బీజేపీకి రిక్త హస్తమేనా?

విశాఖలో కీలక పదవులు కాషాయం పార్టీకి దక్కకుండా పోతున్నాయని అంటున్నారు. ఒకనాడు విశాఖ మేయర్ గా గెలిచి అయిదేళ్లు పాలించిన చరిత్ర బీజేపీది.

విశాఖలో కీలక పదవులు కాషాయం పార్టీకి దక్కకుండా పోతున్నాయని అంటున్నారు. ఒకనాడు విశాఖ మేయర్ గా గెలిచి అయిదేళ్లు పాలించిన చరిత్ర బీజేపీది. అదే విధంగా విశాఖ ఎంపీ పదవిని కూడా బీజేపీ గతంలో దక్కించుకుని మహా నగరంలో తన రాజకీయ ప్రాభావాన్ని చాటుకుంది.

కానీ గతానికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. విశాఖ ఎంపీ సీటు టీడీపీ 2024 లో తీసుకుంది. అనకాపల్లి ఎంపీ సీటుని కేటాయించింది. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటుని అయినా బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరినా అది కూడా కుదరలేదు. టీడీపీయే సొంతం చేసుకుంది.

ప్రస్తుతం డిప్యూటీ మేయర్ విషయంలో కూడా బీజేపీ పట్టుబట్టినా అది జనసేనకు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం జీవీఎంసీలో 120 డివిజన్లకు గానూ కూటమి 98 గెలుచుకుంది. అందులో టీడీపీ సొంతంగా 64 గెలుచుకుంటే జనసేన తరువాత స్థానంలో ఉంటూ 26 కార్పోరేటర్లను గెలిపించుకుంది. బీజేపీకి ఎనిమిది మంది కార్పోరేటర్లు మాత్రమే ఉన్నారు.

ఇలా రాజకీయ ప్రాబల్యం పరంగా చూసుకున్నా సంఖ్యాబలంగా చూసుకున్నా జనసేనకే డిప్యూటీ మేయర్ అవకాశం ఉంది. దాంతో ఆ పార్టీ నుంచే పీవీ శివ ప్రసాద్ పేరు ఖరారు అయినట్లుగా ప్రచారం సాగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి జనసేనలో కూడా కీలక పాత్ర పోషించిన శివ ప్రసాద్ కి ఈ పదవి దక్కేలా చేయడంతో జనసేన అగ్ర నాయకత్వం సఫలీకృతం అయింది అని అంటున్నారు.

దాంతో ఆయనకే ఈ పదవి అని అంటున్నారు. బీజేపీ ఆశలు అయితే ఈ ఉప మేయర్ పదవి విషయంలో కూడా నీరు కారాయనే చెబుతున్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే టీడీపీ జనసేన బలంగా విస్తరిస్తున్నాయి. విశాఖలో కూడా రెండు పార్టీలే తన బలాన్ని చాటుకుంటున్నాయి. బీజేపీ పొత్తులో ఉన్నా జూనియర్ పార్టనర్ గానే ఉంది అన్న అసంతృప్తి అయితే కాషాయ దళంలో ఉంది.

2 Replies to “బీజేపీకి రిక్త హస్తమేనా?”

  1. ohh వైజాగ్ లో వైసీపీ 4th ప్లేస్ కాదా..బీజేపీ కన్నా 5 seat లు ఎక్కువే వచ్చాయి..గ్రేట్ వైసీపీ.ఆ

Comments are closed.