Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రభుత్వ సవరణలకు ఉద్యోగుల ఒప్పుకుంటారా..?

ప్రభుత్వ సవరణలకు ఉద్యోగుల ఒప్పుకుంటారా..?

ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. మంత్రుల కమిటీ ఇదివరకే వారికి ఆహ్వానాలు పంపినా కుదరదని మొండికేశారు ఉద్యోగులు. కానీ ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెబుతున్నారు. 

లిఖిత పూర్వకంగా ప్రభుత్వం నుంచి లేఖ వచ్చే సరికి ఇటు ఉద్యోగులు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. వారి కష్టాలు తీర్చే దిశగా అడుగు ముందుకేస్తామంటున్నారు. మరి దీనికి ఉద్యోగ సంఘాలు ఒప్పుకుంటాయా లేదా అనేది ఈరోజు తేలిపోతుంది.

ప్రభుత్వం ఆఫర్ ఇస్తుందా..?

ఉద్యోగ సంఘాల నేతల ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈమేరకు సీఎంతో సజ్జల, బొత్స, ఆర్థిక శాఖ అధికారుల భేటీలో ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. హెచ్.ఆర్.ఎ. శ్లాబ్ ని సవరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఐఆర్ రికవరీ కూడా ఆపేసే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

ప్రధానంగా పెన్షనర్ల సమస్యను తీర్చడానికి కూడా జగన్ సానుకూలంగా ఉన్నారట. పెన్షనర్లకు 70ఏళ్లకు అడిషనల్ క్వాంటమ్ బెనిఫిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత జీవో ప్రకారం దాన్ని 80 ఏళ్లకు పెంచారు. దీనిపై పెన్షనర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. అందరి సమస్యలు తీరినట్టే.

ఉద్యోగులు ఏమంటున్నారు..?

సరిగ్గా చలో విజయవాడ కార్యక్రమం ముందుగా చర్చలకు ఆహ్వానం రావడంతో ప్రభుత్వం మెత్తబడిందా లేక, చలో విజయవాడను అడ్డుకోడానికే ఈ ఆఫర్ ఇచ్చారా అనేదానిపై ఉద్యోగ సంఘాల నేతలు తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే చర్చలకు వెళ్లేముందు ఉద్యోగ సంఘాల నేతలు ఓసారి సమావేశం అవుతున్నారు. 

ప్రధానంగా కొత్త పీఆర్సీ రద్దు చేస్తేనే చర్చల్లో ముందడుగు పడుతుందనేది వారి వాదన. పాత పీఆర్సీ ప్రకారం జీతాలు సాధించుకుంటే.. అదే తమ విజయం అవుతుందని వారు ఆలోచిస్తున్నారు. మరి మధ్యాహ్నం జరిగే చర్చలు సమస్య పరిష్కారానికి బాటలు వేస్తాయా.. లేక మరింత జటిలం చేస్తాయా అనేది తేలాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?