పవన్.. బాబు.. ఇద్దరూ రెండు విధాలుగా!

జ‌గన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య, పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా?

ఎవరితోనైనా పెట్టుకో.. మంచి వాడితో కాదు.. అన్నది ఓ సినిమా డైలాగు. ప్రకాష్ రాజ్‌తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సంవాదం పెద్ద ఇస్యూ కాదు. ప్రకాష్ రాజ్‌ వైఖరి తెలిసిన వారికి అది రొటీన్ నే. కానీ పవన్ పోయి పోయి, అస్సలు ఏ తప్పు చేయని, తప్పుగా మాట్లాడని తమిళ హీరో కార్తీని టార్గెట్ చేసారు. అది నూటికి నూరు శాతం బౌన్స్ బ్యాక్ అయింది. ముందుగా కొన్ని తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ పవన్ మాట్లాడింది తప్పు అని చెప్పేసాయి. కార్తీ విషయంలో పవన్ ను తాము సమర్థించమని క్లారిటీ ఇచ్చాయి. ఇది అలా అలా పెరుగుతూ పోయింది. అదే టైమ్ లో కార్తీ చాలా గౌరవంగా, సంస్కారవంతంగా, సున్నితంగా క్షమాపణ చెప్పారు.

డ్యామేజ్ జ‌రుగుతోందని పవన్ కు అర్థం అయింది. మూడు లైన్లలో కార్తీ సమాధానం ఇస్తే, పవన్ దాదాపు ముఫై లైన్లు వాడి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే అర్థమైంది. పవన్ కు తన తప్పు తెలిసిందని. సరిదిద్దుకునే ప్రయత్నం చేసారని. కానీ జ‌రగాల్సిన డ్యామేజ్ అప్పటికే జ‌రిగిపోయింది. తమిళనాడు జ‌నాలు పవన్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏదో మామూలు సోషల్ మీడియా జ‌నాల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు. పవన్ కు ఏం అర్హత వుందనే అనే పాయింట్ మీద గట్టిగా తగులుకున్నారు.

ఈలోగా పవన్ గతంలో చేసిన అనేక ప్రవచనాలు బయటకు రావడం మొదలయ్యింది. తను క్రిస్టియనైజ్‌ చేసారని, జెరూసలాం వెళ్లానని, తన పిల్లలు హార్డ్ కోర్ క్రిస్టియన్లు, అ మతంలో ఎంతో కొంత మంచి వుండడం వల్లే ఎంతో మంది అటు అకర్షితులు అవుతున్నారని ఇలా మాట్లాడిన మాటలు అన్నీ బయటకు వచ్చాయి. జ‌గన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య, పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా? అనే పాయింట్ తీసారు.

మరి కొందరు అసలు పవన్ కు కార్తీ సారీ చెప్పడం ఏమిటి? అది కూడా చేయని తప్పుకు అంటూ విమర్శించారు. అసలు దీక్ష అని చెప్పి, దీక్షా వస్త్రాలు ధరించి షూటింగ్ చేయడం ఏమిటి? అసలు షూటింగ్ కోసమే దీక్ష నాటకం అని ఇంకొందరు విమర్శించారు. మొత్తం మీద సోషల్ మీడియాలో పవన్ కు తొలిసారి చుక్కెదురు అయింది.

లడ్డూలో కల్తీ నెయ్యి అన్నది పక్కకు పోయింది. తాను హిందూత్వ ఐకాన్ అనేలా పవన్ ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నది, కార్తీని టార్గెట్ చేయడం అన్నది ఇస్యూగా మారిపోయింది.

చంద్రబాబు సమస్య అలా

ఇదే టైమ్ లో చంద్రబాబు పలు నామినేటెడ్ పోస్ట్ లు ప్రకటించారు. వాళ్ల దామాషా లెక్కల ప్రకారం తెలుగుదేశం, జ‌నసేన, భాజ‌పా లకు పదవులు కేటాయించారు. ఇలా పదవులు పొందిన వారిలో కొంతమంది అస్సలు తెలియని వారు, కొంతమంది తెలిసిన వారు వున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు దొరకని వారు వున్నారు.

ఇప్పుడు రెండు విధాల అసంతృప్తి నెలకొంది. ఒకటి పదవులు అందుకున్న చాలా మంది ఈ పదవులు తమ లెవెల్ కు సరిపడినవి కాదని ఫీలవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లు కనిపిస్తున్నాయి.

మరోపక్క వీళ్లకు పదవులు ఇవ్వడం ఏమిటి, అయిదేళ్లలో ఎంతో నష్టపోయిన వారు ఎందరో వున్నారు. వాళ్లందరినీ పక్కన పెట్టారు. వాళ్లకి ఇవ్వలేదు అంటూ యాగీ మొదలైంది.

ఇవన్నీ తెలుగుదేశం హ్యాండిల్స్, తెలుగుదేశం జ‌నాలే మొదలుపెట్టడంతో చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది. పదవులు చాలా వున్నాయని, అందరికీ వస్తాయని, క్రమశిక్షణ తప్పి మాట్లాడడం సరికాదని హెచ్చరించాల్సి వచ్చింది. ఎన్ని పదవులు వున్నా, ఎన్ని జాబితాలు వున్నా, అసంతృప్తి అనే ఎక్కడో ఒక మూల వుంటూనే వుంటుంది. ఒకప్పుడు అయితే సోషల్ మీడియా అనేది వుండేది కాదు కనుక, అంత సులువుగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జ‌గన్ ను అన్ని వైపుల నుంచి ఏ సోషల్ మీడియాతో టార్గెట్ చేసారో అదే సోషల్ మీడియా రివర్స్ లో తన అసంతృప్తిని వెళ్లగక్కేసరికి ఇబ్బంది అవుతోంది.

మొత్తం మీద గతంలో మాదిరిగా జ‌నాలు గుడ్డిగా ఫాలో అయిపోతారని, తాము ఏం చేసినా సమర్థించేస్తారని నాయకులు ఇకపై అనుకోవడానికి లేదు. అది ఇప్పుడు పవన్ కు తెలిసి వచ్చే వుంటుంది.

46 Replies to “పవన్.. బాబు.. ఇద్దరూ రెండు విధాలుగా!”

    1. As per the contract between two parties, the product should be returned if the product is found to be sub-standard, but not be seized as food inspectors do. This is my understand, and it is a standard procedure between any two parties (consumer and supplier)

        1. It is standard format to write delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality, then you have to accept whatever is delivered. This has legal binding, and valid in c0urts too.

        2. It is standard format to write delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality, then you have to accept whatever is delivered. This has l3gal binding, and valid in c0/urts too.

        3. It is standard format to write delivery terms, payments terms, quality terms in any purchasing agreement. If you do not cover how do you deal with the poor quality?, then you have to accept whatever is delivered. This has l3gal binding, and valid in c0/urts too.

        4. It is standard format to write delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality?

        5. It is standard format to wr!te delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality, then you have to accept whatever is delivered. This has l3gal binding, and valid in c0/urts too.

  1. మీరు SM లో చేసే నీతిమాలిన propaganda వల్ల ఎంత నష్టం జరిగిందో ఇంకా అర్థం కాలేదా GA…. ఇష్టం లేకపోయినా రేపు ఏడుస్తూ కొండ ఎక్కే మన అన్నయ్య ను అడుగు చెప్తాడు DAMAGE ఎంతో….. ముందు మన ధర్మం ను మనం గౌరవించు కోవడం అలవాటు చేసుకోండి GA….🙏🙏

  2. కుక్క తోక వంకర. జీఏ గాడు జగన్ గురించి ఓ నాలుగు వ్యాసాలు వ్యతిరేకంగా రాసినపుడే అనుకున్నా, వీడు నటిస్తున్నాడని.

  3. .కుక్క_తోక_వంకర. జీఏ గాడు జగన్ గురించి ఓ నాలుగు వ్యాసాలు వ్యతిరేకం గా రాసినపుడే అనుకున్నా, వీడు నటిస్తున్నాడని.

  4. GA నీకు ఇంకా అర్థం కాలేదా లేక కానట్లు నటిస్తున్నావా?

    పవన్ బాబు ఏది చెప్తే అది చేస్తాడు ..ఎందుకంటె పవన్ సీఎం అవ్వాలి అంటే బాబు తప్ప వేరే మార్గం లేదు. ఎ పార్టీ అయిన ఎల్ల కాలం అధికారంలో ఉండడం జరగదు ..ఈ విషం బాబు కి చాలా బాగా తెలుసు. అందుకే ప్రత్యామ్నాయంగా పవన్ ని బాబు అంగీకరించాడు. అంటే ఎదో ఒక రోజు పవన్ సీఎం అవ్వటం కాయం… మనం మాత్రం సోదిలో కూడా ఉండం.. నేను అప్పుడే చెప్పా

  5. కొడి కత్తి, గులక రాయి, ఘొడ్డలి పొటు తరువాత మళ్ళి అలాంటి మరొ నాటకానికి తెర తీసెలా ఉన్నాడు! బొహిసా అందులె తిరుపతి వెల్తునట్టు ఉన్నాడు!

  6. పవన్ నా భర్య క్రిస్టియన్, నా కొతురు కి నా భర్య రష్యలొ బాప్టిసం ఇప్పించింది అన్నరు తప్పితె నెను క్రిస్టియన్ గా మారాను అని చెప్పలెదు!

    పవన్ భార్య మతం ఎక్కడా దాయలెదు. నికార్చు గా చెప్పెస్సారు. జగన్ లాగా హిందువుల దగ్గరికి వెల్లి నెను హిందువుని అని చెప్పుకొలెదు.

    1. పవన్ క్రైస్తవుల బాప్తీస్మము తీసుకున్నాడు

      హిందువులు అది ఒప్పుకోరు!

      జగన్ ఎప్పుడూకూడా తాను క్రైస్తవుడను అని గాని -ఏ మత విషయాలు ఎక్కడా మాట్లాడలేదు! ఎందుకు లేనిపోనివి రాస్తారండి

  7. నేను చెప్పేది మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది ఒక్కటే ఓడిపోయాను అని గెలిచేకి కూటమి కట్టకు దానికన్నా మరణం మేలు జీవితం లో నిలిచి పోతావు

Comments are closed.