Advertisement

Advertisement


Home > Politics - National

ఎప్పుడూ లేనిది ఇన్ స్టాకి ఏమొచ్చింది..?

ఎప్పుడూ లేనిది ఇన్ స్టాకి ఏమొచ్చింది..?

గతంలో చాలా సార్లు ట్విట్టర్ మొరాయించిన ఉదాహరణలున్నాయి. కొన్నిసార్లు వాట్సప్ కూడా సడన్ గా ఆగిపోతుంది, ఫేస్ బుక్ లో సర్వర్ కూడా అప్పుడప్పుడూ డౌన్ అయిన అనుభవం అందరికీ ఉండే ఉంటుంది. కానీ ఇన్ స్టా గ్రామ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి కంప్లయింట్ లు లేవు. ఎందుకంటే ఇన్ స్టా యూజర్ల సంఖ్య కూడా పరిమితంగానే ఉంటుంది. 

ఇప్పుడిప్పుడి ఇన్ స్టా కి కూడా క్రేజ్ పెరుగుతోంది. సర్వర్లపై ఒత్తిడి పెరిగిందో, ఇంకేదయినా సాంకేతిక లోపమో తెలియదు కానీ ఈరోజు ఇన్ స్టా గ్రామ్ కూడా కొన్ని గంటల పాటు యూజర్లకు నరకం చూపించింది.

హోలీ రోజున ఫొటోలు అప్ లోడ్ చేస్తామంటే కుదరట్లేదని కొంతమంది ఇన్ స్టా యూజర్లు.. ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో కంప్లయింట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టా యూజర్లు ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇన్‌ స్టాగ్రామ్ డౌన్ కు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. వినియోగదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కోవడంతో పాటు కంటెంట్ పోస్ట్ చేయడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

డౌన్ డిటెక్టర్ ప్రకారం.. అమెరికాలో 46,000 మంది ఇన్‌ స్టా యూజర్లు ఇబ్బంది పడ్డారు. వీరిలో అతి కొద్ది మందికి మాత్రమే లాగిన్ ప్రాబ్లమ్ గా మారింది. ఎక్కువమందికి ఇన్ స్టా అకౌంట్లలో ఫోటొలు, వీడియోలు అప్ లోడ్ కాలేదు. యూకేలో 2,000 మంది, ఇండియా, ఆస్ట్రేలియా నుంచి 1000 మంది ఇన్ స్టా యూజర్లు తాము కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నామంటూ పోస్టింగ్ లు పెట్టారు. పోస్టులు పెట్టని వాళ్ళు లక్షల్లో ఉన్నారని ఓ అంచనా.

ఇలాంటి సందర్భాల్లో మీమ్స్ ఓ రేంజ్ లో వస్తుంటాయి. ట్విట్టర్ షట్ డౌన్ అయినప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టాలో.. మీమ్స్ వచ్చినట్టే.. ఇన్ స్టా షట్ డౌన్ కాగానే మీమర్లు ట్విట్టర్లో చెలరేగిపోయారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?