అజ్ఞాతవాసితోనే అందరూ

అజ్ఞాతవాసి సినిమా ఎలా వుంటుంది అన్న సంగతి అలా వుంచితే, తొలివారం దాని ఊపుడు మాత్రం ఒక రేంజ్ లో వుంటుందన్నది వాస్తవం. అందుకే పబ్లిసిటీ అంటే ఇలాంటి టైమ్ లోనే, ఇలాంటి సినిమాతోనే…

అజ్ఞాతవాసి సినిమా ఎలా వుంటుంది అన్న సంగతి అలా వుంచితే, తొలివారం దాని ఊపుడు మాత్రం ఒక రేంజ్ లో వుంటుందన్నది వాస్తవం. అందుకే పబ్లిసిటీ అంటే ఇలాంటి టైమ్ లోనే, ఇలాంటి సినిమాతోనే చేసుకోవాలని టాలీవుడ్ జనాలు చాలా మంది ఫిక్సయిపోయారు. 

రాజ్ తరుణ్ రంగులరాట్నం ట్రయిలర్ ను అజ్ఞాతవాసికి జతచేస్తున్నారు. హలో సినిమాతో వన్ డే అది కూడా కొన్ని సెంటర్లలో మాత్రం వేసారు. ఇప్పుడు అలా కాకుండా అజ్ఞాతవాసితో ఆంధ్ర అంతటా రంగులరాట్నం ట్రయిలర్ ను విడుదలచేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ 15వ సినిమా టైటిల్ ను ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. ఈ టైటిల్ కోసం ఓ చిన్న విడియో తయారుచేసారు. దీన్ని ఓవర్ సీస్ అంతటా అజ్ఖాతవాసితో పాటు విడుదల చేస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమాను ఓవర్ సీస్ లో విడుదల చేస్తున్న ఎల్ఎ తెలుగు సంస్థనే కళ్యాణ్ రామ్ 15వ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ఇక నెలాఖరులో విడుదలయ్యే ఒకటి రెండు సినిమాలు కూడా తమ తమ టీజర్లను అజ్ఞాతవాసితో పాటు విడుదల చేసే పనిలో వున్నాయి.