మరో రెండు రోజుల్లో ఉప్పెన సినిమా తెరమీదకు రాబోతోంది. పోస్ట్ కరోనా టైమ్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నింటిలోకీ ఇంత బజ్ వున్న సినిమా ఇదే. పైగా ఫుల్ ఆక్యుపెన్సీలో వస్తోంది.
సంక్రాంతికి విడుదలైన క్రాక్ మంచి టాక్ తెచ్చుకుంది. ముఫై రెండు కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని టాక్ వుంది. మరి ఆ లెక్కన ఉప్పెన క్రేజ్ ఎంత వరకు వుంటుంది అన్నది బిజినెస్ సర్కిళ్లలో డిస్కషన్ పాయింట్ గా వుంది.
నిర్మాతలు మైత్రీ మూవీస్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. అందుకే కేవలం పంపిణీకే ఇచ్చారు తప్ప సినిమాను విక్రయించలేదు. తొలి రోజు వసూళ్లు నాలుగు నుంచి అయిదు కోట్ల వరకు వుంటాయని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా గట్టిగా వుంటాయని అంచనా వేస్తున్నారు.
అయితే అందరికీ ఇంకా మిగిలిన అనుమానం ఒకటే. ఫ్యామిలీలు ఇప్పటికైనా థియేటర్ కు వస్తాయా? రావా? అన్నదే ఆ అనుమానం. క్రాక్ దగ్గర నుంచి జాంబిరెడ్డి వరకు రెగ్యులర్ మాస్ జనాలు థియేటర్ కు వస్తున్నారు. కానీ ఫ్యామిలీలు ఇప్పటి వరకు అంతగా రాలేదు.
ఉప్పెన సినిమాతో అది స్టార్ట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. ఫ్యామిలీలు కదిలి థియేటర్ కు వస్తే ఇక టాలీవుడ్ మళ్లీ పూర్తిగా మామూలు అయిపోయినట్లే. లేదూ అంటే కష్టం అవుతుంది.
ఉప్పెన సినిమా ఈ రకమైన లెక్కలకు ఓ కొలమానంగా నిలుస్తుంది. అందులో సందేహం లేదు. అలాగే ఫ్యామిలీలు కదిలి వచ్చి, సినిమాకు మంచి టాక్ వస్తే, కలెక్షన్లు ఓ రేంజ్ లో వుంటాయి. ఏం జరుగుతుందో మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.