జిల్లాకు వైఎస్సార్ పేరు తొల‌గించాల‌న‌డం దుర్మార్గం

జిల్లాకు వైఎస్సార్ పేరు తొల‌గించాల‌ని వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ డిమాండ్ చేయ‌డం దుర్మార్గ‌మ‌ని వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయ‌న క‌డ‌ప‌లో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, క‌డ‌ప జిల్లాకు…

జిల్లాకు వైఎస్సార్ పేరు తొల‌గించాల‌ని వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ డిమాండ్ చేయ‌డం దుర్మార్గ‌మ‌ని వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయ‌న క‌డ‌ప‌లో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, క‌డ‌ప జిల్లాకు చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా 2010లో వైఎస్సార్ పేరు పెట్టార‌న్నారు. నాడు కాంగ్రెస్ హ‌యాంలో వైఎస్సార్ పేరు పెట్టాల‌నే ప్ర‌తిపాద‌న‌కు టీడీపీ కూడా మ‌ద్ద‌తు ప‌లికింద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

14 ఏళ్ల క్రితం క‌డ‌ప జిల్లాకు పెట్టిన వైఎస్సార్ పేరును ఇప్పుడు వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ తొల‌గించాల‌ని సీఎం చంద్ర‌బాబుకు విన‌తిప‌త్రం ఇవ్వ‌డం స‌బ‌బుగా లేద‌న్నారు. మంత్రి స‌త్య‌కుమార్ ప‌క్క జిల్లా నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌త్య‌కుమార్ ఎక్క‌వ‌గా గ‌డిపిన దాఖ‌లాలు లేవ‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు.

ఎప్పుడూ ఢిల్లీలోనే గ‌డిపిన స‌త్య‌కుమార్‌కు వైఎస్సార్ సేవ‌ల గురించి తెలిసిన‌ట్టు లేద‌న్నారు. కడ‌ప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టాల‌ని అన్ని పార్టీలు ఏక‌గ్రీవంగా చేశాయ‌న్నారు. వైద్యారోగ్య‌శాఖ మంత్రి పేర్ల‌తో రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి హిత‌వు చెప్పారు.

ఇదిలా వుండ‌గా వైఎస్సార్ పేరు ఉనికిలో లేకుండా చేసేందుకు స‌త్య‌కుమార్‌తో స‌రికొత్త రాజ‌కీయానికి తెర‌లేపార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ నాయ‌కులెవ‌రూ వైఎస్సార్ పేరు గురించి మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌డ‌ప‌తో, అలాగే రాష్ట్రంతో పెద్ద‌గా సంబంధాలు లేని స‌త్య‌కుమార్‌తో పొలిటిక‌ల్ గేమ్ న‌డుపుతున్నార‌నే విమ‌ర్శ వుంది.

15 Replies to “జిల్లాకు వైఎస్సార్ పేరు తొల‌గించాల‌న‌డం దుర్మార్గం”

  1. అండమాన్ నికోబార్ దీవులు దాటిన తర్వాత ఎవ్వరూ నివాసం లేని ఎవ్వరికీ చెందని ఒక ఇసుక దిబ్బ ఉంది.

    దానికి ఆ మహానేత పేరు పెట్టాలి.

    కడప జిల్లాకు కడప జిల్లా అనే పేరు తిరిగి పెట్టాలి

  2. అండమాన్ నికోబార్ దీవులు దాటి ఒక వంద మైళ్ళు దాటితే ఎవ్వరికీ చెందని, ఏ జీవి నివసించని ఒక ఇసుక దిబ్బ ఉంది.

    దానికి కావాలంటే ఆ మహానేత పేరు పెట్ట వచ్చు.

  3. వేలకు వేల కోట్లు తినేసి న దొంగల పేర్లు పెట్టడం ఏమిటి అధికారం లో వున్నాం కాదని పెట్టుకొంటే తర్వాత వచ్చే ప్రభుత్వాలు తీసేస్తాయి అందులో తప్పేముంది ముందర అయన మీద వున్నా అవినీతి కేసులు తేలితే ఆ పేరు ఉంచొచ్చు

Comments are closed.