బీఆర్ నాయుడిని త‌ప్పిస్తే.. ప‌వ‌న్ నుంచి ప్ర‌తిపాద‌న ఇదే!

ఒక‌వేళ బీఆర్ నాయుడిని త‌ప్పించేట్ల‌యితే, త‌న సోద‌రుడైన నాగబాబుకు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ ప్ర‌తిపాదించిన‌ట్టు తెలిసింది.

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడి వ్య‌వ‌హారం రోజురోజుకూ తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో టీటీడీ ప్ర‌తిష్ట‌ను కాపాడ్డంలో టీడీపీ పూర్తిగా విఫ‌ల‌మ‌వుతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. గ‌తంలో వైసీపీ పాల‌నే టీటీడీలో బాగుందన్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. టీటీడీ కేంద్రంగా వివాదం ఇట్లే పెరిగితే, భ‌విష్య‌త్‌లో కూట‌మి ప్ర‌భుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డుతుంది.

ఈ నేప‌థ్యంలో బీఆర్ నాయుడిని త‌ప్పిస్తేనే బాగుంటుంద‌న్న అభిప్రాయం కూట‌మిలో వుంది. మ‌రోవైపు రాజీనామా చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశిస్తే, నిమిషంలో ప‌ని అని బీఆర్ నాయుడు తేల్చి చెప్పారు. దీంతో సీఎం చంద్ర‌బాబే ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఇదే సంద‌ర్భంలో మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబుతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ భేటీలో బీఆర్ నాయుడి ఉదంతం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఒక‌వేళ బీఆర్ నాయుడిని త‌ప్పించేట్ల‌యితే, త‌న సోద‌రుడైన నాగబాబుకు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ ప్ర‌తిపాదించిన‌ట్టు తెలిసింది.

నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్టు ఏడాది క్రితం సీఎం చంద్ర‌బాబు అధికారికంగా ప్ర‌క‌టించ‌డాన్ని ప‌వ‌న్ గుర్తు చేసిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం నాగ‌బాబును కేబినెట్‌లోకి తీసుకునే ప‌రిస్థితి లేద‌ని, కావున టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం.

అయితే బీఆర్ నాయుడితో రాజీనామా చేయించే విష‌య‌మై ఇంకా స్ప‌ష్ట‌త‌కు రాలేద‌ని ప‌వ‌న్‌తో బాబు అన్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్ర‌బాబు సైతం టీటీడీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. టీటీడీ నుంచి సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని అనుకున్నాన‌ని, కానీ గ‌తంలో కంటే దారుణ‌మైన ప‌రిస్థితులున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండడం తీవ్ర ఆవేద‌న క‌లిగిస్తోంద‌ని ప‌వ‌న్‌తో బాబు వాపోయిన‌ట్టు స‌మాచారం.

టీడీపీకి మీడియా ప‌రంగా బీఆర్ నాయుడు చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా అత్యున్న‌త టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చిన‌ట్టు ప‌వ‌న్‌తో బాబు అన్న‌ట్టు తెలిసింది. కానీ ఆ గౌర‌వాన్ని ఆయ‌న నిల‌బెట్టుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని, అన‌వ‌స‌ర స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

ఒక‌వేళ ఇప్పుడు ఆయ‌న‌తో రాజీనామా చేయిస్తే, క‌ళంకితుడిగా అధికారిక ముద్ర వేసిన‌ట్టు అవుతుంద‌నే భ‌యాన్ని ప‌వ‌న్ వ‌ద్ద బ‌య‌ట పెట్టుకున్నార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌తిపాద‌న‌పై ఆలోచిస్తాన‌ని చంద్ర‌బాబు అన్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి.

41 Replies to “బీఆర్ నాయుడిని త‌ప్పిస్తే.. ప‌వ‌న్ నుంచి ప్ర‌తిపాద‌న ఇదే!”

  1. ఫేక్ video’s తో లడ్డూ కల్తీ ని సైడ్ ట్రాక్ చేద్దాం అనుకున్నాడు మా ఎర్రిసింహం.. కానీ వాళ్ళు మావోడిలా  ఎర్రిedavalu కాదుగా..!

    ఆమె కేసులు పెట్టింది.. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ప్యాలెస్ బాత్రూమ్ లో దాక్కున్నాడు.

  2. కోర్ట్ దొబ్బులు పెట్టినా మీకు ఇంకా సిగ్గు రాలేదా?

    లేక తోలు మందం వల్ల అలవాటు అయిపోయిందా?

  3. మీకు మీరె ఎవరొ పెరున లెట్టెర్స్ రాసుకొని, ఎందిరా ఈ డ్రామాలు? ఎమి చిల్లర పనులా ఇవి!

  4. విస్వశానీయ సమాచారం అంటే గాలి వార్తలు అని, సీబీఎన్ అండ్ పవన్ ఇద్దరు తప్ప 3rd పర్సన్ లేని చోట నీకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం? పవన్ చెప్పాడా? బాబు చెప్పాడా నీకు?

  5. విస్వశానీయ సమాచారం అంటే గాలి వార్తలు అని, సీబీఎన్ అండ్ పవన్ ఇద్దరు తప్ప 3rd పర్సన్ లేని చోట నీకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం? పవన్ చెప్పాడా? బాబు చెప్పాడా నీకు

    1. చెంబా వెన్నెల బ్లాక్ కు వెళ్ళింతరువాత జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి.

    1. No Need to Be a Slave to Any Politician

      Sir, even kids today understand how many politicians accumulate such huge wealth. Whether it is Jagan or CBN, people openly question how they earned so much money. The public is not naïve anymore.

      Voters are very clever. Often they are simply choosing the least worst option, not because they blindly trust any politician. Most people know that many politicians are involved in corruption and power games.

      That is why there is no need to become a blind follower or slave to any politician. Leaders should be questioned and held accountable. Democracy works only when citizens think independently, not when they blindly defend political leaders.

    2. అక్కా నీకు ఆ బేసిక్ సెన్స్ లేదు అని తెలుస్తుంది, నెయ్యి లేదు కెమికల్స్ తో లడ్డూ చేశారు అని cit చెబితే అది ఎవరి గవర్నమెంట్ లో జరిగింది? బేసిక్ సెన్స్ ఉందా?

      1. Neeku vundaa basic sense? Okka chukka paalu kooda leni Bhole Baba ki ghee supply contract ela iccharu Babu CM gaa vunnappudu? Appudu ive chemicals kalapakundaa ghee ela vacchindi?

  6. ycp కి br నాయుడు పోతే వచ్చేవాడు ఇంకా గట్టిగ రాడు దించుతాడు. జాగ్రత్త 

  7. సీబీన్ పవన్ ఇంట్లో ఎం మాట్లాడుకున్నారో నీకు తెలిసిందంటే నువ్వు తోపు 

    మరి ఇదేదో అప్పట్లో అన్నకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కెది కదా 

    1. చంద్ర బాబు పవన్ భేటీలో వారు మాట్లాడుకున్న మాటలు బాబు గారే వారి టీమ్ తో బయటికి పంపుతారు తెలుసుకో

  8. Every year two times I will visit Tirupati. During YS Jagan time is very worst situation. Next time don’t compare with him . If you do next time I will search and slap you . If you like praise him but TTD went very worst in his  tenure 2019 to 2024 . 

  9. Tappu chesadu ani telusu veellaki, kaani yeduru daadi chesi tappinchukovaali ani viphala prayatnam chesthunnaru. Ivvala tappinchukunte repu janam vadilipettaru. Anni saarlu 20 seconds lo 2 votes padavu kada.

  10. తిరుపతి నాశనము. డైలీ ప్రసాదాలు దగా ఫ్యామిలీ ఇంటికి. ఎందులో వారు అడుగుపెడితే ఆ రంగం నాశనం. మూవీస్, రాజకీయాలు నాశనం అయ్యాయి ఆల్రెడీ. ఇంకా తిరుపతి..

Comments are closed.