ఆ హీరోకి అంత ప్యాడింగా?

చిన్న సినిమాతోనే మంచి హీరో అనిపించుకున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు మూడు సినిమాలు చేతిలో వున్నాయి. అది కూడా అన్నీ ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇందులో కుమారి 21ఎఫ్ ఒకటి. హీరోకేమో ఇది రెండోసినిమా. పైగా…

చిన్న సినిమాతోనే మంచి హీరో అనిపించుకున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు మూడు సినిమాలు చేతిలో వున్నాయి. అది కూడా అన్నీ ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇందులో కుమారి 21ఎఫ్ ఒకటి. హీరోకేమో ఇది రెండోసినిమా. పైగా ఏ బ్యాకింగ్ లేని హీరో. పోనీ నాన్న భారీ ప్రొడ్యూసర్ లేకుంటే టాప్ హీరో అనుకోవడానికీ లేదు. కానీ ఆ సినిమాకు కథ సుకుమార్, సంగీతం దేవీశ్రీప్రసాద్, కేమేరా రత్నవేలు. ఇదీ టెక్నికల్ ప్యాడింగ్. 

ఏంటీ కథా..అంటే సుకుమార్ కథే అని తెలిసింది. సుకుమార్ స్వయంగా కథ ఇవ్వడమే కాకుండా, ఈ టెక్నకల్ ఫ్యాడింగ్ కూడా తానే సెట్ చేసాడట. ఇదిలా వుంటే ఇదే రాజ్ తరుణ్ పై ఆదిలో ఆటిట్యూడ్ వార్తలు వినిపించాయి. కోటి రూపాయిలు అడుగుతున్నాడని. దానిపై చిత్రమైన సంగతి బయటకు వచ్చింది. ఉయ్యాల జంపాల హిట్ కాగానే ఓ పెద్ద నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ కబురు చేసాడట. 'నువ్వొద్దు నేనెళ్లి మాట్లాడతాలే' అని ఓ పెద్దాయిన వకాల్తా తీసుకువెళ్లాడట. 

అలా వెళ్లి, మా హీరో కోటికి తక్కువ రాడని చెప్పాడట. దాంతో ఆ నిర్మాత వెనక్కు తగ్గారు. అదే వార్తల్లోకి వచ్చి, రాజ్ తరుణ్ కోటి రూపాయిల హీరో అని టాక్ పుట్టేసింది. దీంతో రాజ్ తరుణ్ కు సినిమాలోకం వ్యవహారాలు ఎలా వుంటాయో అర్థమై, డ్యామేజ్ కంట్రోలుకి దిగి, ఓ మాంచి మేనేజర్ ను సెట్ చేసుకున్నాడట. దాంతో ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు పట్టాలకెక్కాయి.