Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖ నుంచి జగన్ పాలన చేస్తే అడ్డుకోం

విశాఖ నుంచి జగన్ పాలన చేస్తే అడ్డుకోం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారు అన్న ప్రచారం ఇటీవల చాలా ఎక్కువగా సాగుతోంది. మార్చి నుంచి జగన్ విశాఖను కేంద్ర బిందువుగా చేసుకుని పాలన చేస్తారు అని తాజాగా వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రకటించారు. మరో వైపు ఆరు నూరు అయినా విశాఖ పాలనా రాజధాని అవుతుంది అని వైసీపీ మంత్రులు ఇతర నేతలు పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీ నుంచి ఆసక్తికరమైన కామెంట్స్ వస్తున్నాయి. ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోందని అలా ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరు అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు కామెంట్స్ చేశారు.

విశాఖలోని రుషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభం కావొచ్చు అని కూడా హింట్ ఇచ్చారు. అయితే బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను అంగీకరించేది లేదు అని ఆయన అంటున్నారు. ఏపీలో వైసీపీ మూడు రాజధానులు అని చెబుతోందని, దాని ప్రకారం సీఎం విశాఖ నుంచి పాలన చేయాలని అనుకుంటున్నారు.

ఆయన పార్టీకి ప్రజలు 151 సీట్లతో పట్టం కట్టారు. దానికి అనుగుణంగా పరిపాలనా వికేంద్రీకరణ తమ విధానం అని వైసీపీ చెబుతూ వస్తోంది. విశాఖ వచ్చి ముఖ్యమంత్రి పాలిస్తే రాజ్యాంగం ప్రకారం అది తప్పు కాదు, అవరోధాలు లేవు అని న్యాయ నిపుణులే చెబుతున్నారు. మరి బీజేపీ అడ్డుకోవడానికి ఏముంటుంది అని అంటున్నారు.

మేము పాలనా రాజధానిగా విశాఖను ఒప్పుకోమని బీజేపీ నేతలు అంటే వారు తమకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలకే చెప్పుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ ఏం చేయబోతోందో తెలిసే విపక్షాలు ఇలా వీక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయా అని అంతా అనుకునే పరిస్థితి ఉంది.

విశాఖలో పాలనను అడ్డుకోవడానికి న్యాయ స్థానాలను ఆశ్రయించిన వారు కూడా ఉన్నారు కదా మరిపుడు మేమేమి చేయలేమని చేతులెత్తేయడం అంటే ఇక చేయడానికి  కూడా ఏమీ లేదనే కదా అర్ధం కమలనాధులూ అని అంటున్న వారూ ఉన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?