చేయకున్నా కూడా గెలుస్తాడు మీ పాలన చూసాక ఓటు ఎవరు వెయ్యరు లే అంతగా ఉంటే ముందస్తు కి వెళ్ళండి 

      1. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి మరి మనోడికి కొరడా చూపెడితేనే బీజేపీ కి ఎలక్షన్ ఖర్చులు ఇస్తాడు ఆదానీ దగ్గర నొక్కేసిన 1750 కోట్లు ఇస్తే ప్రస్తుతానికి కేసు ఆపుతారు

  3. మాజీ MLA బడ్డుకొండ చెప్పాడు కదా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని జనాలని పోగేసి తీసుకొస్తాం అని.. అలా చేస్తే ఎందుకు పోటెత్తకుండా ఉంటారు..

  4. మహానే(మే)త ఉండి ఉంటే ఇద్దరూ కలసి కో!;ర్ట్  కి వెళ్ళే వాళ్ళు..ఫ్రైడ్ స్టార్ట్స్..😀

  5. అరేయ్ బాబూ! అన్నియ్యను అరెస్ట్ చేయకుండా ఉంటే చాలు… కూటమికి అంతకంటే పెద్ద ఎన్నికల వ్యూహం అక్కర్లేదు! రోజూ మీడియా ముందుకొచ్చి తన అజ్ఞానాన్ని మైకు పెట్టి మరీ చాటుకుంటే చాలు… 2..0..2..9లో కూటమి గెలుపుకు ప్రత్యర్థులే ప్రచారకర్తలవుతారు! కూటమి నేతలు కష్టపడాల్సిన పనిలేదు… అన్నియ్య నోరు విప్పితే చాలు, కూటమికి ఓట్లు పెరిగినట్టే!

  6. అరేయ్ బాబూ! అన్నియ్యను అరెస్ట్ చేయకుండా ఉంటే చాలు… కూటమికి అంతకంటే పెద్ద ఎన్నికల వ్యూహం అక్కర్లేదు! రో.జూ మీడియా ముందుకొచ్చి తన అ.జ్ఞా.నా.న్ని మై.కు పెట్టి మరీ చాటుకుంటే చాలు… 2..0..2..9లో కూటమి గెలుపుకు ప్రత్యర్థులే ప్రచారకర్తలవుతారు! కూటమి నేతలు కష్టపడాల్సిన పనిలేదు… అన్నియ్య నోరు విప్పితే చాలు, కూటమికి ఓట్లు పెరిగినట్టే!

  7. అరేయ్ బాబూ! అన్నియ్యను అ.రె.స్ట్ చేయకుండా ఉంటే చాలు… కూటమికి అంతకంటే పెద్ద ఎన్నికల వ్యూహం అక్కర్లేదు! రో.జూ మీడియా ముందుకొచ్చి తన అ.జ్ఞా.నా.న్ని మై.కు పెట్టి మరీ చాటుకుంటే చాలు… 2..0..2..9లో కూటమి గెలుపుకు ప్రత్యర్థులే ప్రచారకర్తలవుతారు! కూటమి నేతలు కష్టపడాల్సిన పనిలేదు… అన్నియ్య నోరు విప్పితే చాలు, కూటమికి ఓట్లు పెరిగినట్టే!

  8. అరేయ్ బాబూ! అన్నియ్యను అ.రె.స్ట్ చేయకుండా ఉంటే చాలు… కూటమికి అంతకంటే పెద్ద ఎన్నికల వ్యూహం అక్కర్లేదు! రో.జూ మీడియా ముందుకొచ్చి తన అ.జ్ఞా.నా.న్ని మై.కు పెట్టి మరీ చాటుకుంటే చాలు… 2..0..2..9లో కూటమి గెలుపుకు ప్రత్యర్థులే ప్రచారకర్తలవుతారు! కూటమి నేతలు కష్టపడాల్సిన ప.ని.లే.దు… అన్నియ్య నో.రు విప్పితే చాలు, కూటమికి ఓ.ట్లు పెరిగినట్టే!

  9. అ.రే.య్ బా.బూ! అన్నియ్యను అ.రె.స్ట్ చేయకుండా ఉంటే చాలు… కూటమికి అంతకంటే పెద్ద ఎ.న్ని..ల వ్యూ.హం అక్కర్లేదు! రో.జూ మీడియా ముందుకొచ్చి తన అ.జ్ఞా.నా.న్ని మై.కు పెట్టి మరీ చాటుకుంటే చాలు… 2..0..2..9లో కూటమి గెలుపుకు ప్రత్యర్థులే ప్రచారకర్తలవుతారు! కూటమి నేతలు కష్టపడాల్సిన ప.ని.లే.దు… అన్నియ్య నో.రు వి.ప్పి.తే చాలు, కూటమికి ఓ.ట్లు పెరిగినట్టే!

  10. అదేంటో అన్న తన జీవితానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ ని బాబు చేతులో పెట్టాడు. అన్నేమో ఉత్కంఠగా సాగే పొలిటికల్ క్రికెట్ మ్యాచ్ చూద్దామంటే, ఆయనేమో చటుక్కున ఛానెల్ మార్చి హారర్ సినిమా పెట్టాడు!..😀

  11. అరె శుంఠ, ED కేసులు ఇతర కేసులాగా కాదు, కేసు పక్క కన్విక్షన్ ఉంటుంది!! ja*** కేసులో complete paper trail establish చేశారు, సో శిక్ష నూటికి నూట యాభై శాతం పడుతుంది అందుకే ఈ దొంగల ముఠా ముందు CBI cases తేల్చండి తరువాత ED cases అని పిటిషన్స్ వేస్తుంది, ఇంకో పక్క CBI cases లో discharge petitions వేస్తూ దాన్ని తేలనీయకుండా చేస్తున్నారు!! ఇప్పుడు కనుక ED కేసులు CBI కేసులకి సంబంధం లేకుండా ట్రయిల్ కనుక వస్తే అతి తొందరలో ఈ ముఠా కి శిక్ష పడటం పక్కా, ఈ conviction బేస్ చేసుకొని CBI కేసుల్లో కూడా conviction పడుతుంది, అందుకే ఇంతలా పిస్సుకుంటున్నాడు వీడు!!!

  12. మా సింగిల్ సింహాన్ని బొక్కలోకి పంపించి ప్యాలెస్ నీ, పార్టీ నీ &పెళ్ళాన్ని ఆక్రమించుకునే కుట్ర ప్యాలెస్లో  జరుగుతోంది

  13. ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా కోర్టుకి వెళ్ళి కేసుల సంగతి తేల్చి కడిగిన ముత్యంలా బయటికి రావొచ్చుగా!11 సంవత్సరాలు సాగతీసినా,ED తనపని తాను చేసినా దానికి cbn కి లింక్ పెట్టీ బయటపడాలని తాపత్రయం తప్ప ను రాసే దాంట్లో ఏముంది చెప్పు.

Comments are closed.