ఫంక్షన్ కు రావాలా? ఎంతిస్తారు?

ఎవ్విరి థింగ్ ఈజ్ బిజినెస్ టు డే.. సెలబ్రిటీలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాలన్నా, ఇనాగరేషన్ కు రావాలన్నా.. ఏదన్నా సరే బిజినెస్ నే. ఇన్ స్టా లో మంచి కిక్కిచ్చే ఫొటోలు పెట్టడం,…

ఎవ్విరి థింగ్ ఈజ్ బిజినెస్ టు డే.. సెలబ్రిటీలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాలన్నా, ఇనాగరేషన్ కు రావాలన్నా.. ఏదన్నా సరే బిజినెస్ నే. ఇన్ స్టా లో మంచి కిక్కిచ్చే ఫొటోలు పెట్టడం, ఫాలోవర్లను పెంచుకోవడం, అది చూపించి పోస్ట్ లకు లక్షలు తీసుకోవడం. అది అలా వుంటే సభలకు హాజరు కావడం అనే మరో ముచ్చట వుంది. చిన్న చిన్న కల్చరల్ సంఘాలు లేదా ఇతరత్రా సంఘాలు సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటాయి. చిన్న చిన్న అవార్డుల ఫంక్షన్ లు చేస్తుంటాయి.

అయితే బలమైన మొహమాటం అయినా వుండాలి. అందరికీ అంత మొహమాటం వుండదు. అలాంటపుడు సెలబ్రిటీలను సభలకు ఎలా తీసుకురావాలి. పైసలు వుండాలి. ఇలా రెమ్యూనిరేషన్ తీసుకుని సభలకు వచ్చే సెలబ్రిటీలు కొందరు వున్నారు టాలీవుడ్ లో. గతంలో ఈ సంగతి కొన్ని సార్లు బయటకు వచ్చింది కూడా. చిన్న సినిమాలను ప్రమోట్ చేయమని కోరితే దానికి కూడా రెమ్యూనిరేషన్ అడుగుతున్నారని ఓపెన్ అయ్యారు.

ఎక్కువగా రిటైర్ అయిన వాళ్లు, పెద్దగా ఆదాయం లేని సెలబ్రిటీలు ఇలా సభలు సమావేశాలకు రెమ్యూనిరేషన్లు తీసుకుంటారు. కానీ లైమ్ లైట్ లో వున్న వారు, బాగా ఆస్తి పాస్తులు వున్నవారు కేవలం మొహమాటానికే వెళ్తుంటారు.

కానీ ఓ సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ యాక్టర్ ఒకరు నిర్మొహమాటంగా రెమ్యూనిరేషన్ తీసుకునే సభలు సమావేశాలకు వస్తున్నారనే గ్యాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంత ఆస్తి పాస్తులు వుండి అలా చేయడం ఏమిటి అనే డిస్కషన్ వినిపిస్తోంది.

ఒక మాస్ డైరక్టర్ కూడా ఇలాగే చేస్తున్నారట. చిన్న సినిమాల పాటల లాంచింగ్, ట్రయిలర్ లాంచింగ్ లాంటివి పెట్టుకుని, రమ్మని అడిగితే చిన్న చిన్న అమౌంట్ లు రెమ్యూనిరేషన్ గా అడుగుతున్నారట.

మొత్తం మీద ఎవ్విరి థింగ్ ఈజ్ బిజినెస్ గురూ..