తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పదిన్నర వేల రూపాయలకు వీఐపీ హోదాలో తిరుమలేశుని దర్శించుకోవడానికి కల్పించే అవకాశానికి కూడా రకరకాల కత్తెరలు వేస్తోంది.
తిరుమలలో ఆఫ్‌లైన్ పద్ధతిలో శ్రీవాణి టికెట్ విక్రయాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. 9వ తేదీనుంచి నెలరోజుల పాటు ఈ విధానాన్ని అమలుచేసి, ఆ తర్వాత కొనసాగించనున్నట్టు వారు అంటున్నారు. అంటే కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే శ్రీవాణి టికెట్ల విక్రయం ఉంటుందన్నమాట. అయితే.. ఎందుకు ఇలాంటి మార్పు చేశారో వారు వివరించలేదు. కాకపోతే.. టీటీడీ కొత్త ఆలోచన వలన అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.10500 చెల్లించి శ్రీవారి దర్శనానికి శ్రీవాణి వీఐపీ టికెట్ పొందేందుకు మూడు రకాల ఏర్పాట్లున్నాయి. ఎడ్వాన్స్ బుకింగ్ ఒక పద్ధతి కాగా, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ కరెంట్ బుకింగ్ విధానం మరొకటి. ఈ రెండూ కాకుండా.. తిరుమలలో ప్రతిరోజూ ఆఫ్ లైన్ పద్ధతిలో 800 టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. వాటన్నింటినీ కరెంట్ బుకింగ్ ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే విక్రయించనున్నట్టుగా తెలుస్తోంది.
అంటే ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలవరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదేరోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక కుటుండబానికి నలుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో టికెట్లు ఇస్తాం అని అంటున్నారు.
కానీ.. ఇందులో అనేక మతలబులకు ఆస్కారం ఉందనేది భక్తుల ఆరోపణ. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తుంటారు. అయితే.. ఆ కోటా కొన్ని నిమిషాల్లోనే పూర్తయిపోతుంటుంది. ఎవరికైనా టికెట్ దొరికిందంటే అది కేవలం అదృష్టం మాత్రమే అనుకోవాలి.
ఎందుకంటే.. ఎంత హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ల మీద ప్రయత్నించినా సరే.. ఖాళీలను గమనించి, పేర్లు ఫిల్ చేసి బుక్ చేసేలోగా ఆ ఖాళీలు నిండిపోతుంటాయి. ఆన్ లైన్ కోటా విడుదల కాగానే.. ఆ టికెట్లను బుక్ చేసి ఇప్పించే దళారులకు మాత్రం పని నడుస్తుంది. ఇప్పుడు శ్రీవాణిని కూడా పూర్తిగా ఆన్ లైన్ విధానంలోకి మార్చేయడం అనేది.. కేవలం దళారులను ప్రోత్సహించడానికే అనే విమర్శలున్నాయి.
విమానాల్లో తిరుపతిలో దిగేవారు, ఆన్ లైన్ బుకింగ్ లో అత్యంత అనుభవం ఉన్నవారికి తప్ప.. సంపన్నుల్లో కూడా మరెవ్వరూ శ్రీవాణి ద్వారా కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి వీల్లేదన్నట్టుగా టీటీడీ కొత్త ఆలోచన ఉన్నదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవాణి టికెట్ కోసం పదిన్నర వేలు ఖర్చు పెట్టి వస్తున్నారంటే సంపన్నులు మాత్రమే అయి ఉంటారు. అయితే వారు కూడా తిరుమలకు వచ్చిన తర్వాతనే ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ టికెట్ బుకింగ్ కుదరకపోతే పరిస్థితి ఏమిటి అనే క్లారిటీ లేదు. అలా ఎన్నిరోజుల పాటూ శ్రీవాణి టికెట్ బుకింగ్ కు నిరీక్షిస్తూ తిరుమలలోనే ఉండాలి. అప్పటికీ దొరక్కపోతే ఏం చేయాలి? అనేవన్నీ ప్రశ్నలే.
ఒకవేళ తిరుమలలో ఉండాలని అనుకున్నా కూడా.. గదులు దొరకడం అంత సులువు కాదు. కేవలం ఆన్ లైన్ పద్ధతి మాత్రమే అంటే.. వారాలు నెలలు గడిచినా గది దొరుకుతుందనే గ్యారంటీ లేదు. ఇలాంటి అపభ్రంశపు ఆలోచన కేవలం భక్తులను నానా యాతన పెట్టడానికి, దళార్లను ప్రోత్సహించడానికే చేసినట్లున్నదని పలువురు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

Problem kada? Ja-ggadi converted kukkalu TTD lo chairman ga undi anni tickets offline lo cash ki ammukunte. Yentha convenient ga undedo?
Problem kada? Enchakka offline lo cash ki ammi dobba leru.
Ro-ja, YV, Bhu-mana lanti vallu yemi kavali?
Jagan introduced Srivani scheme which has been useful to many NRIs and people who could afford and reduced seeking political leaders recommendation letters. It has been so successful that CBN could not dare to cancel the scheme. Now, some people are trying to make money out of this also.
Jagan also banned use of plastic bottles from Tirumala, which was another great initiative.
chori – Jagan introduced .
Banning plastic bottles was great initiative .. but what was the replacement for it do you know.?? I went to Tirumala in may 2024.. they were selling 1 liter water for 30 rupees in Glass bottle ..if you have to take the bottle with you have to pay additional 40 rupees .. on top of the brands of water they were selling is local cheap brands manufactured some where in Chittor district, no known brands like aqua fina or kenley .. .. now tell what is great in his initiative ..if cheap / non branded water getting sold for 30rupees ..where in branded water used to come for 20rs .. ??
banning plastic bottles and selling local water for 30rs is a great initiative .. agree agree ..
Are you getting plastic water bottle for 10rs anywhere in India? and is plastic ban not a good governance? looks like you guys want to remain in 3rd world country!!
banning plastic is good initiative …. provided the alternative to it is cost effective and better .. .. did you ever went to Tirumala ? I went personally, they were selling unknown branded water for 30rs a litre .. know facts before supporting something .. if you need to keep the botter you have to pay another 40 — ie total 70rs for a liter ..while the earlier plastic bottle comes for rs 20 ..
30rs for a litre of non branded local sourced water . no seal nothing .. is good governance for you ?
జగన్ బంధువు సూపర్ సామి ఎక్కడ ? మొత్తం దోపిడీ చేసి చిన్న చోరీ అనటం జగన్ కి బాగా అలవాటు