చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఇంతే సంగతులు…?

చంద్రబాబు రాజకీయ గండరగండడు. ఆయన ఎటు నుంచి ఎటైనా  తనకు వీలుగా రాజకీయాన్ని తీసుకుపోగలరు. మరి ఆయన రూట్ లో నడిచే వారికే చిక్కులు. చికాకులు వస్తాయి.  Advertisement అది పొత్తులతో అయినా ఎత్తులతో…

చంద్రబాబు రాజకీయ గండరగండడు. ఆయన ఎటు నుంచి ఎటైనా  తనకు వీలుగా రాజకీయాన్ని తీసుకుపోగలరు. మరి ఆయన రూట్ లో నడిచే వారికే చిక్కులు. చికాకులు వస్తాయి. 

అది పొత్తులతో అయినా ఎత్తులతో అయినా బాబుని ఫాలో అయితే ఇంతే సంగతులు అని ఏపీ రాజకీయాలు ఎపుడూ చెబుతూనే ఉంటాయని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

చంద్రబాబు స్క్రిప్ట్ చదివి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ  మాజీ ప్రెసిడెంట్ గా మారి వెనక బెంచీల్లోకి వెళ్ళిపోయారు. ఇపుడు కొత్త ప్రెసిడెంట్ సోము వీర్రాజు  కూడా బాబు స్క్రిప్ట్ నే చదువుతున్నారా అంటే ఆ డౌట్ వైసీపీ మంత్రికే వచ్చింది మరి.

చంద్రబాబు రూట్ లో వెళ్ళి బాగు పడిన వారు లేరంటే లేరని  మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. సోము వీర్రాజు కూడా అదే దారిలో వెళ్తాను అంటే ఇక  ఆయన ఇష్టమని ఒక హెచ్చరిక లాంటి మాటనే వాడారు. 

బాబు ఏపీలో మత చిచ్చు రగిలించాలని చూస్తున్నారని బీజేపీ కూడా దాన్ని అనుసరిస్తే ఏమీ చేయలేమని అవంతి అంటున్నారు. బీజేపీ రధ యాత్ర ఇపుడు ఏపీకి అవసరమా అని కూడా ఆయన ప్రశ్నించారు. 

కేంద్రం ఏపీకి గత ఇరవై నెలల్లో ఎంత మొత్తంలో నిధులు ఇచ్చిందో జనాలకు చెబుతూ రధ యాత్ర చేస్తే బాగుంటుందని ఆయన సెటైర్లు వేశారు. 

ఏపీలో ప్రశాంత వాతావరణం ఉండకూడదా, ప్రజలు సామరస్యంగా బతకకూడదా అంటూ అవంతి బీజేపీ రధ యాత్ర మీద మండిపడ్డారు. మరి  బస్తీ మే సవాల్ అంటున్న బీజేపీ రధ యాత్ర రాజకీయ ఉత్సాహాన్ని ఎవరు ఆపగలరు…

ఎన్టీ రామారావు,జ‌గ‌న్ ల‌కు కొన్నిపోలిక‌లు

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!