ష‌ర్మిల‌తో క‌ల‌వ‌డానికి వైఎస్ జ‌గ‌న్ స‌సేమిరా!

చెల్లి అని నెత్తిన పెట్టుకున్నా. చాలా సాయం చేశాను. కానీ నాకు రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా ఎప్ప‌టికీ పూడ్చ‌లేని న‌ష్టాన్ని మిగిల్చింది

సోద‌రి ష‌ర్మిల నీడ‌ను చూసేందుకు కూడా వైఎస్ జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలిసింది.

ఈ నెల 24న హైద‌రాబాద్‌లోని కొత్వాల్‌గూడ‌లో ష‌ర్మిల కుమార్తె అంజ‌లి-ర‌ఘు నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

ఈ శుభ కార్యానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు వెళ్లారు.

అయితే వైఎస్ జ‌గ‌న్ వెళ్ల‌క‌పోవ‌డం స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా అందుతున్న స‌మాచారం మేర‌కు.. ష‌ర్మిల‌తో క‌ల‌వ‌డానికి వైఎస్ జ‌గ‌న్ స‌సేమిరా అన్న‌ట్టు తెలిసింది.

క‌నీసం ష‌ర్మిల నీడ‌ను చూసేందుకు కూడా జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

నిజానికి కుమార్తె అంజ‌లి వివాహ నిశ్చ‌య కార్య‌క్ర‌మానికే జ‌గ‌న్‌ను ఆహ్వానించాల‌ని త‌ల్లి విజ‌య‌మ్మ ద్వారా రాయ‌బారం నెరిపిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

కానీ జ‌గ‌న్ ఆసక్తి క‌నబ‌ర‌చ‌క‌పోవ‌డంతో విజ‌యమ్మ కూడా నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఆ త‌ర్వాత 24న హైద‌రాబాద్‌లో నిశ్చితార్థానికి ఆహ్వానించేందుకు త‌ల్లితో క‌లిసి వెళ్లాల‌ని ష‌ర్మిల భావించారు. ఈ మేర‌కు అన్న‌కు మ‌ళ్లీ రాయ‌బారం పంపార‌ని స‌మాచారం.

అయితే ర‌క్త సంబంధం పేరుతో ష‌ర్మిల‌తో అనుబంధాన్ని కొన‌సాగించ‌డానికి జ‌గ‌న్ ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేద‌ని ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెప్పాయి.

“చెల్లి అని నెత్తిన పెట్టుకున్నా. చాలా సాయం చేశాను. కానీ నాకు రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా ఎప్ప‌టికీ పూడ్చ‌లేని న‌ష్టాన్ని మిగిల్చింది. ఇంత చేశాక‌…ఇక అనుబంధానికి అర్థం ఏముంది?” అని ష‌ర్మిల త‌ర‌పున మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెర‌ప‌డానికి వ‌చ్చిన వారికి వైఎస్ జ‌గ‌న్ దండం పెట్టి పంపిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

ఈ కార‌ణంగానే ష‌ర్మిల కుమార్తె అంజ‌లి నిశ్చితార్థ వేడుక‌లో వైఎస్ జ‌గ‌న్ క‌నిపించ‌లేదు. అయితే ఆహ్వానించ‌డానికి కూడా అన్న అనుమ‌తించ‌ర‌ని ష‌ర్మిల ఊహించ‌లేదు. త‌న‌ను అన్న తిర‌స్క‌రించ‌డంతో ష‌ర్మిల జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని స‌మాచారం.

అందుకే రెండు రోజుల క్రితం జ‌గ‌న్‌ను త‌క్కువ చేస్తూ, ష‌ర్మిల ట్వీట్ చేశార‌ని వారి కుటుంబ శ్రేయోభిలాషులు గుర్తు చేస్తున్నారు.

95 Replies to “ష‌ర్మిల‌తో క‌ల‌వ‌డానికి వైఎస్ జ‌గ‌న్ స‌సేమిరా!”

  1. అన్నా చెల్లెలి అనుబంధం, జన్మజన్మల సంబంధం అని పాట ఏమీ బ్యాగ్రౌండ్ లో రాలేదా?!

  2. జగన్ జై లు లో ఉన్నపుడు ఆమెనే పార్టీని ముందుకు తీసుకువెళ్లింది. కనీసం జగన్ కి ఆ కృతజ్ఞత కూడా లేదు. సొంత చెల్లెలి కూతురు పెళ్లికి వెళ్ళని వాడు ఇంకా రాష్ట్రం లో ఉన్న అక్క, చెల్లెమ్మలకి న్యాయం చేస్తాడ ? వాడిని నమ్మినందుకు సి గ్గు పడాలి

    1. ఏంట్రా, ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపించకపోతే అన్నా క్యాంటీన్ కూపన్లు రద్దు చేస్తార?

  3. ఇక్కడ శర్మిల క్యారెక్టర్‌ను బ్యాడ్‌ చేసిన ఎరుపు పువ్వులు ఆమెకు బీభత్సమైన  అభిమానాన్ని చూపిస్తారు.” 😊

  4. జైల్లో వున్నప్పుడు షర్మిల కూడా same అనుకుంటే వైస్సార్సీపీ ఇప్పటికి పేపర్ లో తప్ప ఎక్కడా ఉండేది కాదు 

  5. మా అన్నలాంటోళ్ళు ఉంటారని ఎన్టీఆర్ గారు అప్పట్లోనే లేడీస్ కి కూడా ఆస్తి లో వాటా ఇచ్చారు 

  6. మరి ఇంతోటి దానికి.. అదేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టినట్లు బ్రేకింగ్ న్యూస్ అని, అన్న చెల్లి కలుస్తున్నారని, విజయమ్మ మధ్యవర్తిత్వం అని ఒక నాలుగు అయిదు ఆర్టికల్ సొల్లు రాసావ్

  7. ఆ పిల్లల తప్పు లేదు కదా, వెళ్ళి బ్లెస్స్ చేసి పెద్దరికం నిలుపుకోవచ్చు కదా.

  8. రాజకీయాల్లో బందుప్రీతి ఉండకూడదు. మోడీ గారికి బ్రదర్ ఉన్న దూరంగా పెట్టారు 

    అది మోసం చేయడం కాదు. పవర్ సెంటర్ ఇంకొకటి అవ్వకూడదు 

    అదే మన మే’ గే ‘ఫ్యామిలీ అయితే మొత్తం అందరికి బొల్లోడితో చెప్పి పదవులు కోనేస్తారు 

  9. అసలు మనిషేనా.. 

    ఎంత గొడవలు ఉంటే మాత్రం సొంత చెల్లెలు కూతురు పెళ్ళికి ఇన్విటేషన్ ఇవ్వటానికి కూడా తీసుకోడు..

    1. బొల్లిగాడు ఎంతమంది చెల్లిళ్లను ఉద్ధరించాడో ? 

      చెల్లిళ్లను సొంత కూతురు అనుకుంటారు చాలా ఇళ్ళల్లో

      1. ఆగండ్రా బాబు! తండ్రి సంపాదించిన అ వి నీ తి సొమ్ములో వాటాలు తేలక మేము అల్లాడుతుంటే మథ్యలో మీ గోల ఏమిటి?!

      2. వాళ్ళు ఎవరు టీడీపీ కోసం పాదయాత్రలు చేయలేదు .. మా అన్న మాకు అన్యాయం చేసాడు అని రోడ్ ఎక్కలేదు ..

      3. పాదయాత్రలు చేసినప్పుడు మరి చెల్లి పనికి వచ్చిందా .. అంత చేసినా ఆమెకి పార్టీ లో కనీసం ఒక్క చిన్న పదవి దక్కిందా ..సమాదానం ఉందా ?

      1. ఇట్లాంటి మేనమామ ఎవ్వరికీ ఉండొద్దు..

        “మేనమామ హోదాలో మేనకోడలి పెళ్లి దగ్గరుండి” అన్నీ చూసుకోవాల్సిన, బాధ్యత తీసుకోవాల్సినవాడు లంగాగాడిలా బిహేవ్ చేస్తూ కనీస0 మేనకోడలి మొఖం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదా? అందుకే ఈడ్ని అందరూ లంగా11ఆనేది.

  10. ఇట్లాంటి మేనమామ ఎవ్వరికీ ఉండొద్దు..

    “మేనమామ హోదాలో మేనకోడలి పెళ్లి దగ్గరుండి” అన్నీ చూసుకోవాల్సిన, బాధ్యత తీసుకోవాల్సినవాడు లంగాగాడిలా బిహేవ్ చేస్తూ కనీస0 మేనకోడలి మొఖం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదా? అందుకే ఈడ్ని అందరూ లంగా11ఆనేది. 

  11. తండ్రి పేరుతో ఉన్న పార్టీ కోసం, నీ సొంత చెల్లెలు తన జీవితాన్నే త్యాగం చేసి ఊరూరూ తిరిగి అధికారం లోకి తెస్తే.. ఇదా రా నువ్విచ్చే రిటర్న్ గిఫ్ట్ లంగా11?

  12. నీచులు ఎప్పుడూ నీచంగానే ఆలోచిస్తారు, ఇంటికి వచ్చిన షెల్లీతో కలవడు కానీ ఊర్లో అక్క షెల్లమ్మలను ఉద్దరిస్తాడట ఈ ప్రబుద్ధుడు, వీడి పతనానికి తొలి మెట్టు ఇది!!

  13. జగన్ వెళ్ళాడు అనుకో షర్మిల పట్టించు కోలేదు అని ఎల్లో వాళ్ళు గోల చేసే వాళ్ళు ఇద్దరు కలిస్తే  ఏవో రాసే  వాళ్ళు  వెళ్ళాక పోవడం మంచిది చెల్లి ఐనా పట్టించుకోకూడదు చంద్రబాబు కి ముగ్గురు ఉన్నారు  ఇంత వరకు వాళ్ళు ఎవరో కూడా జనానికి తెలియదు ఆలా ఉండాలి 

  14. దాన్ని బట్టి వాడి మెంటాలిటీ ఎలాంటిదో తెలుస్తుంది. ఎంత శత్రుత్వం ఉన్నా అలాంటి సమయాల్లో వెళ్లి ఆశీర్వాదించి రావాలి, పెద్దరికం నిలబెట్టుకోవాలి, మేనకోడలికి మేనమామ కాకపోతే ఇంకేవరు చేస్తారు . పిలవకపోయిన వెళ్ళాలి, ఏం రాజకీయాలు ఏం ఆస్తుల గొడవలు రా మీ పాడుగాను , 

  15. తెలుగు ఇళ్ళల్లో మేనమామ పాత్ర చాలా ముఖ్యమైనది..హి ఇస్ అ 3rd పేరెంట్ టు ది కిడ్.

    ఏదన్నా వుంటే మీరు మీరు చూసుకోవాలి కానీ జీవితం లో మళ్లీ రాని ఈ సందర్భాన్ని కూడా మొండితనంతో వెళ్ళలేదని గొప్పగా రాసినోడికి అసలు సిగ్గుండాలి..

  16. Even as a common person , I don’t allow somebody who went beyond low in ethics…who ever it is..she did worst things…still jagan never talked about her one word…what a royal nature he has..very matured..no need to allow her to his boundary…let her live happily I  which ever way she wants..jagan is not stopping her. Why she disturbs him now

    1. Making sister walk for thousands of kilometers on foot to save his own party and then denying any credit for her is royalty?! Keeping quiet when his own party men are making lewd comments on his own sister is Royalty?! 

  17. లలిత గారు, మీక్కూడా ఒక మహామేత లాంటి తండ్రి ఉండి, దొంగ-సొమ్ము దోచుకున్న అన్న వుంటే తెలిసొస్తుంది ఎందుకు మౌనంగా వున్నాడో..

  18. లలిత గారు, మీక్కూడా ఒక@మహామేత లాంటి తండ్రి ఉండి, దొంగ-సొమ్ము దోచుకున్న అన్న వుంటే తెలిసొస్తుంది ఎందుకు మౌనంగా వున్నాడో..

  19. పెద్దాయనను చూసైనా నేర్చుకో జగన్! సిగ్గు, ఆత్మాభిమానం ఉంటే ఏమీ సాధించలేవు. బూతులు తిట్టి, మళ్ళీ శాలువా కప్పే లక్షణాలు చూసైనా నేర్చుకో!

Comments are closed.