దసరా సినిమాలు.. వేటికవే ప్రత్యేకం

ఈ దసరాకు పెద్ద సినిమాల్లేవ్. ఉన్నంతలో ‘విశ్వం’ మాత్రమే కనిపిస్తోంది. మిగతావన్నీ చిన్న సినిమాలే.

ఈ దసరాకు పెద్ద సినిమాల్లేవ్. ఉన్నంతలో ‘విశ్వం’ మాత్రమే కనిపిస్తోంది. మిగతావన్నీ చిన్న సినిమాలే. అయితే మిగతావి వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమా దసరా కానుకగా వస్తోంది. ఇప్పటికే సినిమా ప్రచారం జోరుగా నడుస్తోంది. శ్రీనువైట్ల దర్శకుడు. ఈ దసరాకు పక్కాగా నవ్విస్తామంటున్నాడు హీరో.

సుధీర్ బాబు హీరోగా నటించిన “మా నాన్న సూపర్ హీరో” సినిమా కూడా దసరాకే వస్తోంది. ఇది పూర్తిగా ఎమోషనల్ మూవీ అంటున్నాడు సుధీర్ బాబు. ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండవని, పూర్తిగా ఫాదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ గా సాగుతుందని చెబుతున్నాడు.

ఇక సుహాస్ హీరోగా “జనక అయితే గనక” సినిమా వస్తోంది. ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ దసరాకు తమదే సరైన సినిమా అని కూడా చెబుతున్నారు.

వీటితో పాటు రజనీకాంత్ హీరోగా వేట్టయన్, కన్నడ డబ్ మూవీ మార్టిన్ కూడా లిస్ట్ లో ఉన్నాయి. ఈ రెండూ యాక్షన్ సినిమాలు.

ఇలా దసరా బరిలో ఒక కామెడీ ఎంటర్ టైనర్, 2 యాక్షన్ మూవీస్, ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్, ఒక ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ మూవీ వస్తున్నాయి. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

4 Replies to “దసరా సినిమాలు.. వేటికవే ప్రత్యేకం”

Comments are closed.