తిరుప‌తి కార్పొరేష‌న్‌లో వైసీపీ విజ‌యం.. ఎలా అంటే?

తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి వాసుయాద‌వ్‌తో నామినేష‌న్ వేయ‌నివ్వ‌కూడ‌ద‌నే టీడీపీ పంతం నెగ్గ‌లేదు.

తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి వాసుయాద‌వ్‌తో నామినేష‌న్ వేయ‌నివ్వ‌కూడ‌ద‌నే టీడీపీ పంతం నెగ్గ‌లేదు.

తిరుప‌తి వైసీపీ ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ వ్యూహంతో ఎట్ట‌కేల‌కు వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి నామినేష‌న్ వేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో ప‌ట్ట‌ణ సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌డం వైసీపీకి అతిపెద్ద విజ‌యంగా భావించొచ్చు. ఈ నెల 17న రెండోరోజు స్వ‌యంగా మేయ‌ర్ అభ్య‌ర్థ త‌ర‌పున‌ తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డానికి వెళ్లారు. ఆ సంద‌ర్బంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.

రెండోసారి అభ్య‌ర్థినే స్వ‌యంగా తీసుకుని మ‌ళ్లీ ఎంపీ మ‌రోసారి వెళ్లారు. అప్పుడు కూడా పెద్ద సంఖ్య‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవ‌డంతో వైసీపీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

దీంతో గ‌త రాత్రి నుంచి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యం ఎదుట త‌ల్లి రేణుక‌తో క‌లిసి నామినేష‌న్ వేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ వాసుయాద‌వ్ వ‌ర్షంలోనే నిర‌స‌న‌కు దిగారు.

ఇవాళ నామినేష‌న్ దాఖ‌లుకు చివ‌రి రోజు కావ‌డంతో, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నామినేష‌న్ వేయ‌కూడ‌ద‌నే పంతంతో పెద్ద సంఖ్య‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు కార్యాల‌యం వెలుప‌ల క‌త్తులు, రాళ్లు, క‌ర్ర‌ల‌తో మోహ‌రించారు.

ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితిలో వాసుయాద‌వ్ మెరుపు వేగంతో వాళ్లంద‌రి క‌ళ్లు గ‌ప్పి, మున్సిప‌ల్ కార్యాల‌యం గోడ దూకి లోప‌లికి వెళ్లారు.

వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి నామినేష‌న్ దాఖ‌లు చేశార‌ని తెలిసి, టీడీపీ శ్రేణులు ఒక్క‌సారిగా తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాయి. మ‌రోవైపు మేయ‌ర్ అభ్య‌ర్థి నామినేష‌న్ వేయ‌డ‌మే అతిపెద్ద విజ‌యంగా తిరుప‌తి వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఇదిలా వుండ‌గా, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కాకుండా వుంటుందా? అనే అనుమానం కూడా లేక‌పోలేదు. తిరుప‌తి కార్పొరేష‌న్‌లో ఇంకా 21 డివిజ‌న్ల‌కు నామినేష‌న్ల‌ను వైసీపీ వేయాల్సి వుంది.

ఇప్ప‌టికి 45 డివిజ‌న్ల‌కు ఎలాగోలా దాఖ‌లు చేశారు. ప్ర‌ధానంగా మేయ‌ర్ ప‌ద‌విని ఏక‌గ్రీవం చేసుకోవాల‌నే టీడీపీ పెద్ద‌ల ఆదేశాల్ని అధికారులు ఏ ర‌కంగా అమ‌లు చేస్తారో చూడాలి.

23 Replies to “తిరుప‌తి కార్పొరేష‌న్‌లో వైసీపీ విజ‌యం.. ఎలా అంటే?”

  1. సింహం వారసులు కూడా గ్రామ సింహాలు లాగ గోడలు దూకి నామినేషన్స్ వేస్తున్నారా?

    1. పోటీ నుంచి పారిపోయారు తెలియదా ఆలా వైస్సార్సీపీ పి పారిపోరుంది అనుకున్నారు పోలేదు అని మీ బాధ అంటే కూటమి కన్నా వైస్సార్సీపీ బలం గా ఉంది అని ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటున్నారు 

  2. ఎంపీటీసీ కి నామినేషన్ వేస్తాము ఎవరు వస్తారు చూద్దాం పొతే నేను లేకుంటే నాతో పాటే v10 మందిని తీసుకొని పోతాను పెట్రోల్ తో వెళ్తాను పోసి నిప్పు పెట్టేస్తా వైఏమైనా ఉంటే కోర్ట్ లో చూసుకుంటా ఆంధ్రప్రదేశ్ కి ఒక దిశ ని మారుస్తా 

  3. మొత్తం మేయర్ కి నామినేషన్ వేశారు వైస్సార్సీపీ వాళ్ళు  ఒక్క పుంగనూరు తప్ప ఆంధ్రప్రదేశ్ మొత్తం వేశారు అంట కదా పుంగనూరు కూడా కోర్ట్ నుంచి వచ్చింది వేసుకోండి అని వేస్తారు 

  4. వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారు… మీరు ప్రజల మనసులు గెలిచారు… నైతిక విజయం మీదే… ఏమంటావ్ GA.

  5. నీ ఏడుపు చూడలేమయ్య, ఇదే జగన్  చేస్తే నీతి నిజాయితీ అదే అటు వైపు వాళ్ళు చేస్తే అరాచకం wow గ్రేట్ ఆంధ్ర అని పుచ్చుకున్నవ్ 

  6. పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు ముందుకు రాక, వచ్చినా ఓడిపోతామనే కారణంతో వెనకడుగు వేస్తున్నరు. గందుకే జగేన్ లంగాగాడు … కావాలనే ఇటువంటి అల్లర్లను సృష్టించి, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని సాకు చూపి, ఎన్నికలను బహిష్కరించి ప్యాలెస్ కి పారిపోవాలనే ఎత్తుగడతోనే ఈ అల్లర్లను చేయిస్తున్నాడు అంటా.. ప్యాలెస్ లో పలువురు అంటున్నారు

  7. అయ్యయ్యో అరుణాచలం.. నామినేషన్ వెయ్యటమే పెద్ద విజయం లాగా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చిందా మన రప్పా రప్పా పార్టీకి 🤦‍♂️

  8. దొంగోడిలా గోడ దూకి నామినేషన్ వేస్తే గెలిచినట్టా? ఇలా ఐతే మనోడు ఆంధ్రా cm ఎందుకు కర్మ .. ఏకంగా ఆమెరికా ప్రెసిడెంట్ కూడా అవ్వొచ్చు కదా?

Comments are closed.