తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారన్న చర్చ జరుగుతోంది. టీడీపీలో జేసీ సీనియర్ నేత. మనసులో ఏదీ దాచుకోరు. రాజకీయాల్లో ప్రతిదీ బహిరంగంగా మాట్లాడ్డం ఇబ్బందిగా మారుతోంటోంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నేతగా జేసీ కామెంట్స్, వ్యవహార శైలి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని టీడీపీ నేతలు అంటున్నారు.
తాజాగా అనంతపురంలో జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కాలిపోయింది. మరో బస్సు స్వల్పంగా దెబ్బతింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు కాలిపోయిందని అధికారులు చెబుతుండగా, దాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి అంగీకరించడం లేదు. దీని వెనుక బీజేపీ హస్తం వుందని ఆయన మండిపడుతున్నారు. నోటికొచ్చినట్టు తిట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపులో బీజేపీ నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి.
బహుశా ఆ వివాదమే తన బస్సు కాల్చివేతకు దారితీసిందని ఆయన భావించి, వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసి వుంటారనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా జగన్‌రెడ్డే మంచోడని పదేపదే ఆయన చెప్పడం కూటమి నేతలకు కోపం తెప్పించే అంశం. బూడిద తరలింపు పంచాయితీకి రావాలని సీఎంవో నుంచి ఫోన్ చేసినా, ఆయన చంద్రబాబు వద్దకు వెళ్లలేదు. ఇలా తన ఇష్టానుసారం జేసీ ప్రవర్తిస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది.
తాడిపత్రిలో జేసీ కుటుంబానికి బలమైన వర్గం వుండడం, మొండిగా వ్యవహరిస్తుండడంతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పుడు కూటమి మిత్రపక్షమైన బీజేపీ నేతలపై రాయలేని భాషలో జేసీ నోరు పారేసుకున్నారు. జేసీపై చర్యలు తీసుకునే ధైర్యం టీడీపీ చేయలేదు. అలాగని ఆయన చర్యల్ని సమర్థించలేకపోతోంది.
he is outdated , waste article on him
malapu traashtulaki saraina mogudu..
Ante jagan gaadikegaa?
Buraaa ledhu veediki