కల్కి సినిమాలో ఓ సరదా సన్నివేశం.. రాజమౌళి- ప్రభాస్ ల నడుమ. ఈసారి కలిస్తే అయిదేళ్లు లాక్ చేస్తా అంటూ. ఆ సరదా సంగతి ఎలా వున్నా, ఆ ఇద్దరూ కలిసి మరోసారి కనుక సినిమా చేస్తే, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం మాట అలా వుంచి కనీసం ముక్కలు కూడా కనిపించవేమో?
ఎందుకంటే నాగ్ అశ్విన్ తో కలిసి కల్కి సినిమా చేసి, ఓవర్ సీస్ లో అరుదైన రికార్డుల దిశగా వెళ్తున్నాడు హీరో ప్రభాస్. దాదాపు ఇరవై మిలియన్లు వసూలు చేస్తుంది అని లెక్కలు కడుతున్నారు. అసలు ఆ లెక్కలు వింటుంటేనే ఆశ్చర్యంగా వుంది.
తెలుగు రాష్ట్రాల్లో సలార్ రేంజ్ ను దాటి వసూళ్లు వుంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ను ఇప్పటి వరకు పూర్తిగా వాడుకున్నది, పూర్తి స్థాయిలో చూపించినది రాజమౌళినే. అది ఛత్రపతి సినిమా కావచ్చు, లేదా బాహుబలి సిరీస్ కావచ్చు. కల్కి సినిమాలో ప్రభాస్ ఓ హీరోగా మాత్రమే కనిపించారు. నాగ్ అశ్విన్ ఇంకా పూర్తిగా ప్రభాస్ స్టామినాను వాడలేదు. బహుశా రెండో భాగంలో అన్ని రకాల ఎమోషన్స్ టచ్ చేసే అవకాశం వుంది.
అందువల్ల కల్కి 2 సినిమానే ఓ రేంజ్ లో వుండే అవకాశం వుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి సినిమా మీద వచ్చిన అన్ని రకాల ఫీడ్ బ్యాక్ లను తెలుసుకుంటున్నారు. థియేటర్లో ఎవరు ఎలా స్పందిస్తున్నారు, ఎక్కడ రియాక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడ రావడం లేదు అన్నీ తెలుసుకుంటున్నారు. అందువల్ల పార్ట్ 2 లో అవన్నీ కవర్ చేసుకుంటారు. అందువల్ల కల్కి 2 సినిమా ఈసారి పూల్ ప్రూఫ్ గా వుండే అవకాశం ఎక్కువ వుంది.
అలాంటిది నిజంగా రాజమౌళి కనుక మరోసారి ప్రభాస్ ను దొరకబుచ్చుకుని సినిమా చేస్తే.. ఊహించడం కష్టం.