Advertisement

Advertisement


Home > Politics - Andhra

చంద్రబాబు మాటతప్పితే.. జగన్ నెరవేర్చారు!

చంద్రబాబు మాటతప్పితే.. జగన్ నెరవేర్చారు!

దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఒక తీర్మానం చేసిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ పాత రికార్డులను తిరగతోడుతోంది. వారిపట్ల జగన్ చిత్తశుద్ధికి మన్నన దక్కితే గనుక ఎక్కడ ఆయనకు కీర్తి దక్కుతుందో అని తెదేపా భయపడుతోంది. తాము 2019లోనే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కోసం తీర్మానం చేశామని తెదేపా ప్రకటిస్తోంది. మంచిదే. వారి ప్రయత్నాన్ని కూడా అభినందించాలనే అనుకుందాం. 

మరిబోయలు,వాల్మీకుల సంగతి ఏమిటి? వారికి చంద్రబాబునాయుడు చేసిన నమ్మక ద్రోహం సంగతేమిటి? ఆ రెండుకులాలను ఎస్టీల్లో చేర్చడానికి ఆయన ఇప్పటిదాకా ఏమైనా ప్రయత్నం చేశారా? అనే అనుమానాలు, ప్రశ్నలు ప్రజలనుంచి ఎదురవుతున్నాయి. అదే చంద్రబాబునాయుడు.. ఎన్నిసార్లు ఈ రెండు సామాజికవర్గాలకు ఎస్టీల్లో చేరుస్తాననే ఆశ పెట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నారనేది అందరికీ తెలుసు. 

వాల్మీకులు, బోయలు తమ కులాలను ఎస్టీల్లోకి చేర్చాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఆ మేరకు వారికి గతంలో పలుమార్లు హామీ కూడా ఇచ్చారు. ఆ కులాల నుంచి సరైన వారిని ఎంచుకుని ఆయన నాయకుల్ని కూడా చేశాడు. కులాలనుంచి ఒకరిద్దరు లబ్ధి పొందారు తప్ప కులం బాగుపడలేదు. ఆ కులాల యొక్క సహేతుకమైన కోరిక వారిని ఎస్టీల్లో చేర్చడం అనేది నెరవేరనే లేదు. చంద్రబాబునాయుడు ప్రతిసారీ ఆ రెండుకులాలను చాలా చాకచక్యంగా వంచిస్తూనే వచ్చారు. 

ఇన్నాళ్లకు వారి ఆశ నెరవేరే మార్గం జగన్మోహన్ రెడ్డి రూపంలోనే కనిపించింది. ఆ రెండు కులాలను ఎస్టీల్లో చేర్చడానికి తొలి అడుగు పడింది. అయితే ఇది పూర్తిగా కేంద్రం పరిధిలోని వ్యవహారం. జగన్ కూడా తాను అరచేతిలో వైకుంఠం చూపించే తరహాలో మాట్లాడకుండా.. తన పరిధిలో లేదని, అయితే శాసనసభ తీర్మానాలను కేంద్రానికి పంపి గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు. చంద్రబాబునాయుడు వంచనలతో ఇన్నాళ్లుతా విసిగిపోయి ఉన్న వారికి ఈ మాత్రం నిర్ణయం, తొలిఅడుగు అనేది చాలా పెద్ద ఊరట. 

దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చే తీర్మానం విషయంలో మేం ఎప్పుడో చేశాం అని డప్పు కొట్టుకుంటున్న తెలుగుదేశం.. బోయలు, వాల్మీకుల విషయంలో తమ వాగ్దానాన్ని జగన్ నెరవేరుస్తున్నాడని ఎందుకు ఒప్పుకోవడం లేదు? నిజానికి వారికి నిజాయితీ ఉంటే రాష్ట్రంలోని ఆ రెండుకులాల తరఫున.. జగన్ కు కృతజ్ఞతలు చెప్పాలని పలువురు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?