చీకట్లో సూర్యడు..ఇకపై రాత్రి అనేది ఉండదా?

రాత్రి కూడా భూమిపై సూర్యరశ్మి ప్రసరిస్తే ఎలా ఉంటుంది? త్వరలోనే ఈ అద్భుతం కూడా ఆవిష్కతం కాబోతోంది.

ఉదయమైతే సూర్యోదయం, సాయంత్రమైతే సూర్యాస్తమయం. రాత్రికి పూర్తిగా చీకటి. దీన్ని కూడా మార్చేస్తే ఎలా ఉంటుంది.

రాత్రి కూడా భూమిపై సూర్యరశ్మి ప్రసరిస్తే ఎలా ఉంటుంది? త్వరలోనే ఈ అద్భుతం కూడా ఆవిష్కతం కాబోతోంది.

అమెరికాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటాల్’ అనే స్పేస్ స్టార్టప్, రాత్రి సమయంలో కూడా భూమిపైకి సూర్యకాంతిని ప్రసరించే ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తోంది.

‘సన్ లైట్ ఆన్ డిమాండ్’ అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ ప్రాజెక్టు.. ఎవరికైతే రాత్రి పూట కూడా సూర్యకాంతి కావాలనుకుంటున్నారో వాళ్లకు వెలుగు అందిస్తుంది.

సాధారణంగా రాత్రి సూర్యుడు ఉండడు కాబట్టి, కక్ష్యలోని పెద్ద అద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రతిబింబించి, దాన్ని రిఫ్లక్షన్ ద్వారా భూమిపైకి పంపించాలని ఈ స్టార్టప్ ప్రణాళిక.

ఈ టెక్నాలజీలో ఉపగ్రహాలు సుమారు 600 నుంచి 650 కిలోమీటర్ల ఎత్తులోని లో భూకక్ష్యలో తిరుగుతాయి. ఈ శాటిలైట్ కు 18 మీటర్ల వెడల్పులో అల్యూమినియం కోటెడ్ ఫిల్మ్ అద్దం ఉంటుంది.

ఇది సూర్యకాంతిని, భూమిపైకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక ఉపగ్రహం సుమారు 5 కిలోమీటర్ల వ్యాసం ఉన్న ప్రాంతాన్ని వెలిగించగలదు.

అయితే ఇది సూర్యుని వెలుగులా మాత్రం ఉండదు. పౌర్ణమి నాటి చంద్రుడి కాంతి స్థాయిలో ఉంటుంది. రాబోయే రోజుల్లో తీవ్రతను మరింత పెంచి సాధారణ సూర్యకాంతి తరహాలోనే వెలుగును అందిస్తారు.

భూమిపై ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో వెలుగును ప్రసరించజేయొచ్చు. ఎంత కావాలంటే అంత వెలుగు సెట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు.

ఉపగ్రహం వేగంగా కదులుతుంది కాబట్టి ఒకే స్థలాన్ని కొన్ని నిమిషాలు మాత్రమే వెలిగించగలదు. నిరంతరం ఒకే ప్రాంతంపై బలమైన కాంతి కావాలంటే అనేక ఉపగ్రహాలు కలిసి పని చేయాల్సి ఉంటుంది.

2027 నాటికి డజన్ల కొద్దీ, 2028 నాటికి వెయ్యికి పైగా, 2030 నాటికి 5వేలకు పైగా, 2035 నాటికి 50 వేలు ఉపగ్రహాలు ప్రయోగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

తరువాతి దశలో 54 మీటర్ల పెద్ద అద్దాలు ఉపయోగించి మరింత బలమైన కాంతిని అందించాలని ప్లాన్. దీని కోసం ఇండియాకు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కై-రూట్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, సోలార్ ప్యానెళ్లకు రాత్రిపూట కూడా సూర్యకాంతి అందించొచ్చు. తద్వారా మరింత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాత్రిపూట పనులు చేసే ప్రాంతాలకు సూర్యరశ్మి అందుతుంది.

ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వీధి దీపాల అవసరం ఉండదు. వ్యవసాయం, డిఫెన్స్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇదంతా ఉచితం కాదు. చీకట్లో కూడా సూర్యుడు కావాలనుకుంటే గంటకు 5వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్‌ ను ఖగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖగోళ పరిశోధనలకు ఈ ప్రాజెక్టు అంతరాయం కలిగిస్తుందని అంటున్నారు. వన్యప్రాణులు, పక్షులు, కీటకాలకు ఇది ప్రమాదకరమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కంపెనీ మాత్రం కాంతి చాలా లోకలైజ్డ్‌గా ఉంటుందని, కేవలం అనుమతి ఉన్న ప్రాంతాలకే పరిమితం చేస్తామని, అవసరమైతే ఉపగ్రహాలను తిప్పి కాంతిని ఆఫ్ చేయవచ్చని చెబుతోంది.

3 Replies to “చీకట్లో సూర్యడు..ఇకపై రాత్రి అనేది ఉండదా?”

Comments are closed.