నేను సినీ దర్శకత్వం మొదలుపెట్టినప్పట్నుంచి అన్ని జోనర్లకు చెందిన సినిమాలు తీసాను. ఉదాహరణకు శివ (విద్యార్ధి రాజకీయాలు), రంగీల (ప్రేమకథ), రాత్రి (హారర్), సత్య (మాఫియా), క్షణక్షణం (సరదా కథ), మనీ (కామెడి), సర్కార్ (డ్రామా), ఐస్‌క్రీమ్ (సైకలాజికల్ థ్రిల్లర్), 26/11 (టెర్రరిజం) లాంటివి వాటిలో కొన్ని మాత్రమే!
ఇప్పుడు గతంలో నేనెప్పడూ తీయని ఒక కొత్త జోనర్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుని ఒక శృంగార చిత్రం తీయబోతున్నాను. ఆ చిత్రం పేరు ‘కోరిక’.
నా ఉద్దేశ్యంలో ‘పవరు, సెక్సువల్ ప్లెజరు’ అనేవి మనుషుల్లో ఉండే అత్యంత బలమైన ప్రాధమిక ప్రేరేపణలు. విభిన్న సందర్భాల్లో వేరు వేరు మనస్తత్వాలు గల వాళ్లు.. వాళ్లల్లో కలిగిన శారీరక కోరికలకి సంబంధించిన స్పందనల మూలాన ఏం చేసారో.. వాటి వలన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వంటి విషయాలను స్టడీ చేసి.. తాజాగా నేను తీయబోతున్న ‘కోరిక’ కథను సిద్ధం చేసుకున్నాను!
ఈ ‘కోరిక’ సినిమాలో శృంగారానికి సంబంధించిన కోరికల మూలంగా మనుషులు పడే ఇబ్బంది, ఆనందం, మోసపోయామన్న భావన, పరిపక్వత, నిస్సహాయత, తపన, బాధ.. అన్నింటికీ మించి నిర్వచించడానికి వీలు లేని ఒక అత్యంత అపురూపమైన తాదాత్మికతను హైలైట్ చేయనున్నాను!
‘కోరిక’ అనే ఈ చిత్రం డైరెక్టర్‌గా నాకు ఒక ‘పున:సృష్టి’ అవుతుందని నా నమ్మకం!!
-రామ్‌గోపాల్‌వర్మ