చేతులెత్తేసిన వైసీపీ లీడ‌ర్స్‌.. త‌లెత్తుకునేలా చేసిన కేడ‌ర్‌!

రాష్ట్ర వ్యాప్తంగా మొద‌టి విడ‌త‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాల్ని చూపుతూ, రానున్న రోజుల్లో అధికారం త‌మ‌దే అని వైసీపీ నేత‌లు బ‌లంగా చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొద‌టి విడ‌త‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాల్ని చూపుతూ, రానున్న రోజుల్లో అధికారం త‌మ‌దే అని వైసీపీ నేత‌లు బ‌లంగా చెబుతున్నారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల విజ‌యాలు వైసీపీలో జోష్‌ను , టీడీపీలో భ‌యాన్ని నింపాయ‌న్న‌ది ప‌చ్చి నిజం. ఈ విజ‌యాల్ని చూసిన త‌ర్వాత కూడా, వైసీపీకి అంత సీన్ లేద‌ని కూట‌మి నేత‌లు మాట్లాడితే, వాళ్ల‌కు రాజ‌కీయంగా పోయే కాలం ద‌గ్గ‌ర ప‌డింద‌ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

అయితే పంచాయ‌తీల్లో వైసీపీ విజ‌యాల్ని ఎలా చూడాల‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. గ్రామీణ స్థాయిలో వైసీపీ బ‌ల‌ప‌డుతోంద‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాల్ని ప‌ల్లె ప్ర‌జ‌లు పంపారు. ఇందులో రెండో మాట‌కు చోటు లేదు.

మున్సిప‌ల్‌, ఆ త‌ర్వాత ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పోలిస్తే, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు అద్భుత విజ‌యాల్ని న‌మోదు చేసుకున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ లోతుగా విశ్లేష‌ణ చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

మున్సిపాలిటీ, ప‌రిష‌త్ ఎన్నిక‌లు పూర్తిగా రాజ‌కీయ పార్టీల గుర్తుల‌పై జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో కేడ‌ర్‌కు అండ‌గా నిల‌వాల‌ని వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే త‌న పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు ఇచ్చారు.

కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ది శాతం మిన‌హాయిస్తే, ఏ ఒక్క‌కూ నాయ‌కుడు త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌లేదు. అందుకే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో దారుణ ఫ‌లితాల‌ను మూట క‌ట్టుకున్నారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కొద్ది మేర‌కు న‌యం అని చెప్పొచ్చు.

త‌మ అధినాయ‌కుడు ఆదేశించ‌డంతో కేవ‌లం నామినేష‌న్లు వేసేందుకు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు ప్రాధాన్యం ఇచ్చారు. ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల్లో గెల‌వాల‌న్న త‌ప‌న‌, ప‌ట్టుద‌ల వైసీపీ నేత‌ల్లో క‌నిపించ‌లేదు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలుగా నిల‌బ‌డాల‌ని త‌పిస్తున్న నాయ‌కుల‌కే ఆస‌క్తి లేన‌ప్పుడు త‌మ‌కెందుకులే అని అభ్య‌ర్థులు కూడా మొక్కుబ‌డిగా ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు.

కేవ‌లం డ‌బ్బు ఖ‌ర్చు అవుతుంద‌నే భ‌యంతోనే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు చేతులెత్తేశార‌న్న‌ది ప‌చ్చి నిజం. ఈ చేదు వాస్త‌వాల్ని ఇప్ప‌టికైనా జ‌గ‌న్ గుర్తించాల్సి వుంది.

ఇక పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి, పూర్తిగా సీన్ మారింది. ప్ర‌తి పంచాయ‌తీలోనూ వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎన్నిక‌ల్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అనేక క‌ష్ట‌న‌ష్టాల్ని భ‌రించి, ఆర్థిక ఇబ్బందుల్ని త‌ట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. అందుకే అద్భుత ఫ‌లితాల్ని సాధించ‌గ‌లిగారు.

తొలి విడ‌త‌లో రాష్ట్ర వ్యాప్తంగా 3,189 పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో వైసీపీ మ‌ద్ద‌తుదారులు 1,142 చోట్ల గెలుపొందారు. టీడీపీతో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డి సాధించిన విజ‌యాలివి.

పంచాయ‌తీల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారుల సాధించిన విజ‌యాల్ని చూపే, తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ఆ పార్టీ నాయ‌కులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప‌లితాలు వెలువ‌డిన‌ప్పుడు ఇలాంటి ఊపు వైసీపీలో క‌నిపించ‌లేదు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కొద్ది మేర‌కు మంచి ఫ‌లితాల్ని సాధించారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ పుంజుకుంటోంద‌న్న సంకేతాలు పంప‌డానికి ప‌రిష‌త్ ఎన్నిక‌లు ప‌నికొచ్చాయి. ఇప్పుడు పార్టీ గుర్తుల‌పై జ‌ర‌గ‌ని పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూట‌మిని భ‌య‌పెట్ట‌డం విచిత్రం. ఇదే ఓట‌రు తీర్పు గొప్ప‌త‌నం.

ఈ విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ అదృష్ట‌వంతుడు. పార్టీ నాయ‌కులు ఏ మాత్రం ఆర్థికంగా అండ‌గా నిల‌వ‌క‌పోయినా, అప్పోస‌ప్పో చేసి పంచాయ‌తీ ఎన్నికల్లో పోటీ చేయ‌డంతో పాటు విజ‌యాల్ని సాధించారు.

ఓడిపోయిన పంచాయ‌తీల్లో కూడా గ‌ట్టి పోటీ ఇచ్చి, ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టించారు. ఇప్పుడు వైసీపీ కేడ‌ర్ పోరాడి సాధించిన ఫ‌లితాల‌ను చూపి, అధికారం త‌మ‌దే అని నాయ‌కులు ప్ర‌చారం చేసుకునే ప‌రిస్థితి.

అందుకే కేడ‌ర్‌ను వైఎస్ జ‌గ‌న్ గుండెల్లో పెట్టుకోవాల‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. టీడీపీకి బ‌లం కేడ‌ర్ అని ఆ పార్టీ నాయ‌కులు అంటుంటారు. కానీ టీడీపీ కండే వైసీపీ కేడ‌రే అత్యంత శ‌క్తిమంత‌మైంద‌ని నిరూపిత‌మైంది. అ

యితే టీడీపీ నాయ‌కుల్లా కేడ‌ర్‌ను వైసీపీ నేత‌లు ప‌ట్టించుకోరు. ఇదే టీడీపీ, వైసీపీ మ‌ధ్య తేడా. ఇప్ప‌టికైనా వైసీపీ నాయ‌కులు కేడ‌ర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం వుంది.

కేడ‌ర్ వీరోచిత పోరాటాల వ‌ల్లే, ఇవాళ త‌లెత్తుకునే ప‌రిస్థితిలో ఉన్నామ‌ని వైసీపీ నాయ‌కులు గుర్తించాలి. ఈ కేడ‌ర్‌ను న‌మ్ముకుంటేనే అధికారాన్ని సాధించే అవ‌కాశం వుంటుంది. ఈ క‌ఠిన వాస్త‌వాన్ని గుర్తెరిగి, కేడ‌ర్‌కు త‌గిన గుర్తింపు ఇస్తేనే వైసీపీకి అధికారం.