వెనకటికి ఎవడో ‘నాకు పిచ్చి కుదిరింది.. రోకలి తలకు చుట్టండి’ అన్నాట్ట! టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా అచ్చం అలాగే ఉంది. పాలకమండలి కావచ్చు, అధికారులు కావొచ్చు.. తాము బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ఏదో తమ ముద్ర చూపించేయాలని తపన పడిపోతుంటారో, లేదా, కొత్తగా తమకు లబ్ధి చేకూరేలా తమ వారికి దోచిపెట్టాలని ఆరాటపడిపోతుంటారో తెలియదు గానీ.. ఉన్న వ్యవస్థల్లో మార్పులు చేర్పులు చేయడానికి ఉత్సాహపడుతుంటారు.
ఇక నిర్దిష్టమైన ఆలోచన, ప్రణాళిక లేకుండా.. అవకతవకగా తీసుకునే అలాంటి నిర్ణయాలు అనేకం బెడిసి కొడుతూ ఉంటాయి. వాటిని చక్కదిద్దుకోవడంలోనూ మళ్లీ తప్పుటడుగులే వేస్తుంటారు. అలాగే ఇప్పుడు శ్రీవాణి టికెట్ల జారీ వ్యవహారం కూడా తయారౌతోంది.
10,500 రూపాయలకు తిరుమలేశుని వీఐపీ కోటాలో దర్శించుకునే టికెట్లను శ్రీవాణి పథకం కింద విక్రయిస్తున్నారు. ఈ కోటాలో రోజుకు వెయ్యి టికెట్లు విక్రయిస్తుండగా… 200 రేణిగుంట విమానాశ్రయంలో అమ్ముతారు. మిగిలిన 800 టికెట్లకు ఆఫ్ లైన్ లో తిరుమలలో విక్రయించే సదుపాయం ఉండేది. రద్దీ ఎక్కువైన సందర్భాల్లో గందరగోళం చెలరేగేది.
తిరుమలలో ఏ సేవ విషయంలోనైనా పరిస్థితి ఇంతే అనడంలో సందేహం లేదు. కోటా అయిపోయిన తర్వాత.. టికెట్లు దొరక్క మిగిలిపోయిన వారు తిరుమలలోనే బసచేసి మరురోజు మళ్లీ టికెట్లు తీసుకునే వాళ్లు. ఈ విధానాన్ని తీసేసి తిరుమలలోనే ఏరోజు శ్రీవాణి దర్శనానికి అదేరోజున ఆన్ లైన్ కరెంటు బుకింగ్ చేసుకునే విధానం తీసుకువచ్చారు.
అంటే ఇవాళ దర్శనానికి వెళ్లాలంటే.. ఇవాళే కరెంటు బుకింగ్ ఆన్ లైన్ లో చేసుకోవాలన్నమాట. అంటే దర్శనానికి వెళ్లదలచుకున్న వారు తిరుమలకు వచ్చిన తర్వాతే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆన్ లైన్ లావాదేవీల్లో తేడా వల్ల బుక్ కాకపోతే.. ఇక వారి గతి అంతే! అలా ఎన్నిరోజులు వేచిఉండాలో తెలియదు. పైగా ఆన్ లైన్ లో ఇంకో సమస్య వచ్చింది.
ముందు పదివేలు విరాళం చెల్లించి ఓకే అయిన తర్వాత, 500 కట్టి టికెట్ కొనేలా పద్దతి పెట్టారు. పదివేలు కట్టిన వాళ్లు టికెట్ కొనేలోగా కోటా పూర్తయిపోవడం జరిగేది. ఇలా నానా అవస్థలు పడుతుండగా.. ఈ పద్ధతిలో టీటీడీ మార్పు చేసింది.
పదిన్నర వేల వంతున నాలుగు టికెట్ల వరకు ఒకేసారి చెల్లించి టికెట్లు పొందే పద్ధతి తెచ్చారు. అయితే టీటీడీ తెచ్చిన విధానాన్ని నమ్ముకుని ఇదివరకే పదివేల రూపాయలు చెల్లించేసి, టికెట్ దొరక్కుండా మిగిలిపోయిన వారి పరిస్థితి ఏమిటి? వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తారట.
ఇదెంత అవకతవక నిర్ణయమో చెప్పనలవి కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుచూపుతో సరైన విధానం తేవడం చేతకాని అధికారులు, విరాళం డబ్బు కట్టేసి దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి ముందు టికెట్లు కేటాయించి.. తర్వాత కొత్త పద్ధతి అమల్లోకి తేకుండా.. వారందరికీ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడం, దుర్మార్గం మరియు అనైతికం అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

100% agree
Tappu bhakthulade. Mahimagala devudu intlo kakunda kindameede unbadani nammadam. Mana pracharam kuda alane sagutondi
enchakka Roja, Peddireddy tickets ammukune vaaru.
Roja, Peddireddy tickets ammukune vaaru.
తిరుమల వెంకన్న లడ్డు నెయ్యి కల్తీ చేసిన వాడికి మళ్లీ సీఎం. అదే జరిగితే ఇంకా ధర్మాని ఎలా కాపాడినట్లు. మావయ్య తన జన్మలో సీఎం కాలేడు. ఇది రాసి పెట్టుకోండి. దేవుడితో పరాచకాలు ఈ యేసు సైకో కిఅర్ధం కావటంలేదు. డబ్బుతో కోర్టులని నిర్వహించడం కాదు, దేవునితో ఆటలు ఇంకా సాగవు ఇంకా.
తిరుమల వెంకన్న లడ్డు నెయ్యి కల్తీ చేసిన వాడికి మళ్లీ సీఎం. అదే జరిగితే ఇంకా ధర్మాని ఎలా కాపాడినట్లు. మావయ్య తన జన్మలో సీఎం కాలేడు. ఇది రాసి పెట్టుకోండి. దేవుడితో పరాచకాలు ఈ యే సు సై కో కి అర్ధం కావటంలేదు. డబ్బుతో కో ర్టు లని నిర్వహించడం కాదు, దేవునితో ఆటలు ఇంకా సాగవు ఇంకా.
అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడుతుంటే, నువ్వు ఇంకేదో మాట్లాడుతావు ఏంటిరా సామి! “అసలు జీవితంలో సీఎం కాలేడు..అది శాసనం” -అని హూంకరించిన వాడు 2 చోట్లా ఓడిపోయి, ఇప్పుడు ఇంకొకరి సంకనెక్కితే గాని గెలవలేకపొయాడు. ఆ ఇంకొకరు కూడా అంతే, గెలవడం గగనమైపొయే పరిస్థితిలో కలసి పోటీ కి వచ్చి గెలిచారు. కాబట్టి ఇలా రాసిపెట్టుకోవడాలు-గట్రా అల ఉంచి ప్రస్తుత సమస్యలపై దృష్టి సారిద్దాం.
Edo patam appa cheppi nattu undi .baaga train chesi .reality ledu .
Readers ante value leds