జగన్ విలువలు, విశ్వసనీయత

ఒక్క కార్యకర్తకి కూడా మాట్లాడే అవకాశం లేదు. హరికథ విన్నట్టు విని వెళ్లిపోవడం తప్ప వాళ్లు చేయగలిగేది ఏమీ లేదు.

ఇంకెన్నాళ్లు అవే మాటలు? ఇంకెన్నాళ్లు చంద్రబాబు నైతిక విలువల గురించి ఎత్తిచూపడం?

“విలువలే నా రాజకీయం” అని తనకు తానే చెప్పుకోవడం ఇంకెన్నాళ్లు?

“విశ్వసనీయతో కూడిన రాజకీయమే నేను చేశా” అని చెప్పుకోవడం ఇంకెన్నాళ్లు?

కార్యకర్తల్ని మీటింగుకి పిలిచి వాళ్లందర్నీ ముందు కూర్చోపెట్టుకుని తాను మాత్రమే వేదికెక్కి మైకులో మాట్లాడిన అంశాల్లోని సారాంశం ఇదే.

ఒక్క కార్యకర్తకి కూడా మాట్లాడే అవకాశం లేదు. హరికథ విన్నట్టు విని వెళ్లిపోవడం తప్ప వాళ్లు చేయగలిగేది ఏమీ లేదు. ఒకవేళ చెప్పుకునే విషయం ఏదైనా ఉందన్నా సజ్జలకి చెప్పమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడేమో కూడా జగన్ మోహన్ రెడ్డి.

ఇదా ప్రతిపక్ష నాయకత్వం?

ఇంకా తనని ప్రజలు అన్యాయం చేసారనో, లేక చంద్రబాబు మ్యానిఫెస్టో చూసి మోసపోయారనో అనుకుంటూ మధనపడుతూ అవే మాటలు మాట్లాడడం జగన్ లోని కార్యశూన్యతకు, అవగాహనాలేమికి, బలహీనమైన నాయకత్వానికి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.

ఇలాంటి పార్టీ మీటింగుల్లో పదవి ఉన్నంతకాలం తానే మాట్లాడేవాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ శ్రోతలే. పదవి పోయాక కూడా అదే పంథాలో వెళ్తుంటే పార్టీలో ఉన్నవారికి పార్టీ పట్ల, నాయకుడి పట్ల ఏమి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది?

తనకి 40 శాతం మంది ప్రజలు ఓట్లేసారు కనుక తనకింకా బలముందని, చంద్రబాబు మాయమాటలకు ఏదో పది శాతం మంది అటుగా మొగ్గడం వల్ల మాత్రమే కూటమి గెలిచిందని నమ్మడం వరకూ బానే ఉంది.. కానీ తనవైపున ఉన్నారనుకున్న 40% మంది ప్రజలూ మరో ఐదేళ్ల తర్వాత కూడా ఉంటారనుకోవడం అమాయకత్వమే.

అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా నిర్వీర్యమైన స్పీచులు ఇస్తూ కార్యకర్తల్ని నిద్రపుచ్చడం కాదు చేయాల్సింది.

ఒక్కసారి గతం చూస్తే, 2019లో ఓటమి పాలైన చంద్రబాబు ఏమి చేసాడు? అమరావతి ఉద్యమం లేవనెత్తాడు?

అసలంటూ నాయకుడు సంకల్పిస్తే, కార్యకర్తలని ఉత్తేజపరిస్తే వాళ్లు దానిని ప్రజా ఉద్యమంగా మారుస్తారు. అలాంటి పని చేయడానికి జగన్ కి పూర్తి ఆస్కారముంది. మేనిఫెస్టోలో చెప్పినవి సత్వరం మాకు అందాలని ప్రజలచేత ఉద్యమం చేయించగలగాలి. జగన్ పొజిషన్లో చంద్రబాబు ఉండుంటే కచ్చితంగా ఆ పని చేసేవాడు.

అలాంటి ఉద్యమం వల్ల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు సాధ్యమవుతుంది.

కానీ అసలా బాధ ప్రజల్లో ఉందా అనేది తొలి విషయం? ఒకవేళ కొద్దిమందిలో ఉంటే దానిని పెద్దది చెయ్యాలి అంటే కార్యకర్తలు కలిసి రావాలి. వాళ్లు రావాలంటే నాయకులు సమాయత్తమవ్వాలి.

ఎక్కడ నాయకులు?

ఎవరికి వారు హైదరబాదో, బెంగళూరో, చెన్నైయో పయమనమైపోయారు. కొందరు విదేశాల్లో విహారయాత్రలు చేసుకుంటున్నారు. పార్టీ పేరుకి ఉంది తప్ప అందులో ఉన్నవారికి పార్టీపట్ల భావోద్వేగం లేదు. అది కలిగేలా జగన్ నాయకత్వం పని చేయట్లేదు.

ఇక్కడ మరొక విషయం. రాజకీయ నాయకుడనే వాడు విలువలు, విశ్వసనీయత వంటి వాటి గురించి మాట్లాడకూడదు. చంద్రబాబైనా, జగనైనా..ఆ మాటకొస్తే ఎవ్వరైనా సరే రాజకీయాల్లో వాటిని వదిలేసుకునే పని చేస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం. తనకు నచ్చినట్టు జరిగితే విలువలతో ఉన్నట్టు, లేకపోతే విలువలు లేనట్టు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడతాడు. ప్రజలకి, మీడియాకి అలాంటి మాటలు వినాలంటే చిరాకుగా ఉంటుంది.

జగన్ పాలనలో తన చుట్టూ ఉన్న కోటరీ ఏ విలువలతో పని చేసారో వాళ్ల అక్రమార్జన చెబుతుంది. ఎటువంటి విశ్వసనీయత కనబరిచారో మిగిలిన ఎమ్మెల్యేల ఛీత్కారాలు వింటే అర్ధమవుతుంది. ఇవన్నీ తన పక్కనే పెట్టుకుని “నేనే కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ..” లాంటి డైలాగులు కొట్టడం జగన్ కి సమంజసం కాదు.

ఇదిలా ఉంటే ప్రజలని అస్సలు టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకోనక్కర్లేదు. వాళ్లు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే చంద్రబాబుని ఓడించారు, హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్ని అమెరికాలా తలపించి రాష్ట్ర ప్రగతికి పని చేసిన కేసీయార్ నీ ఓడించారు, నిత్యం బటన్ నొక్కుతూ సంక్షేమం పేరుతో వేలకి వేలు డబ్బిచ్చిన జగన్ నీ ఓడించారు. వాళ్లనే నమ్ముకుంటాను అంటే ఏ నాయకుడూ నెగ్గడు. డెమాక్రసీలో ఉన్న మర్మమే ఇది. ఎప్పుడూ నాయకత్వం ఒకడి చేతుల్లోనే ఉండదు. ఎవరు బలంగా ఉంటే వారి చేతుల్లోకి వెళ్తుంది.

“మంచి వాళ్లకే కష్టాలు పెడతాడమ్మా మాయదారి దేవుడు” అని సాధారణంగా ప్రజలు కొన్ని సందర్భాల్లో నిట్టూర్చినట్టు, “మంచి చేసినా ఓడిస్తారమ్మా మాయదారి ప్రజలు” అనుకుంటూ ఉంటారు ఓడిన నాయకులందరూ! అది కామన్.

కానీ అదే దేవుడిని ప్రజలు ఎలా నమ్ముకుంటారో, అదే ప్రజల్ని నమ్ముకోకుండా ఉండలేరు రాజకీయ నాయకులు. రాజకీయంలో నిత్యం యాక్టివ్ గా ఉండాలి. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు తన బలాన్ని ఉనికి కోసమైనా చాటుకోవాలి. అది ఒక్కడి వల్ల కాదు. సమిష్టిగా పార్టీ పరంగా పని చేయాలి.

దానికి నాయకుడిలో స్ఫూర్తిని నింపే వాగ్ధోరణి ఉండాలి. రెచ్చగొట్టగలిగేలా మాట్లాడగలగాలి.

బాహుబలి సినిమాలో ప్రభాస్ డైలాగొకటి గుర్తుండే ఉంటుంది- “ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలం పెద్దది అనుకోవడం మరణం… నేను యుద్ధానికి వెళ్తున్నాను.. నాతో వచ్చేదెవరు..” అని రెచ్చకొడితే “నేను.. నేను..” అంటూ మిగిలిన సైన్యమంతా రెడీ అవుతారు. ఇంచుమించు అలా ఉండాలి జగన్ పొజిషన్లో ఉన్న నాయకుడి తీరు.

పదవిలో ఉన్నప్పుడు స్పీచుల్లో పస లేకపోయినా పర్వాలేదు. పదవి లేనప్పుడు మాటల్లో పసలేకపోతే అది “మరణమే”. మాట ద్వారా కాకపోయినా యంత్రాంగం, మంత్రాంగం ద్వారానైనా వ్యూహరచన జరుగుతుండాలి. అంతే తప్ప అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగ “చంద్రబాబుని నమ్మితే అంతే”, “విలువలు లేవు, విశ్వసనీయత లేదు” అంటూ మాట్లాడుతుంటే జగన్ కి మాత్రమే కాదు..పార్టీకి, అందులో ఉన్నవారికి కూడా మంచి రోజులు రావు.

54 Replies to “జగన్ విలువలు, విశ్వసనీయత”

  1. Ye daridrudu viluvalu levu antunte deyyalu vedalu vallinchinattu vundi . Paripalana teliyani egoist saddist sannasi . CM aiyyaka emi cheyyalo teliyaka Amarvathi ni and polavaram nasanam chesadu

  2. “బాహుబలి సినిమాలో ప్రభాస్ డైలాగొకటి గుర్తుండే ఉంటుంది- “ఏది మరణం?”

    jagan also donating 2 crores towards the rescue operation in Kerala?

    1. వీడు గవర్నమెంట్ సొమ్ము ఇవ్వాలి అంటే చేతికి ఎముకే లేకుండా ఇస్తాడు

      అదే సొంత జేబులో నుంచి రూపాయి ఇవ్వాలంటే విరిగిన వేల మీద ఉచ్చ కూడా పోయని రకం

    2. వీడు గవర్నమెంట్ సొమ్ము ఇవ్వాలి అంటే చేతికి ఎముకే లేకుండా ఇస్తాడు

      అదే సొంత జేబులో నుంచి రూపాయి ఇవ్వాలంటే విరిగిన వేల మీద ఉ చ్చ కూడా పోయని రకం

  3. ఎలుకతోలు దెచ్చి యేడాది యుతికిన

    నలుపు నలుపే కానీ తెలుపు గాదు

    కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన బలుకున

    విశ్వధాభిరామ వినుర వేమా

  4. రోజూ ఇలా ఏడ్చే బదులు…..విలువలు , విశ్వసనీయత, వివేకం సర్ అని ఒక సినిమా తీసి మన అన్నియకి చూపించొచ్చుగా GA….

  5. జగన్ శాపగ్రస్తుడు. ప్రజలు మెత్త పడ్డా దైవం, ప్రకృతి అడ్డుకుంటాయి. మామూలు పాపాలు చెయ్య లేదు.

  6. jagan yem maatlaadinaa karyakarthalu nammaru…5 samvathsaraalu sajjala gaadi maatalu vini valanteerlani nammukuni karyakarthalani mosam chesaadu…dhaaniki prathigaa poling mundhu roju karyakarthalu ycp nayakulani namminchi dabbulu panchinatlu natinchi jebulo vesukuni jenda peekesaaru. asalu kadha idhi…jagan ki bhavishyatthu ledhu….future sharimaladhi.

  7. వాడు ఓడినప్పటినుంది GA సజ్జల మీద పడి ఏడవటమే ప్రతి ఆర్టికల్ లోనూ.

    వాడి పిచ్చి పూర్తిగా తెలిసినవాళ్ళు 1. కసాయి 2. బిజ్జల 3. డబ్బా రెడ్డి. హారతి తరువాత ఆ మెంటలోన్ని కంట్రోల్ చేయటం వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు

  8. నువ్వు నీ నీతి సూత్రాలు కోతి కాపురం లా ఉంది. 
    అసలు మనకి ఇంకా సీన్ లేదు అని చెబుతున్న వినవే.
    2019 లో ఈడి చెప్పిన స్టానిక సవస్తలలో ఎందుకు అన్ని సీట్లు
    వచ్చి ఎన్ని సీట్లు వచ్చాయి అని కొట్టిన సుత్తి కొట్టకుండా కొట్టారు
    నువ్వు M B S ప్రసాద్ ..అయనటే డబ్బు తీసుకున్నాడు కాబట్టీ కొట్టాడు నువ్వు ఎందుకు GA
  9. ఒకప్పుడు ఆ పనికిమాలినోడు ఏమి మాట్లాడినా.. భజన చేసేవాడివి.. ఎందుకంటే అధికారం లో ఉన్నాడు కాబట్టి..

    ఇప్పుడు అధికారం పోయింది.. వాడు ఏమి మాట్లాడినా, మాట్లాడకపోయినా.. తప్పులు ఎంచుతున్నావు..

    నీలాంటోళ్ళవల్లే.. వాడు 151 నుండి 11 కి పడిపోయాడు..

    చంద్రబాబు గెలిచిన రెండు నెలలకే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేసిందని.. మళ్ళీ ఎన్నికల్లో 175 కి 175 గెలిచిపోతామని ఫీల్ అయితే గాని నిద్ర పట్టని నాయకుడు .. జగన్ రెడ్డి..

    ప్రజల్లో ఉండటం అంటే.. శవం కోసం వెతుక్కొనే లాజిక్కుల్లేని రాజకీయాలు చేసే నాయకుడు .. జగన్ రెడ్డి

    తాను నమ్మిందే ప్రజలందరూ నమ్మాలి.. వాళ్లకి తానొక్కడే దిక్కు అని ఫీల్ అయిపోయే నాయకుడు .. జగన్ రెడ్డి..

    100 రూపాయల సంక్షేమం చేసి.. 1000 రూపాయల సాక్షి యాడ్లు ఇచ్చుకునే విలువలు పాటించే నాయకుడు .. జగన్ రెడ్డి

    అబద్ధాలు చెప్పడమే విశ్వసనీయత అని నమ్మే నాయకుడు .. జగన్ రెడ్డి..

    1. ఆ పిచ్చోడితో వీడికి ఎక్కడో తేడా కొట్టింది, బహుశా సజ్జాల గాడు ఏదో చేశాడు. అటు పిచ్చోడ్ని ఇటు బిజ్జల గాన్ని వాయించేస్తున్నాడు

  10. నీ అనుభవం అంత వయసు లేదు జగన్ గారికి…. చెప్పిన నవరత్నాలు ఇచ్చిన హామీలు 98%చేసాడు… జగన్ గారిని చూసి… మీరు నోటికి వచ్చిన హామీలు అన్నీ చెప్పి అధికారం లోకి వచ్చాక…. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు….. మరి 5ఏళ్ళ జగన్ పరిపాలన లో ఏ ఒక్క రోజు డబ్బులు లేవు హామీలు అమలు చేయలేము అని చెప్పలేదు కొద్దిగా లెట్ అయినా హామీలు చెప్పింది చెప్పినట్టు చేసావ్… మరి నీ అనుభవం గొప్పదా… జగన్ తెలివితేటలూ గొప్పగా ఉన్నాయా అనేది కొద్దీ కాలం ఘడిస్తే తిరుగు బాటు ఎలా ఉన్నటుందో కూడా చూస్తారు వెయిట్ and సి

    1. ప్రభుత్వం అంటే సంక్షేమం అనుకొనే నీలాంటి గొర్రెలు ఉన్నంతకాలం.. మా గెలుపుకు ఢోకా లేదు..

      ఎన్నికలు అంటే మేనిఫెస్టో హామీలు అనుకొనే.. నీలాంటి వెర్రివెంగళప్పలు ఉన్నంతకాలం.. మా విజయం రెట్టింపు అవుతూనే ఉంటుంది..

      నువ్వు బకరా వి అని తెలుస్తోంది.. జగన్ రెడ్డి కూడా బకరా నే అని ప్రజలు జగన్ రెడ్డి కి తెలియ చెప్పడమే హైలైట్..

    2. 1)CPS రద్దు కలే

      2)జాబ్ క్యాలెండర్ రాలే

      3) అమరావతి కట్టలే

      4)పోలవరం పూర్తి చేయలే

      ఇంకా ఛానా వున్నాయి కానీ మీ జైలన్న చేసిన 196 హామీలు ఏంటో చెప్పు బ్రో

  11. అరేయ్ బాబూ CBN నువ్వు పెద్ద మోసగాడివని ప్రజలకు తెలుసు కానీ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని నిన్ను గెలిపించారు కానీ నువ్వు అందరి నోట్లో నీది బాగా పెట్టావు ఇప్పుడు అందరికీ హాయిగా ఉంది మంచి చేసేవాడు ఎవ్వరికీ పనికిరాడు నీలా దొంగ హామీలు ఇచ్చి నోట్లో గుండు పెట్టేవాడు కావాలి నువ్వు చాలా గ్రేట్ CBN

  12. మాట్లాడితే 40yrs అంటావ్ ఇదేనా నీ అనుభవం.. జగన్ నీ చూసీ నేర్చుకో పరిపాలన ఎలా చెయ్యాలి అని. కరోనా వచ్చి రాష్ట్రనికి సంపద లేకపోయినా ఒక్క వెల్ఫేర్ స్కీమ్ ఆగలేదు..

    1. ఆ పరిపాలన చూసే కదా.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసారు జనాలు..

      ఎవరైనా విజయాన్ని చూసి.. ఆదర్శం గా తీసుకొంటారు..

      జగన్ రెడ్డి చెత్తగా ఓడిపోతే.. వాడిని చూసి నేర్చుకోమంటున్నావ్.. ఏమి నేర్చుకోవాలి.. 151 నుండి 11 కి ఎలా ఓడిపోవడమా అనా ..?

      ఎలా దరిద్రం గా పరిపాలన చేయకూడదో అని.. కొంపదీసి జగన్ రెడ్డి పుస్తకం రాస్తాడేమో..

  13. ఈ ముక్క నువ్వు 2023లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నీకు బలం లేకపోయినా ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టినప్పుడు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి ఎదవ సొల్లు చెప్పడం కాదు నువ్వు చెప్పేదానికి చేసేదానికి అస్సలు సంబంధమే ఉండదు

  14. గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి గారు,

    మీకు మీడియా కాంట్రాక్టు ఇవ్వలేదు అనీ,

    మీ బదులు గజ్జల్కి ఇచ్చాడు అని,

    మరీ ఈ రంకగా బట్ట*లు ఊ*డదీసి నట్లు మరీ బం*డ కేసి చిత*క బడు*తున్నావ్. అతనికి మె*దడు లో గు*జ్జు లేదు, విష*యం లేదు అని నేరుగా చెబుతున్నవ్.

    పా*పం కదా.

    ఇన్నాళ్లు అతను వేసిన వేసిన బి*చ్చం ఏరుకునే కదా ఏది*గావ్.

    మరీ నీ వెబ్సైట్ లోనే ఇంత రంగింగ్ చెయ్యాలా, పిల్లా*డిని.

    అసలే వినాశం వేలు నో*ట్లో పెట్టు*కుని చీకు*తున్నాడు .

  15. క్యాడర్ కి ఉత్సాహం కాదు కానీ BP తెచ్చి ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు విద్వాంస0 చేయించే BOSA DK వాక్చాతుర్యం మాత్రం టన్నుల కొద్దీ ఉంది.

  16. “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం” Chandrababu ని కాళ్ల వెళ్లా పడి హోదా అడుక్కు0టున్న “Leven ల0గా” గాడు .. ఫర్నీచర్ దొ0గ

  17. PM Level లో 980 మందితో Z plus సెక్యూరిటీ కావాలట ఈడికి.. ఒరేయ్ నువ్వు after all ఒక MLA మాత్రమే.. ఇలాగే తిక్క చేష్టలు డెంగీతే next elections లో అది కూడా ఊడిపోతుంది..

    Furniture దొ0గ Leven చె’డ్డి

  18. విలువలు, విశ్వసనీయత గురించి ఈడు చెప్పడం అంటే sunny Leone virginity గురించి కబుర్లు చెప్పినట్టు ఉంటుంది.

  19. Jagan – “విశ్వసనీయతో కూడిన రాజకీయమే నేను చేశా”, “విలువలే నా రాజకీయం”

    &

    Bharathi – Sakshi only publishes truth and never lies…

    no more words…are they crazy or we are wrong..

  20. చూశాం లేరా మా అన్నయ్య విలువల (శ వా ల) విస్వసనీయత తో కూడిన రాజకీయం!!

    1. వివేకానందరెడ్డి

    2. Dr. సుధాకర్

    3. సుబ్రమణ్యం

    4. దొం గ కేసు లు

    5. కోర్టు కు పోకుండా తప్పించుకున్న విధానం

    6. రంగనాయకమ్మ గారి మీద కేసు

    7. దొం గ హామీలు

    8. వంద మంది దాకా సలహాదారులు

    9. ఇష్టం వచ్చినట్టు అప్పులు

    అబ్బో ఎన్నో అణిముత్యాలు..

  21. చూశాం లేరా మా అన్నయ్య విలువల (శ వా ల) విస్వసనీయత తో కూడిన రాజకీయం!

    1. వివేకానందరె డ్డి

    2. Dr. సుధాకర్

    3. సుబ్రమణ్యం

    4. దొం గ కే సు లు

    5. కో ర్టు కు పోకుండా తప్పించుకున్న విధానం

    6. రంగనాయకమ్మ గారి మీద కే సు

    7. దొం గ హామీలు

    8. వంద మంది దాకా సలహాదారులు

    9. ఇష్టం వచ్చినట్టు అ ప్పు లు..

    అబ్బో ఎన్నో అణిముత్యాలు..

  22. Oooh, alaa Rechhagottalaa ??

    Nuvvem nerpinchee pani Lee. Below are some of the rechagottudu items done earlier to fool ppl and got to power:

    Pink diamond, oka caste in target cheyyadam, 3 capitals ani pranteeya vibeedalu srustinchadam, redo annayyam aipotoondi babooy ani aranyarodanalu, Polavaram ni ATM anagram laantivi…..

Comments are closed.