ఇంత‌కూ ఏమైనా చేస్తారా? చేయ‌రా బాబూ?

“మీకింత వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్ రూపాయి మాత్ర‌మే ఇచ్చారు. నేను అధికారంలోకి వ‌స్తే రెండు, మూడు, నాలుగు రూపాయిలు ఇస్తాను. న‌న్ను న‌మ్మండి. అధికారం ఇవ్వండి. సంప‌ద సృష్టించి, మిమ్మ‌ల్ని ధ‌నవంతుల్ని చేస్తా” ….…

“మీకింత వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్ రూపాయి మాత్ర‌మే ఇచ్చారు. నేను అధికారంలోకి వ‌స్తే రెండు, మూడు, నాలుగు రూపాయిలు ఇస్తాను. న‌న్ను న‌మ్మండి. అధికారం ఇవ్వండి. సంప‌ద సృష్టించి, మిమ్మ‌ల్ని ధ‌నవంతుల్ని చేస్తా” …. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు చెప్పిన తియ్య‌టి మాట‌లు ఇవి.

బాబు అధికారంలోకి వ‌చ్చారు. సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టి రెండు నెల‌లు కావ‌స్తోంది. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లతో నిర్వ‌హిస్తున్న స‌మావేశాల‌కు చంద్ర‌బాబు వెళుతున్నారు. చంద్ర‌బాబు న‌వ్వుతూనే… “మీకెన్నో హామీలిచ్చాను. త‌ల్లికి వంద‌నం కింద ప్ర‌తి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాన‌ని చెప్పాను. ఇప్పుడు ఖ‌జానా చూస్తే ఖాళీగా క‌న‌ప‌డుతోంది. జ‌గ‌న్ మొత్తం ఊడ్చేశారు. అయిన‌ప్ప‌టికీ ఏదో ఒక‌టి చేస్తాను. చేనేత‌ల‌కు ఎన్నో ఇవ్వాల‌ని అనుకున్నా. అడిగిన దాని కంటే ఎక్కువ ఇవ్వ‌డం నా స్వ‌భావం. కానీ ఇవ్వ‌లేక‌పోతున్నా. రాష్ట్ర ఖ‌జానాని గ‌త ప్ర‌భుత్వం దివాలా తీసింది” …ఇదీ చంద్ర‌బాబు ప్ర‌సంగం తీరు.

బాబు ప్ర‌సంగాల తీరు చూస్తుంటే, ఇంత‌కూ ఈయ‌న ఏమైనా చేస్తారా? లేదా? అనుమానం ప్ర‌తి ఒక్కరిలో క‌లుగుతోంది. నిజంగా జ‌నానికి ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న మ‌న‌సులో వుంటే, ప్ర‌తి సంద‌ర్భంలోనూ రాష్ట్ర ఖ‌జానా ఖాళీగా వుంద‌ని ఎందుకు చెబుతార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఒక‌వైపు ఎంతో చేయాల‌ని వుంద‌ని సానుభూతి మాట‌లు చెబుతూనే, మ‌రోవైపు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర గ‌డ్డు లేద‌ని అంటున్నారు.

ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌క‌పోవ‌డానికి జ‌గ‌నే కార‌ణ‌మ‌నే సంకేతాల్ని పంప‌డానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అర్థం చేసుకోవాలి. మంచి చేస్తే, అది త‌మ త‌న గొప్ప‌గా, చెడు జ‌రిగితే జ‌గ‌న్ విధ్వంస పాల‌నే కార‌ణ‌మ‌న్న‌ట్టు చంద్ర‌బాబు చిత్రీక‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. చంద్ర‌బాబు మార్క్ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం. దీన్ని జ‌నం ఎలా తీసుకుంటార‌నే దానిపై భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఆధార ప‌డి వుంటాయి.

30 Replies to “ఇంత‌కూ ఏమైనా చేస్తారా? చేయ‌రా బాబూ?”

  1. జగన్ రెడ్డి లాగ ఉచితాలు అని చెప్పి అప్పు చేసి పన్నులు ప్రజల మీద వేయటం ,ఆ తర్వాత ఆ అప్పులని దారి మళ్లించి మోడీ తో జగన్ రెడ్డి కలిసి దోపిడీ చేయటం అందరు చూసారు అందుకే కర్రు కాల్చి వాత పెట్టారు

  2. అభివృద్ధి అంటే సంతకు వెళ్లి, 2 కేజీ ఉల్లిపాయలు కొనటం కాదు. ఆ పథకాలే జగన్ కొంప ముంచాయి. సిబిఎన్ కు ఎప్పుడు ఏం చెయ్యాలో తెలుసు.

  3. ఇవ్వటం అంటె.. ప్రబుత్వ భవనాలు తాకట్టు పెట్టి పంచటం కాదు రా అయ్యా!

    పెట్తుబడులు పరిశ్రమలు తెచ్చి ఉద్యొగాలు కల్పించతం కూడా ఇవ్వటమె. ఫొలవరం, అమరావతి పూర్తి చెయటం కూడా భవిషత్తు చక్కదిద్దటమె!

    1. అవును 2014-2019 లో పోలవరం కట్టడం అయ్యింది , అమరావతి సింగపూర్ కంటే అద్భుతంగా తయారయ్యింది , ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఉహించనంత అద్భుతంగా తీర్చిదిద్దారు …

      1. అందుకేగా మన రెడ్డి కి 11 ఇచ్చి.. బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..

  4. చేస్తారు!! CBN గారు 100% రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదో అదే చేస్తారు, మీరేమి అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదు !!

  5. India లో చిల్లర జనాలు ఎక్కువ. అలాగే ఆంధ్ర లో కూడా చిల్లర నాయాళ్ళు ఎక్కువ. అగ్రవరణాల వారి లో సినిమా పిచ్చ కుల పుచ్చ కలిపిన ప్రజానీకం ఎక్కువ. మిగిలిన చిల్లర జనాలు కు అగ్రకులాల వారు ఎదగకూడదు. ఆలా అనిపిస్తే కళ్ళు మూసుకుని వేరే పార్టీ కి గుద్దేస్తారు. బీసీ లు ఎస్సి లు ఎస్టీ లు ముస్లిం లను పక్కకు తోసేసేన తెలుగు రాష్ట్రము కావాలి. అప్పుడే బాగా అభివృద్ధి అవుతింది. అంతవరకూ ఏ పార్టీ వచ్చిన వేళ్ళ యోగక్షేమాలు కు ప్రాధాన్యం ఇస్తుంది తప్ప రాష్ట్రన్ని బాగుపడనివ్వరు

  6. cbn emi cheyyakapoyinaa, okka welfare scheme kooda implement cheyyakapoyinaa sare jeggu kanna governance lo chaala better….. kootamiki padina votes anni idhe opinion tho paddayi….

  7. అయన వచ్చిన వెంటనే పోలవరం పని మొదలయ్యేలాగా చూస్తున్నారు రాజధాని పని చూస్తున్నారు విశాఖ పారిశ్రామికరణకు ప్రయత్నిస్తున్నారు అయన ఢిల్లీ కి నిధులకు వెళుతున్నారు తప్పితే కేసు లకు బైళ్లకు వెళ్ళటం లేదు ఇస్తానన్న పింఛను లు విద్య వైద్య నికి సంబంధించి న సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ స్వల్ప కాలం లో ఇంకా ఏమిచేస్తారు

  8. రోడ్లు, కంపెనీ,జాబ్స్, లా అండ్ ఆర్డర్, ఇవి సరిగ్గా చేస్తే ఈ గవర్నమెంట్ కి next టైమ్ ఢోకా లేదు. ఊరికే పంచి పెడితే టిడిపి వాళ్ళు కూడా సపోర్టు చేయరు.

  9. మాకు “పథకాలు” వద్దు ..ఏమీ వద్దు.. జగన్ “బె యిల్ రద్దు” అయి అతనికి శి క్ష పడితే చాలు.. అని మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు..

Comments are closed.